satish reddy 05012017

మనం రొజూ ఎన్నో రాజకీయ ఛాలెంజ్ లు చూస్తూ ఉంటాం... ఒకడు నీ అంతు చూస్తా అంటాడు... ఇంకొకడు రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటాడు.. ఇంకొకడు సెంటర్ కు రా తేల్చుకుందాం అంటాడు... ఇంకొకడు నేను తలుచుకుంటే, గంటలో నువ్వు పడిపోతావ్ అంటాడు... చివరకి ఏమీ జరగదు, ముఖ్యంగా ప్రజలకు, రవ్వంత అయినా ఉపయోగం ఉండదు... పేపర్లో న్యూస్ ఐటెం కి, టీవీ లో బైట్ కి, ఫేస్బుక్ లో స్టేటస్ కి మాత్రమే ఇలాంటివి ఉపయోగపడతాయి... ఏ మాటకామాట, ఈ విషయంలో విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను అభినందించాలి.. తెలంగాణా వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని, ఆ మాట మీదే ఇప్పటివరకు ఉన్నారు. రాజగోపాల్ ను కొంచెం సేపు పక్కన పెట్టి, వర్తమానంలోకి వద్దాం... ఇలాంటి రాజకీయ ఛాలెంజ్ లో నుంచే ఒక ఛాలెంజ్ వచ్చింది... కాని ఇది ప్రజలకు ఉపయోగపడే ఛాలెంజ్.. ఇప్పుడు ఆ ఛాలెంజ్ నెరవేరి, ప్రజలకు ఉపయోగపడబోతుంది...

వివరాల్లోకి వెళ్తే, SV సతీష్ కుమార్ రెడ్డి... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్... పులివెందుల నియోజకవర్గంలో ఏళ్ళ తరబడి YS కుటుంబం ఎదురు నిలబడి ఎదుర్కొన్న ఒకే ఒక వ్యక్తి... ఎటువంటి క్రిమినల్ చరిత్ర లేదు... యువకుడిగా ఉన్నప్పటినుండే రాజకీయంగా YS కుటుంబాన్ని ఎదిరించాడు... మొదట్లో పులివెందులలో 130000 ఓట్లు ఉంటే YS కి 110000 మెజారిటీ వచ్చేది... గ్రామాల్లో రెండు గ్రూపులు ఉంటే, రెండు గ్రూపులూ రాజారెడ్డి మాటలు వినాల్సిందే.. అతి భారీ మెజారిటీ తో గెలుస్తున్న YS కుటుంబం మెజారిటీ తగ్గిస్తూ వస్తున్న సతీష్ రెడ్డి, రెండేళ్ళ క్రితం, గండికోట రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను పైడిపాళెం ప్రాజెక్టుకు తీసుకొచ్చి పులివెందుల ప్రాంత రైతులకు నీరు అందిస్తానని, అప్పటి వరకు గడ్డం తియ్యను అని ఛాలెంజ్ చేసారు. దాదాపుగా 18 నెలలుగా దీక్ష చేస్తూనే ఉన్నారు. పులివెందులలో నీళ్లు పారితేగానీ గడ్డం తీయనన్నారు. అన్నట్లుగానే ఆనాటి నుంచి నేటి వరకు ఆయన గడ్డం తీసుకోలేదు.

అప్పటి నుంచి, ఈ ప్రాజెక్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వంతో మాట్లాడటం, ఇరిగేషన్ అధికారులతో నిత్య సంప్రదింపులు, నిర్వాసితులను బుజ్జగించటం లాంటి ఎన్నో పనులు చేస్తూ, ప్రాజెక్ట్ పనుల వేగాన్ని పెంచారు. అయితే సతీష్ రెడ్డి గడ్డం తీసుకునే రోజు వచ్చింది. గండికోటకు నీళ్లు వచ్చేసాయి. పులివెందులలో నీరు పారబోతోంది. పైడిపాలెం చెరువుకు నీళ్లొస్తే.. గ్రౌండ్ వాటర్ లెవల్ పెరిగి పులివెందులలోనూ రెండు పంటలు పండే రోజులు వస్తాయి. చీనీ, అరటి తోటలకు ప్రాణం వస్తుంది. 11వ తేదీ ముఖ్యమంత్రి పైడిపాళెంకు కృష్ణా జలాలను ఇచ్చేందుకు పంపింగ్‌ పథకాలను ప్రారంభించనుండడంతో ఆ రోజుతో సతీష్ రెడ్డి సంకల్ప దీక్ష నెరవేరనుంది. దీంతో ఆయన పైడిపాళెంకు సమీపంలో ఉన్న సాయిబాబా గుడి వద్ద గడ్డం తీయించుకుని దీక్ష విరమించనున్నారు.

రాజకీయాల్లో ఇలాంటి ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ఉండే ఛాలెంజ్ లు ఉంటే, అటు ప్రజలకీ లాభం ఉంటుంది, మంచి పనులు చేస్తున్నారు అనే ఇమేజ్ రాజకీయ నాయకులకి వస్తుంది... ఉత్తమ కుమార ప్రగల్భాలు పలకటం కాదు, ఇలా పనులు చేసి ప్రజల మనసులు దోచుకోవాలి..

Advertisements

Advertisements

Latest Articles

Most Read