సముద్రంలో రయ్మంటూ దూసుకుపోవాలనుందా? కెరటాల పై కేరింతలు కొడుతూ షికారు చేయాలనుందా? అయితే వైజాగ్ పదండి. త్వరలోనే ఆ కోరిక తీరుతుంది. దేశంలోనే తొలిసారిగా మన విశాఖ బీచ్ లో అలాంటి వారి సరదాలు తీర్చేందుకు హోవర్ క్రాఫ్ట్ వస్తోంది. ఇన్నాళూ, ఇంగ్లండ్ అమెరికా వంటి దేశాల్లోనే ఉన్న ఈ హోవర్ క్రాఫ్ట్ ఇప్పడు మనకూ రాబోతోంది.

అక్షర ఎంటర్ప్రెజెస్ సంస్థ దీనిని తొలిసారిగా ప్రవేశపెట్టబోతోంది. విశాఖ సాగరతీరంలోని ఆర్కే బీచ్, తొట్లకొండ బీచ్ లలో వాటర్ స్పోర్ట్స్ లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. దాదాపు రూ.8 కోట్ల ఇందుకు నేవీ, కోస్ట్ గార్డ్ , విశాఖపోర్టు, జీవీఎంసీ, వుడా, కాలుష్య నియంత్రణ మండలి, పోలీసు, ఎన్ఐఓ వంటి అన్ని అనుమతులను తెచ్చుకుంది.

ఇందుకోసం బ్రిటన్ నుంచి ఒక్కొక్కటి రూ.1.80 కోట్ల వెచ్చించి రెండు హోవర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేసింది. తొమ్మిది సీట్ల సామర్థ్యం ఉండే ఈ క్రాఫ్ట్ లో పైలట్ (డైవర్), ఒక సహాయకుడితో పాటు మరో ఏడుగురు ప్రయాణించేందుకు వీలుంటుంది. ఆర్కే బీచ్ సమీపంలో ఒక పాయింట్ను ఏర్పాటు చేయనున్నారు. అక్కడ నుంచి పార్క్ హోటల్ వరకు, తొట్లకొండ పాయింట్ నుంచి ఆ పరిసరాల్లోనూ 20 నుంచి 25 నిమిషాల పాటు సముద్ర ఒడ్డు నుంచి 500 మీటర్ల దూరం వరకు వీటిని తిప్పనున్నారు.

ఈ హోవర్ క్రాఫ్ట్ లో షికారు చేయడానికి ఒక్కొక్కరికి రూ.300 టికెటుగా నిర్ణయించాలని యోచిస్తున్నారు. భద్రత కోసం ఒడ్డున సేఫ్టే బోట్లను కూడా సిద్దంగా ఉంచుతారు.

దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ హోవర్ క్రాఫ్ట్ లు నడపడానికి అవసరమైన అన్ని అనుమతులు తెచ్చుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read