కేవలం రాజకీయం కోసం, చంద్రబాబుని సాధించటం కోసం, కూలి పని చేసుకునే వాళ్ళ నోట్లో వైసీపీ ఎంపీలు మట్టి కొట్టిన సంగతి తెలిసిందే... ఉపాధి కూలీలకి డబ్బులు ఇవ్వద్దు అంటూ, ఏకంగా కేంద్రానికే లేఖలు రాపించాడు జగన్...
గురువారం వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు మండలం ఈతముక్కల గ్రామంలో జరుగుతున్న హస్తకళల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంలో, అక్కడే ఉన్న ఉపాధి హామీ పథకం కూలీలు వైవీ సుబ్బారెడ్డిని అడ్డుకున్నారు. తప్పుడు ఫిర్యాదులతో కూలీ రాకుండా చేశారని ఆందోళన చేశారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నేలకున్నాయి..
పేదల కోసం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎంపీలు అవినాశ్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖలు రాసి ఆ నిధులు రాకుండా నిలిపివేయించారు. జులై 20న వైవీ సుబ్బారెడ్డి, మే 11న అవినాష్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు... దీంతో రూ. 11 వందల కోట్ల ఉపాధి హామీ బిల్లులు ఆగిపోయిన సంగతి తెలిసిందే...
మొన్నా మధ్య రోజాను కూడా నంద్యాల ప్రజలు ఇలాగే తరిమి కొట్టారు... శిల్పా సోదరులుని, రెండు రోజులు ఇంటి నుంచి బయటకు రాకుండా ఆందోళన చేశారు.. ఎక్కడైనా ప్రభుత్వంలో ఉన్నవారి మీద వ్యతిరేకత ఉంటుంది కాని, మనం చేసుకున్న పనుల వల్ల, ప్రతిపక్షంలో ఉన్న మనకు ప్రజల వ్యతిరేకత తగులుతుంది అని జగన్ పార్టీ సీనియర్ నాయకులు అనుకుంటున్నారు...