ఏపీలో చాలా విచిత్రమైన లా అండ్ ఆర్డర్ పరిస్థితులున్నాయి. వైసీపీ వాళ్లు దాడిచేసినా కేసులు ఉండవు, గాయపడిన విపక్షాలు కేసు పెట్టినా నమోదు చేయరనే ఆరోపణలున్నాయి. అలాగే వైసీపీ నేతలు సీఎంతో సహా రోడ్లపై ర్యాలీలు, సభలు, ఊరేగింపులు పెడుతుంటే అడ్డురాని నిబంధనలు నారా లోకేష్ పాదయాత్రలో అడుగడుగునా పోలీసులకు గుర్తొస్తున్నాయి. యువగళం పాదయాత్ర ప్రారంభించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పది రోజులు మూడు నియోజకవర్గాలలో నడిచేసరికి ఇప్పటివరకూ నాలుగు కేసులు నమోదు చేశారు. ఇవి కూడా వేర్వేరు పోలీసుస్టేషన్లలో నమోదు చేయడం మరో విచిత్రం. ఈ నాలుగు కేసుల్లోనూ పోలీసులే ఫిర్యాదుదారులు కావడంతో, పోలీసుల వెనక ఉండి ఎవరో నమోదు చేయిస్తున్నారని అర్థం అవుతోంది. నారా లోకేశ్ తోపాటు ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టిడిపినేతలు అమర్‍నాథ్ రెడ్డి, పులివర్తినాని, దీపక్‍రెడ్డి, జయప్రకాష్, జగదీష్, కోదండయాదవ్‍లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. యువగళం పాదయాత్ర అస్సలు ముందుకు సాగకూడదనే ఆదేశాలు అందుకున్నారేమో పోలీసులు ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. పాదయాత్రని అడుగడుగునా అడ్డుకుంటూనే వస్తున్నారు. టీడీపీ నేతలు, యువగళం వాలంటీర్లపై వేధింపులు తీవ్రం చేశారు ఖాకీలు. అక్రమకేసులు, దాడులతో పాదయాత్రలో పాల్గొనకుండా చేయడమే పోలీసుల లక్ష్యంగా కనిపిస్తోంది.
యువగళం నారా లోకేష్‌పై అక్రమ కేసులకు పోలీసులే ఫిర్యాదు``దారులు``
Advertisements