అరకు అందాలను పర్యాటకులు మరింత ఆస్వాదించేందుకు రైల్వేశాఖ మరో అధునాతన రైలును అందుబాటులోకి తెచ్చింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు విస్టాడోమ్‌ కోచ్‌ అద్దాల రైలును ఈరోజు ప్రారంభించింది. రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైలును ప్రారంభించారు.

    • మొత్తం బోగీలు - 2
    • ఒక్కో బోగీ సామర్థ్యం - 40 మంది
  • మొత్తం రైలు సామర్థ్యం - 80 మంది
  • ఈ రెండు బోగీలకు అయిన ఖర్చు - రూ.2 కోట్లు
  • బోగీలు పూర్తిగా ఎల్‌ఈడీ లైట్ల‌తో అలంకరించారు
  • రైలును పూర్తిస్థాయి ఎయిర్‌ కండిషన్‌గా మార్చారు
  • ఎండలో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఇందుకు తగ్గ ఏర్పాట్లూ ఇందులో ఉన్నాయి
  • రెండే బోగీల‌తో ఈ రైలు విశాఖ‌ప‌ట్నం-అర‌కు మ‌ధ్య రాక‌పోక‌లు సాగిస్తుంటుంది. ఈ రెండింటి మ‌ధ్య దూరం 116 కిలోమీట‌ర్లు.

భారత చరిత్రలోనే తొలిసారి
ఈ ప్రత్యేక రైలుకు రెండే బోగీలుంటాయి. ముందు ఇంజిన్‌.. ఆ తర్వాత వరసగా రెండు బోగీలు.. ప్రయాణికులు కూర్చోవడంతో పాటు.. లోయలు, అందాలు వచ్చినప్పుడు లేచి బోగీలోని ఓ పక్కగా వచ్చి నుంచుని చూసేందుకు వీలుగా అమరికలు ఏర్పాటుచేశారు. ఇందుకోసం రైలులో ఓ చివర ప్రత్యేక లాంజ్‌ను డిజైన్‌ చేశారు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలకు అరకు అద్దాల రైలు వేదిక కాబోతోంది.

ఈ క్రింది వీడియోల్లో చూడండి, ఒకటి బయట నుంచి రైలు ప్రయాణం చూడవచ్చు, ఇంకో వీడియోలో లోపల నుంచి రైలు ప్రయాణం చూడవచ్చు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read