అనారోగ్యంతో ఉన్న 86 ఏళ్ల రామోజీరావుని విచారణ పేరుతో ఏపీ సీఐడీని పంపి, వారు పంపిన ఫోటోలతో వైసీపీ చేసిన వికృత రాజకీయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటో పెట్టుకుని వైసీపీ, సాక్షి, వైసీపీ సోషల్ మీడియా, ఈనాడు నుంచి తీసేసిన జర్నలిస్టులు, ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా కమ్మకులంపై ఏడ్చే హైదరాబాద్ మలబద్ధక మేధావులు పండగ చేసుకుంటున్నారు. రామోజీరావు బెడ్డుపై ఉన్న ఫోటో బయటపెట్టి తామేదో గొప్ప ఘనకార్యం సాధించినట్టు చంకలు గుద్దుకుంటున్నారు. అయితే 86 ఏళ్ల వృద్ధుడు అయిన తాతలు, తండ్రులు చాలా మందికి బతికే లేరు. ఆ వయస్సులో వృద్ధాప్య సమస్యలకి తోడు అనారోగ్యం వెంటాడుతూనే ఉంటుంది. నిత్యమూ వైద్యుల పర్యవేక్షణలో, ఎవరో ఒకరి సహాయం లేనిదే తినలేని స్థితిలో ఉన్న పండుటాకుల్ని హింసించడం శాడిజం అన్నది మాత్రం అక్షరసత్యం. జగన్ ఒక్క బాణంతో రామోజీరావుని అంపశయ్యపై పడేశాడని పెద్ద పెద్ద వ్యాసాలు రాస్తున్న అక్కసు అక్షర సైనికులకు 24 గంటల్లోనే రామోజీరావు భీష్మ అంశ ఎఫెక్ట్ తగిలింది. రామోజీ ఫోటోలు వేసుకుని వికృతమైన పోస్టులు రాసి ఆనందం పొందుతున్న 24 గంటలు పూర్తవకముందే ఇంట్లో వ్యాయామం చేస్తూండగా జగన్ రెడ్డికి కాలు బెణికింది. దీనిపై ఏపీ సీఎం హ్యాండిల్ నుంచి ట్వీట్ వేశారు. ఆ ట్వీటుకి రామోజీ ఫోటో జతచేసి సోషల్ మీడియాలో కొందరు తెగ వైరల్ చేస్తున్నారు. మార్గదర్శిని కెలికాడు, రోజుకొక బ్యానర్ ఐటమ్‌తో వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. మంచం మీదున్న రామోజీరావు ఫోటో రిలీజ్ చేశాడు. తన కాలే బెణికి కడప పర్యటన రద్దు చేసుకున్నాడంటూ వ్యంగ్యంగా ఎత్తి చూపుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొలదీ తన కక్ష సాధింపు ధోరణితో మూర్ఖంగా వెళితే అతి ఎక్కువ సర్కులేషన్ గల ఈనాడు మీడియా పరంగా చేసే నష్టం జగన్ రెడ్డికి జీవితంలో తిరిగి తెచ్చుకోలేనంతగా జరిగే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.
రామోజీరావు భీష్మ అంశ..24 గంటల్లో జగన్ కి కొట్టేసింది
Advertisements