విజయవాడ వాసుల మరో కల త్వరలోనే తీరబోతోంది... పని సైలెంట్ గా సాగిపోతుంది... విజయవాడ తూర్పు MLA గద్దె రామ్మోహన్ కృషితో, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, ఎన్నో వ్యయ ప్రయాసలు తట్టుకొని, కృష్ణ నది ఒడ్డున ఉన్న కృష్ణలంక ప్రాంత వాసుల ముంపు శాశ్వతమైన నివారణకు కరకట్టకు రిటైనింగ్ వాల్ పనులను జోరుగా సాగుతున్నాయి.
గత రెండు దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ సమస్యకు చంద్రబాబు సర్కార్ పరిష్కారం చూపింది. కృష్ణానదికి వరద ప్రవాహం వచ్చినప్పుడల్లా, నదీ తీర ప్రాంతంలో నివసించే కృష్ణలంక, రామలింగేశ్వరనగర్ ప్రాంతం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటారు. గత ప్రభుత్వాలు “రిటైనింగ్ వాల్” నిర్మిస్తామని ఎన్ని సార్లు చెప్పినా, అది వాస్తవరూపం దాల్చలేదు. ఇలా నోటి మాటలకే పరిమితమైన దీనిని ప్రస్తుత చంద్రబాబు సర్కార్ కార్యరూపంలో పెడుతోంది. వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యతను నేను తీసుకుంటాను అని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన గద్దె రామ్మోహన్, ఆ బాధ్యతను నెరవేస్తున్నారు. ఈ రోజు MLA గద్దె రామ్మోహన్ రిటైనింగ్ వాల్ పనులను సందర్శించారు. ఇంకా వేగవంతంగా పనులు చేయాలని సూచించారు.
కృష్ణా రిటైనింగ్ వాల్ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయం అని ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇప్పటికే రూ.105 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. సాయిల్ టెస్ట్ వల్ల వాల్ నిర్మాణ అంచనా వ్యయం పెరగడంతో ఆ నిధులు కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అంచనా వ్యయం ఎన్ని కోట్లు పెరిగినా నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉమా స్పష్టం చేశారు.
“రిటైనింగ్ వాల్” నిర్మాణంతో ఎంతటి వరద నీరు వచ్చినా కూడా నగర వాసులు భయపడాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ముంపు ప్రాంతాల వాసులు హర్షం వ్యక్తం చేసారు.
ఒక పక్క విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పనులు, త్వరలో బెంజ్ సర్కిల్ నుండి 4 లైన్ల రహదారి విస్తరణ .... మరొక పక్క రిటైనింగ్ వాల్ పనులు చక చక .. ఇంకొక పక్క గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ.. అందమైన రోడ్లు, పారిశుధ్యం... అన్ని మౌలిక సదుపాయాలతో ఇక విజయవాడ అభివృద్దే అభివృద్ధి ... చంద్రబాబు నాయకత్వంలో విజయవాడ రూపు రేఖలు మారిపోతున్నాయి అనటంలో సందేహమే లేదు అంటున్నారు విజయవాడ వాసులు.