ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన వై.వి. సుబ్బారెడ్డి పార్టీ అధినేత జగన్‌కు అతి సమీప బంధువు. దివంగత సీఎం వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి సతీమణి, వైవీ సతీమణి సొంత అక్కాచెల్లెళ్లు. గత ఎ న్నికల సమయంలో ఆయన ఒంగోలు లోక్‌సభ నియోజక వర్గ టికెట్టు ఆశించగా మాజీమంత్రి, వైవీకి సొంత బావ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి తొలుత వ్యతిరేకించారు. ఒకే ఇంటి వారం పోటీలో ఉంటే ఇబ్బంది వస్తుందన్న బాలినేని వాదనను చివరిలో పక్కకు నెట్టి వైవీకి అవకాశం ఇ చ్చారు. ఆ ఎన్నికల్లో వైవీ గెలుపొందగా బాలినేని ఓటమి చెందారు. ఆ తర్వాత క్రమేపీ బాలినేని, వైవీ మధ్య మ నస్పర్థలు పెరిగాయి. తిరిగి ఎన్నికల వ్యూహం ప్రారంభ మైన దశలోనే వైవీకి ఇతర జిల్లాల బాధ్యతలను జగన్‌ అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను పోటీకి దూరంగా ఉంచి పార్టీ సేవకు ఉపయోగించుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. తొలి నుంచి వైవీ మాత్రం తిరిగి తానే పోటీ చేస్తానని, వెనక్కి తగ్గేది లేదని చెప్తూ వచ్చారు. జిల్లాలో ఇతర పార్టీల నుంచి కొందరిని పార్టీలో చేర్చుకునే వ్యవహారంపై వైసీపీకి చెందిన రాజ్యసభ స భ్యుడు విజయసాయిరెడ్డి దృష్టిసారించారు.

స్థానికంగా ఉన్న బాలినేని, వైవీలను పక్కనపెట్టి జిల్లాలో కొందరు నాయకులను ఆకర్షించే కార్యక్రమానికి ఆయన్ను పార్టీ రంగంలోకి దించింది. దగ్గుబాటి కుమారుడు హితేష్‌, చీరాల ఎమ్మెల్యే ఆమంచి పార్టీలో చేరడంతోపాటు మా గుంట కూడా పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ విషయంలో ఢోకా లేదని విజయసాయిరెడ్డి పార్టీ ముఖ్య నాయకులకు తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఇదేసమ యంలో మాగుంట టీడీపీ నుంచి తాను పోటీ చేయబో నని ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టం చేశారు. అయితే వైసీపీలో చేరతానని ఆయన ఎక్కడా చెప్పలేదు. పోటీ చేయకపోయినా టీడీపీలోనే కొనసాగుతానని చెప్తున్నారు. కానీ ఆయన పార్టీలోకి రావడం ఖాయమన్న ప్రచారం వైసీపీ శ్రేణుల్లో జరిగిపోయింది. అందుకు విజయసాయి రెడ్డి ఇచ్చిన సమాచారమే కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం వై.వి. సుబ్బారెడ్డి హడా వుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన మనసు లోని మాటను బయటపెట్టేశారు. ఈ ఎన్నికల్లోనూ కాదు, వచ్చే ఎన్నికల్లోనూ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది తానేనని ప్రకటించారు. అంతటితో ఆగకుండా మాగుంటను హేళను చేస్తూ వ్యాఖ్యానాలు చేశారు. బాలినేని విషయంపై విలేఖరులు ప్రశ్నించినప్పు డు కూడా ఎవరికైనా టికెట్టు ఇచ్చేది జగనే అంటూ ఇక్కడ వేరేవారి పాత్ర ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. దీంతో వైసీపీ నాయకుల్లో కలకలం ప్రారంభమైంది.

హైదరాబాద్‌లో ఉన్న లోటస్‌పాండ్‌లో వైవీ సుబ్బారెడ్డి తన కుటుంబసభ్యులతోపాటు జగన్‌ను కలిసినట్లు తెలిసింది. వారిలో వైవీ సతీమణితోపాటు, కుమారుడు, సోదరులు కూడా ఉన్నారని అంటున్నారు. వీరు కలిసిన వెంటనే జగన్‌ ‘అలాంటి ప్రకటన మీరెందుకు చేశారు. మనం ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎక్కడికక్కడ చేర్పులు, మార్పులు చేసుకుంటున్నాం. ఆవిషయం మీకూ తెలుసు. అవసరమైతే మనమే తగ్గి ముందుకు సాగాలి. అలాంటిది మీరే ఆ విధమైన ప్రకటన చేస్తే ఎలా?’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. అంతటితో ఆగకుండా ‘ఒంగోలు నుంచి మీరు పోటీ చే సేందుకు అవకాశం లేదు. అక్కడ మాగుంట పోటీ చేస్తారా, మరెవరైనా రంగంలో ఉంటారా అన్నది అప్రస్తు తం. మీరైతే రాష్ట్రస్థాయిలో పార్టీ అప్పగించిన బాధ్యతలను చూడండి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుందాం’ అని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం జరిగిన జగన్‌ గృహప్రవేశం, వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వైవీ హాజరుకాలేదు. ఇలాంటి సందర్భాలన్నింటిలో జగన్‌ తల్లి విజయలక్ష్మి పక్కనే ఉండే వైవీ సతీమణి కూడా కన్పించలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read