అక్టోబర్ లో అమెరికా పర్యటన చేసిన ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ తొలి ఫలితం గ్రౌండ్ అవుతుంది. జోహో కంపెనీ చీఫ్ ఎవాంజలిస్ట్ రాజు వేగేశ్నను మంత్రి నారా లోకేష్ కలిసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటి అభివృద్ధి కి తీసుకుంటున్న చర్యల గురించి లోకేష్ ఆయనకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ ఐటీ పరంగా చేస్తున్న కృషిని లోకేష్ వివరించిన తీరు జోహో కంపెనీని ఆకట్టుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ స్థాపించేందుకు జోహో సంస్థ ముందుకొచ్చింది.
అయితే ఈ వార్తా అప్పట్లో బయటకు వచ్చినప్పుడు, లోకేష్ ఏంటి జోహో లాంటి ప్రతిష్టాత్మకమైన కంపనీని మన రాష్ట్రానికి తీసుకురావటం ఏంటి, ఇది అంతా పుబ్లిసిటీ స్టంట్ అంటూ ఎగతాళి చేసారు... ఇప్పుడు లోకేష్ చొరవతో అమెరికాలోని కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీ, జోహో జనవరి 13న తిరుపతిలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది... నిజానికి జోహో తన కార్యాలయం నిర్మించటానికి టైం పడుతుంది కాబట్టి, ముందుగా తాత్కాలిక కార్యాలయంలో ప్రారంభించాలి అని, మీ పనులు చేస్తుకుంటూ, కార్యాలయం నిర్మించుకోవలాని లోకేష్ చెప్పిన సూచనతో జోహో జనవరి 13న తిరుపతిలో తాత్కాలిక కార్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభించనుంది...
చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం పనిచేసే ఈ సంస్థ ద్వారా 5వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. జోహో కంపనీ క్లౌడ్ ERP సర్వీసెస్ లో మంచి పేరు ఉన్న కంపెనీ... జోహో తిరుపతిలో డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పనుంది.. ఇప్పటికే గూగుల్ ఎక్స్ కంపెనీని విశాఖపట్నం వచ్చేందుకు ఒప్పించిన నారా లోకేష్ మరో ప్రతిష్టాత్మక కంపెనీ ఏపీకి వచ్చేందుకు చేసిన కృషి ఫలించింది.