ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు రెండు కీలక కేసులు పై విచారణ జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పటికీ కౌంటింగ్ నిర్వహించలేదని, దీనికి సంబంధించి తెలుగుదేశం, జనసేన వేసిన పిటీషన్ల పై, హైకోర్టు సింగల్ బెంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ, సుప్రీం కోర్టు మార్గాదర్శక సూత్రాలు పాటించకపోవటం పై, నెల రోజులు వ్యవధి అమలు చేయకపోవటం పై, మళ్ళీ రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది సింగల్ బెంచ్. అదే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్, సుప్రీం కోర్టు తీర్పుని కూడా సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయారని తీవ్రమైన వ్యాఖ్యలు కూడా బెంచ్ చేసింది. ఈ నేపధ్యంలోనే, సింగల్ బెంచ్ తీర్పుని సవాల్ చేస్తూ, రాష్ట్ర హైకోర్టు డివిజినల్ బెంచ్ లో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ కూడా ఈ బెంచ్ లో ఉన్నారు. ధర్మాసనం ముందు ఈ రోజు విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ, సింగల్ బెంచ్ ఇచ్చిన, కేవలం రీ నోటిఫికేషన్ జడ్జిమెంట్ ఆదేశాలు పై మాత్రమే స్టే విధించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మాత్రం, ఈ పిటీషన్ పరిష్కారం అయ్యే వారకు, ఎట్టి పరిస్థితిలోను నిర్వహించ వద్దని ఆదేశాలు జారీ చేసింది.

neelam 25062021 2

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయినా కూడా ఈ రోజు వరకు కూడా కౌంటింగ్ నిర్వహించలేదు. సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించలేదని, సింగల్ బెంచ్ రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన రిట్ అపీల్ పై, డివిజనల్ బెంచ్ లో విచారణ జరిగింది. ఈ విచారణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరుపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రిట్ అపీల్ కు సంబంధించి, కేవలం రీ నోటిఫికేషన్ కు సంబంధించిన దాని పైన ఏమైతే ఉత్తర్వులు ఇచ్చారో, కేవలం దాని పైనే స్టే విధిస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది. అయితే ఎన్నికల కౌంటింగ్ విషయంలో మాత్రం, ఈ రిట్ అపీల్ పరిష్కారం అయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను జూలై 27 వ తేదీకు వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు కూడా కౌంటింగ్ కూడా జరిగే అవకాసం లేదు. మరి దీని పై ప్రభుత్వం తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read