ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - మార్చి 29, 2016
వేదిక: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
జగన్ అడ్డంగా పడుకొన్నా సరే పులివెందులకీ నీళ్లిస్తాం... నా సొంత నియోజకవర్గం కుప్పం కంటే ముందుగా కృష్ణా జలాలను పులివెందులకు తీసుకొస్తా... మీ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా... ఎవరు అడ్డుకున్నా సరే... పులివెందులకు నీరు ఇవ్వడం ఖాయం... నీ పులివెందులకే వస్తా, అడ్డంపడ్డావని చెప్తా, దండం పెడ్తా నీళ్ళు ఇస్తాను అంటే అడ్డుపడకు.... వెకిలి నవ్వులు ఆపు .. దండం పెడ్తా నీళ్ళు ఇస్తాను అంటే అడ్డుపడకు... విపక్ష ఎమ్మెల్యేలు గెలిచినచోట్ల సహా 175 నియోజకవర్గాలకు నీళ్లిస్తా... ఈ విషయాన్ని సభ సాక్షిగా చెబుతున్నా...
ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చి 29,2016 వ తేదీన చేసిన ఛాలెంజ్.... సంవత్సరం కూడా తిరగకుండానే, ఛాలెంజ్ చేసినట్టుగానే, ఇవాళ పులివెందులకి నీళ్ళు ఇస్తున్నారు చంద్రబాబు. నాలుగు దశాబ్దాల వైఎస్ కుటుంబం చెయ్యలేనిది, చంద్రబాబు చెప్పట్టం కాదు, చేసి చూపించారు.
గండికోట రిజర్వాయర్ ఎత్తిపోతల పధకం నుంచి ఇవాళ పైడిపాలెం ప్రాజెక్టుకు నీరిచ్చి తద్వారా పులివెందుల నీటి కష్టాలు తీర్చేందుకు స్వయంగా చంద్రబాబు రంగాన్ని సిద్ధం చేశారు. కృష్ణా జలాలను అవుకు ప్రాజెక్టు ద్వారా గండికోటలో ప్రస్తుతానికి 12 టిఎంసిల నీటిని నిల్వచేశారు. అక్కడి నుంచి ఎత్తిపోతల పథకం కింద 9 పైపులు ఏర్పాటు చేసి పైడిపాలెం రిజర్వాయర్ కు నీరు పంపి 6 టిఎంసిల నీరు నిల్వ చేయనున్నారు. తద్వారా 5 మీటర్ల ఎత్తుతో 17 కి.మీ పొడవనా పైడిపాలెం నుంచి హిమకుంట్ల చెరువకు నీరు చేరి తద్వారా పులివెందుల నియోజకవర్గంలో 67 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.
దేవినేని ఉమా - మార్చి 9, 2016
వేదిక: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
"జగన్ రాసి పెట్టుకో… పులివెందులకి నీళ్ళు ఇచ్చి, మీ ఊరిలో సన్మానం చేయించుకుంటా" అసెంబ్లీలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ చేసిన చాలెంజ్....
మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి - 2015
వేదిక: పులివెందుల, కడప జిల్లా
అలాగే పైడిపాళెంకు నీరివ్వాలన్న సంకల్పంతో సుమారు రెండేళ్ళుగా దీక్ష పూనిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి ఇవాళ దీక్ష విరమించి గడ్డం తీయించుకోనున్నారు
రాజకీయాల్లో ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ఉండే ఛాలెంజ్ లు ఉంటే, అటు ప్రజలకీ లాభం ఉంటుంది, మంచి పనులు చేస్తున్నారు అనే ఇమేజ్ రాజకీయ నాయకులకి వస్తుంది... ఉత్తమ కుమార ప్రగల్భాలు పలకటం కాదు, ఇలా పనులు చేసి ప్రజల మనసులు దోచుకోవాలి..
Watch @ 16.00 mins