వేసవి సెలవుల్లో ఉల్లాసంతో పాటు ఆధ్యాత్మిక భావన పెంచుకునేందుకు దుర్గగుడి దేవస్థానం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు జిల్లాలోని పలు ఆధ్యాత్మిక ఆలయాలను సందర్శించేలా ఈ టూర్ ప్రణాలిక రూపొందించారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద రోజూ జరిగే పంచహారతులకు మరింత ప్రాచుర్యం కలిగించేలా సంగమ దర్శనం కూడా కల్పించారు. ఈ టూర్ ప్యాకేజీలలో టికెట్ కొన్న భక్తులకు దుర్గగుడి దేవస్థానంలో రూ.300 టికెట్ క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్ల చేస్తున్నారు. దుర్గమ్మ దర్శనంతో పాటు అమ్మవారి ఆలయానికి చుట్టుపక్కల ఉన్న ఆలయాలను కలుపుతూ ఈ ప్యాకేజీలను సిద్దంచేశారు. ప్రముఖ ఆలయాలతోపాటు నదీతీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో ఆహ్లాదంగా గడిపేందుకు వీలు కలుగుతుంది. టూర్ ప్యాకేజీల కింద కెనాల్ రోడ్డులోని రథం సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ల నుంచి బస్సులు బయలుదేరుతాయి. కొన్ని ప్యాకేజీలలో దేవస్థానమే ఉచిత అన్నదాన ప్రసాదాలను అందిస్తుంది.
ప్యాకేజి 1:
బస్సు బయలుదేరు సమయం: ఉదయం 9 గంటలకు
యాత్ర ముగిసే సమయం: మధ్యానం 12 గంటలకు
టికెట్ ధర: రూ:500
దర్శించుకునే క్షేత్రాలు: దుర్గగుడి దేవస్థానంలో రూ.300 టికెట్ తో అంతరాలయ దర్శనం, పోలకంపాడు రామలింగేశ్వర స్వామి ఆలయం, నులకపేట తపోవనం మాతాశ్రీ ఆశ్రమం, మంగళగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, ఖాజా శ్రీ నారాయణం తీర్ధం
ప్యాకేజి 2:
బస్సు బయలుదేరు సమయం: మధ్యానం 3 గంటలకు
యాత్ర ముగిసే సమయం: సాయంత్రం 7 గంటలకు
టికెట్ ధర: రూ:1200
దర్శించుకునే క్షేత్రాలు: దుర్గగుడి దేవస్థానంలో రూ.300 టికెట్ తో అంతరాలయ దర్శనం, తాడేపల్లిలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామీ వార్ల ఉద్యానవనం, గొల్లపూడి వేణుగోపాల స్వామి ఆలయం, ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం నవ హారతులు
ప్యాకేజి 3:
బస్సు బయలుదేరు సమయం: ఉదయం 10 గంటలకు
యాత్ర ముగిసే సమయం: సాయంత్రం 7 గంటలకు
టికెట్ ధర: రూ:1200
దర్శించుకునే క్షేత్రాలు: దుర్గగుడి దేవస్థానంలో రూ.300 టికెట్ తో అంతరాలయ దర్శనం, యనమలకుదురు రామలింగేశ్వర స్వామి దేవస్థానం, మోపిదేవి దేవస్థానం, మధ్యానం భోజనం, మొవ్వ వేణు గోపాల స్వామి ఆలయం, హంసలదీవి వేణు గోపాల స్వామీ వారి ఆలయం, డాల్ఫిన్ దర్శనం
ప్యాకేజి 4:
బస్సు బయలుదేరు సమయం: ఉదయం 10 గంటలకు
యాత్ర ముగిసే సమయం: సాయంత్రం 7 గంటలకు
టికెట్ ధర: రూ:1200
దర్శించుకునే క్షేత్రాలు: దుర్గగుడి దేవస్థానంలో రూ.300 టికెట్ తో అంతరాలయ దర్శనం, యనమలకుదురు రామలింగేశ్వర స్వామి దేవస్థానం, పెదపులిపాక శ్రీ రాజ రాజేశ్వరి స్వామి ఆలయం, మోపిదేవి దేవస్థానం, మధ్యానం భోజనం, మొవ్వ వేణు గోపాల స్వామి ఆలయం, సాయంత్రం ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం నవ హారతులు