Sidebar

11
Sat, Jan

విశాఖ నగరంలో రుషికొండ సాగర తీరంలో రూ.300 కోట్ల వ్యయంతో ఓషనేరియం ఏర్పాటు కాబోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుకానున్న ఈ ప్రాజెక్టుకు రుషికొండ వెనక భాగంలో సాగరతీరానికి ఆనుకుని 10 ఎకరాల స్థలాన్ని అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

గత జనవరిలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఆనందా ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఈ భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ క్రమంలో సాంకేతిక సర్వే నిర్వహించడానికి మే మొదటి వారంలో జర్మనీ, చైనా దేశాలకు చెందిన ప్రత్యేక నిపుణుల బృందం ఓషనేరియం ఏర్పాటుకు నిర్దేశించిన ప్రాంతాన్ని సందర్శించనుంది.

ఏమిటి ఈ ఓషనేరియం
సింపుల్ గా చెప్పాలి అంటే, సముద్రంలో ఉండే ఆక్వేరియం లాంటిది... మనం మధ్యలో నుంచి నడుచుకుంటే వెళ్తుంటే, అద్దంలో సముద్రపు జీవరాశులుని చూస్తూ, ఎంజాయ్ చెయ్యవచ్చు... ఈ ప్రాజెక్ట్ పర్యటకంగా విశాఖకు ఎంతో మేలు చేయ్యనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read