pulivendula water 09012017

పులివెందుల వాసులకు ఈనెల 11న ముందే సంక్రాంతి పండుగ రానుంది. గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా ఆ రోజు కృష్ణాజలాల ను పులివెందులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. ఎంతో కాలంగా గండికోట ఆయకట్టు రైతాంగం ఎదురుచూస్తున్న కృష్ణమ్మ నీరు, పులివెందుల గడ్డ పై సవ్వడి చేయ్యనుంది. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులకు సాగు, తాగునీరు ఇచ్చే, నా సొంత నియోజికవర్గం కుప్పంకు నీళ్ళు తీసుకువెళ్తా అన్న చంద్రబాబు, ఆ దిశగా ప్రయత్నాలు చేసారు. నాలుగు దశాబ్దాల వైఎస్ కుటుంబ రాజకీయంలో పులివెందులకు పూర్తి స్థాయిలో నీరు ఇవ్వకపోయిన విషయాన్ని గుర్తించారు చంద్రబాబు.

అందులో భాగంగానే ఏదో విధంగా ఇటు అనంతపురం పరిసర ప్రాంతాలు, కడప జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పులివెందులకు సాగు, తాగు నీరు ఇచ్చేందుకు గండికోట ప్రాజెక్టు, అనంతపురం జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్స్టింగ్ రిజర్వాయర్ల పై ప్రత్యేక దృష్టిపెట్టారు. గండికోట రిజర్వాయర్ ఎత్తిపోతల పధకం నుంచి ఈ నెల 11వ తేదీన పైడిపాలెం ప్రాజెక్టుకు నీరిచ్చి తద్వారా పులివెందుల నీటి కష్టాలు తీర్చేందుకు స్వయంగా చంద్రబాబు రంగాన్ని సిద్ధం చేశారు. ఇకపోతే గండికోట నుంచి కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాలకు కూడా నీరిచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేపట్టారు.

ఈ నెల 11వ తేదీన గండికోట నుంచి పులివెందులకు నీరు వదిలేందుకు గత రెండు మాసాలుగా కృష్ణా జలాలను అవుకు ప్రాజెక్టు ద్వారా గండికోటలో ప్రస్తుతానికి 12 టిఎంసిల నీటిని నిల్వచేశారు. అక్కడి నుంచి ఎత్తిపోతల పథకం కింద 9 పైపులు ఏర్పాటు చేసి పైడిపాలెం రిజర్వాయర్ కు నీరు పంపి 6 టిఎంసిల నీరు నిల్వ చేయనున్నారు. తద్వారా 5 మీటర్ల ఎత్తుతో 17 కి.మీ పొడవనా పైడిపాలెం నుంచి హిమకుంట్ల చెరువకు నీరు చేరి తద్వారా పులివెందుల నియోజకవర్గంలో 67 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.

అలాగే పైడిపాళెంకు నీరివ్వాలన్న సంకల్పంతో సుమారు రెండేళ్ళుగా దీక్ష పూనిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి 11వ తేదీనే దీక్ష విరమించి గడ్డం తీయించుకోనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read