ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న చింతామణి నాటకాన్ని నిషేధించింది. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబందించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్య వైశ్యులు దీని పై అభ్యంతరం చెప్పారని, అందుకే చింతామణి నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిషేదిస్తున్నామని ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న జవాబు. అసలు చింతామణి నాటకం పైన ఆర్య వైశ్యులకు ఏమి ఇబ్బంది ? ఇప్పటి వరకు వారికి ఉన్న అభ్యంతరం ఏమిటి, ఇప్పుడు ఈ నిర్ణయం పై ఏమి జరుగుతుంది అనే చర్చ మొదలైంది. అయితే మరీ ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్య వైశ్యులు కోపంగా ఉన్నారు. దానికి ఆజ్యం పోస్టు సుబ్బారావు గుప్తా ఘటన వారికి మరింత కోపాన్ని తెప్పించింది. అలాగే రోశయ్య మరణం పైన జగన్ వ్యవహరించిన తీరు కూడా, ఆర్య వైశ్యులు కోపానికి కారణం అయ్యింది. వీటి అన్నిటి నేపధ్యంలో, ఆర్య వైశ్యులను మచ్చిక చేసుకోవటానికి ప్రభుత్వం ఈ ప్లాన్ వేసింది అనే ప్రచారం జరుగుతుంది. దీని పై ఆర్య వైశ్యులు కొంత మంది స్పందించారు. ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ అని, ఎప్పుడో మర్చిపోయిన చింతామణి నాటకాన్ని, మళ్ళీ మేమేదో చేసామని వైసీపీ ప్రభుత్వం నాటకం అడుతుందని, అసలు ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకో అర్ధం కావటం లేదని అంటున్నారు.

jagan 18012022 2

జగన్ ఎంత చేసినా, ఆర్య వైశ్యులకు జగన్ చేసిన ద్రోహం మర్చిపోమని, మాకు ఇవన్నీ కాదని, తమ పైన జరుగుతున్న దా-డు-లు, అణిచివేత ఇవన్నీ ఆపాలని అన్నారు. గతంలో ఉన్న వైశ్య కార్పొరేషన్ ని , అప్పటి కంటే, బాగా పని చేసే విధంగా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు గౌరవం కావాలని, అంతే కాని తమను పావులుగా వాడుకుని, ఇలా డైవర్ట్ చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. చిత్తసుద్ధి ఉంటే, చింతామణి నాటకాన్ని youtube నుంచి కూడా తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రోశయ్య పైన జగన్ వ్యవహరించిన తీరు, సుబ్బారావు గుప్తా పైన జరిగిన దా-డి, వీటి అన్నిటితో వైశ్యులు ఆగ్రహంగా ఉన్నారని, అందుకే వైశ్య మహా సభలు కూడా పెట్టి, ప్రభుత్వ తీరుని ఎండగట్టటంతో, వైశ్యులలో వ్యతిరేకత పెరిగిపోయిందని ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో, ఏదో చేసామని, ఉద్దరించామని చెప్పుకోవటానికి మాత్రమే, ప్రభుత్వం ఈ విధంగా తమను మభ్య పెడుతుందని వైశ్యులు వాపోతున్నారు.

ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందనే విధంగా మారింది, ఏపిలో ఉద్యోగులు పరిస్థితి. ఐఆర్ కంటే పీఆర్సీ తక్కువ ఇచ్చిన చరిత్ర ఏపి ప్రభుత్వానిది అయితే, అది తీసుకున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకే దక్కిందని, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యింది. అయితే ఇప్పుడు నిన్న రాత్రి ప్రభుత్వం ఇచ్చిన జీవోతో, ఉద్యోగులు మరింత షాక్ తిన్నారు. హిఆర్ఏ, పెన్షన్ కు సంబంధించి, ఉత్తర్వులు ఇచ్చింది. ఈ దెబ్బతో ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా మోసపోయాం అని గ్రహించి, ఈ రోజు నుంచి ఆందోళనకు పిలిపు ఇచ్చాయి. ప్రధానంగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమాఖ్య, ఈ రోజు ఆందోళనకు పిలిపు ఇచ్చింది. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావటంతో పాటుగా, ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో నిరసల ర్యాలీలు నిర్వహించటంతో పాటుగా, నిన్న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను దగ్ధం చేయాలని పిలుపు ఇచ్చింది. అలాగే ఉద్యోగ సంఘాలు రేపు అందరినీ మీటింగ్ కు రమ్మన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. అప్పటి వరకు కూడా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక కొన్ని ఉద్యోగ సంఘాలు అయితే, ఈ విషయం పైన నోరు ఎత్తటం లేదు. అయితే కింద స్థాయి నుంచి వచ్చిన ఒత్తిడితో, కొన్ని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలిపు ఇచ్చాయి.

prc 18012022 2

ఆంధ్రర్పదేశ్ లో ఉద్యోగ సంఘాలకు సంబంధించి ప్రధానంగా, రాష్ట్ర సచివాలయానికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులు 30 శాతం hra తీసుకుంటున్నారు. వీరి అందరికీ ఇప్పుడు ఇందులో కోత పడింది. 14 శాతం తగ్గించి 16 శాతం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో 20 శాతం hra తీసుకుంటున్నారో, వారు అంతా కూడా 8 శాతానికి వచ్చేసారు. వారు అంతా కూడా ఇప్పుడు లబో దిబో అంటున్నారు. దీంతో పాటు మరో కీలకమైన విషయం, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఐర్ 27 శాతం చేసిందో, అది ఇప్పుడు 23 శాతం వచ్చింది. అయితే ఇందులో కూడా డీఏ అరియర్స్ అడ్జస్ట్ చేస్తామని చెప్పటంతో, ఉద్యోగులు మరింత షాక్ కు గురయ్యారు. ఇక మరో అంశం, ఇక నుంచి పీఆర్సీ ప్రతి 5 ఏళ్ళకు కాకుండా, ప్రతి 10 ఏళ్ళకు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే డీఏలు తప్ప, ఇక పదేళ్ళ వరకు జీతాలు పెరగవు. దీంతో మొత్తం అంశాలు రాత్రి వదిలిన జీవోలు చూసి, ఉద్యోగ సంఘాల నోట మాట రావటం లేదు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొద్ది సేపటి క్రితం ఆయన ట్విట్టర్ లో స్వయంగా ఈ విషయం చెప్పారు. ఆయనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారు అందరూ వెంటనే టెస్ట్ చేయించుకోవాలని కోరారు. స్వల్ప లక్షణాలున్నట్లు, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు చంద్రబాబు తెలిపారు. ఆయన కుమారుడు లోకేష్ కి కూడా నిన్న పాజిటివ్ వచ్చింది. ఆ తరువాత చంద్రబాబు టెస్ట్ చేయించుకోగా ఆయనకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. చాలా తక్కువ లక్షణాలు ఉన్నాయని కోరారు. మొన్న చంద్రబాబు గుంటూరు జిల్లా మాచర్ల వెళ్లి, అక్కడ స్వయంగా పాడె మోశారు. అక్కడే చాలా సేపు ఉండటం, ఎక్కువ మంది ప్రజలు అక్కడ ఉండటంతో, అక్కడే ఆయనకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ రోజు అన్న ఎన్టీఆర్ వర్ధంతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం శ్రేణులే కాక, సామాన్య ప్రజలు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో ఉదయం బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఈ రోజు చంద్రబాబుకు కరోనా రావటంతో, ఆయన కార్యక్రమాలు అన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ లో, లక్ష్మీ పార్వతి కూడా వచ్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు విని, అక్కడ ఉన్న వారు,మీడియా షాక్ తిన్నారు. ఆమె మాట్లడుతూ, మీకు 26 ఏళ్ళ తరువాత ఒక రహస్యం చెప్తున్నా అని చెప్పి మొదలు పెట్టారు. ఆ రహస్యం ఏమిటా, ఆమె ఏమి చెప్తుందా అనుకుంటే, ఆమె మాట్లాడుతూ, 26 ఏళ్ళ క్రితం, తాను ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడినట్టు ఆమె చెప్పారు. ఎన్టీఆర్ చనిపోయిన తరువాత, జీవితా రాజశేఖర్, మద్రాస్ తీసుకుని వెళ్ళారని, అక్కడ ఒక అమ్మాయిని కలిసాను అని, ఆ అమ్మాయిలోకి ఎన్టీఆర్ ఆత్మ వచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ ఆ అమ్మాయిలోకి రాగానే, ఆ అమ్మాయి ఎన్టీఆర్ హావభావాలతో కనిపించిందని చెప్పారు. ఆ రోజు ఎన్టీఆర్ ఆత్మ ఆ అమ్మాయిలోకి రాగానే, ఎన్టీఆర్ ఆత్మతో చాలా విషయాలు మాట్లాడానని అన్నారు.

lp 18012022 2

ఎన్టీఆర్ ఆత్మ తనకు అనేక విషయాలు చెప్పిందని ఆమె అన్నారు. అయితే చాలా విషయాలు ఎన్టీఆర్ ఆత్మని అడుగుదామని అనుకున్నా, తనకు ఏడుపు వచ్చిందని, అందుకే ఎక్కువ మాట్లాడలేక పోయానని చెప్పారు. ఈ ఆత్మ గురించి రహస్యం అంటూ ఆమె చెప్పాటంతో, పలువురు షాక్ అయ్యారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి కూడా, ప్రతి రోజు 12 గంటలకు వైఎస్ఆర్ ఆత్మతో మాట్లాడతాను అంటూ, వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లక్ష్మీ పార్వతి కూడా ఆత్మల గురించి చెప్పటంతో, ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. ఏది నిజమో, ఏది భ్రమో అర్ధం కాక అలా ఉండి పోయారు. ఇక లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం ఎవరు చేసినా తప్పే అని అన్నారు. దుర్గి ఘటనలో తాను అక్కడ వైసీపీ ఎమ్మెల్యేతో మాట్లాడనని అన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రతిపక్షాలు కూడా హుందాగా వ్యవహరించాలి అంటూ, చెప్పుకొచ్చారు. మొత్తానికి, ఈ సారి ఎన్టీఆర్ వర్ధంతికి లక్ష్మీ పార్వతి స్పీచ్ హైలైట్ అనే చెప్పాలి మరి.

Advertisements

Latest Articles

Most Read