కర్నూల్ జిల్లా... జగన్ పార్టీకి, కడప తరువాత, అత్యంత బలమైన జిల్లా కర్నూల్.... కాని, జగన్ వ్యవహార శైలి, అతని మూర్ఖత్వం నచ్చక, సంవత్సరం క్రితం, భుమా నాగిరెడ్డి, పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు... అప్పటి నుంచి, కర్నూల్ లో జగన్ పార్టీ కి డౌన్ ఫాల్ మొదలైంది... నంద్యాల ఉప ఎన్నికల దెబ్బతో, జగన్ పార్టీ ఇప్పుడు కర్నూల్ లో చచ్చిన పాము... ఆ చచ్చిన పాముని మరింత చంపటానికి, ఇప్పుడు మరో జగన్ పార్టీ MP రెడీగా ఉంది...

నంద్యాల ఎన్నికల తరువాత, కర్నూల్ జిల్లలో, తెలుగుదేశం పార్టీలో జోష్ కనపడుతుంటే, జగన్ పార్టీ ఏ మాత్రం సోయలో కూడా లేకుండా పోయింది. తాజాగా వైసీపీ MP బుట్టా రేణుక, తెలుగుదేశం పార్టీలో చేరటం దాదపుగా ఖాయం అయ్యింది... ఇదివరకే జంప్ అవ్వాల్సి ఉన్నా, జగన్ ఒత్తిడి మేరకు, ఆమె పార్టీ మారకుండా ఉండి పోయింది.. తాజా పరిస్థుతుల్లో, పార్టీ జిల్లలో ఎక్కడా బలం లేకపోవటం, జగన్ చేస్తున్న తప్పిదాలతో ప్రజల్లో వ్యతిరేకత చూసి, ఆమె పార్టీ మారితేనే భవిష్యత్తు ఉంటుంది అనే అభిప్రాయానికి వచ్చారు...

బైరెడ్డి రాజశేఖర రెడ్డి, మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారు... ఇప్పటికే ప్రాధమిక చర్చులు కూడా అయ్యాయి అని సమాచారం... కర్నూల్ జిల్లాకు చెందిన, ఇద్దరు వైసీపీ ఎమ్మేల్యేలు, హైదరాబాద్ లో, కొంత మంది టిడిపి నాయకులతో భేటి అయ్యి, జగన్ తో వేగలేం అని, ఆయనతో ఉంటే మమ్మల్ని కూడా నాశనం చేస్తాడు అని చెప్పినట్టు సమాచారం... ఈ నెల 19న, చంద్రబాబు కర్నూల్ జిల్లా పర్యటనలోపు, కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి...

ఒక పక్క భుమా కుటుంబం, గంగుల కుటుంబం, కేఈ కుటుంబం, ఎస్పీవై రెడ్డి, ఇప్పుడు కోట్ల కుటుంబం కూడా చేరితే, కర్నూల్ జిల్లాలో, జగన్ పార్టీకి కాండిడేట్ కూడా మిగిలే అవకాసం లేదు... శిల్పా కుటుంబం తప్పితే, కర్నూల్ జిల్లలో, పోటీకి నుంచునే సాహసం కూడా ఎవ్వరూ చేసేలా లేరు...

బలమైన జిల్లలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక మిగతా జిల్లాల సంగతి ఎంటా అని, పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు... ఇక కర్నూల్ లో, అన్-ఆఫీషయల్ గా స్కూల్ మూసేసినట్టే అంటున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read