గడపకీ గడపకీ మన ప్రభుత్వం అని వైకాపా నేతలు వెళ్తుంటే, సమస్యలపై జనం నిలదీస్తున్నారు. దీంతో చాలా మంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే కార్యక్రమానికి దూరం అవుతూ వచ్చారు. గడప గడపకీ కార్యక్రమంలో ప్రజలు వైకాపా నేతల్ని నిర్బంధించకుండా, నిలదీయకుండా పోలీసుల సాయంతో తప్పించుకునేవారు. ఇది నిన్నా మొన్నటివరకూ వైసీపీ నేతల్ని ప్రజలే తరిమికొట్టే సంఘటనలు ఏపీలో కనిపించేవి. ఇటీవల వైసీపీ కార్యకర్తలే, వైసీపీ ఎమ్మెల్యేలని తరముతున్న వరస సంఘటనలు జరుగుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకరనారాయణని వైసీపీ నేతలే చెప్పులతో తరిమి తరిమి కొట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్న మాజీ మంత్రి శంకరనారాయణను అడ్డుకున్న వైకాపా కేడర్, చెప్పులతో కొట్టి నిరసన తెలపడంతో అక్కడ్నించి పోలీసుల సాయంతో జారుకున్నారు. సోమందేపల్లి మండలం ఈదలబలాపురం పరిధి రేణుకానగర్లో పర్యటించిన శంకరనారాయణను వైకాపా నేతలు అడ్డుకుని నిరసన తెలిపారు. అభివృద్ధి లేదంటూ నిలదీశారు. ఎమ్మెల్యే శంకరనారాయణ పోలీసుల సాయంతో గ్రామంలోకి వెళ్లేందుకు యత్నించడంతో వైకాపా నేతలు, కార్యకర్తలు చెప్పులు విసిరి శంకరనారాయణని వెళ్లగొట్టారు. పోలీసుల సాయంతో అక్కడి నుంచి పరారైన మాజీ మంత్రి శంకరనారాయణ, దీని వెనుక వైసీపీకే చెందిన నాగభూషణ్ రెడ్డి ఉన్నారని అనుమానిస్తున్నారు. వైసీపీ నాయకుడు నాగభూషణం రెడ్డిని ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వైసీపీ పరిస్థితి ఇలా అయిపొయింది ఏంటి ? కార్యకర్తలే వైసీపీ ఎమ్మెల్యేలను చెప్పులతో తరిమికొడుతున్నారు
Advertisements