ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, కొద్ది సేపటి క్రితం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసి, జెడ్పీటీసి ఎన్నికలు నిలిపివేయాలి అంటూ, తెలుగుదేశం పార్టీ వేసిన పిటీషన్ పై, కొద్ది సేపటి క్రితం ఈ తీర్పుని వెలువరించింది. ముఖ్యంగా సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించకుండా, ఎందుకు ముందుకు వెళ్ళారని ప్రశ్నిస్తూ, ఈ నెల ఒకటిన ఎన్నికలు జరుపుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహనీ ఇచ్చిన నోటిఫికేషన్, ఎన్నికల ప్రక్రియను, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరుకు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా స్టే జారీ చేసింది. గత ఏడాది మార్చ్ 15 వ తేదీన, క-రో-నా కారణంగా ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం పై స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. దీని పై సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ, ఒక కీలక అంశం పేర్కొంది. ఎన్నికల వాయిదా వేస్తూ అప్పటి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్దిస్తూనే, మరో వైపు ఈ సారి ఎన్నికలు నిర్వహించే ముందు, ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, ప్రధానంగా నోటిఫికేషన్ ఇవ్వటానికి, పోలింగ్ జరగటానికి మధ్యలో 28 రోజులు సమయం ఉండాలని, గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సారి, మాత్రం, నీలం సాహనీ నోటిఫికేషన్ ఇస్తూ, ఒకటో తారీఖు బాధ్యతలు స్వీకరించి, సాయంత్రం నోటిఫికేషన్ ఇచ్చి, ఎనిమిదో తేదీ ఎన్నికలు అంటూ, ప్రకటించారు.
అయితే ఈ నోటిఫికేషన్ ని సవాల్ చేస్తూ, హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. జనసేన, బీజేపీతో పాటుగా, తెలుగుదేశం కూడా ఈ పిటీషన్ లు దాఖలు చేసారు. ఈ పిటీషన్ లలో ప్రధానంగా, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించటం, రాజ్యాంగ, న్యాయ, చట్ట విరుద్ధం అని చెప్పి పేర్కొన్నారు. ముఖ్యంగా నోటిఫికేషన్ కు , పోలింగ్ కు మధ్య, 28 రోజులు సమయం ఉండాలని చెప్పి, సుప్రీం కోర్టు పెర్కొందో, ఈ సారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ఆ నిబంధనలు పాటించలేదని, న్యాయవాదులు వాదించారు. గతంలో మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో, 28 రోజులు నిబంధన పాటించరని, ఈ సారి మాత్రం సుప్రీం కోర్టు నిర్ణయం పాటించలేదని నిలదీశారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధానంగా సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించకపోవటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తదనంతర ప్రక్రియ నిలిపివేయాలని, ఈ పిటీషన్ ల తదుపరి విచారణ చేస్తామని హైకోర్టు చెప్పింది.