భవానీ ఐలాండ్ సరి కొత్త అందాలు అందుకోబోతుంది. ఐలాండ్ లో త్వరలో ఏర్పాటు కానున్న డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫాంటెన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ పర్యాటకులకు కనువిందు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటీవల నూతనంగా భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవానీ ద్వీపం అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించింది. సుమారు రూ.16 కోట్ల వ్యయంతో డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫాంటెన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ ను సిద్ధం చేస్తోంది. ద్వీపంలో ఇప్పటికే దీనికి సంబంధించిన కంట్రోల్ రూం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ లేజర్ షోను పర్యాటకులు తిలకించేందుకుగాను కంట్రోల్ రూం పక్కనే గ్యాలరీ ఏర్పాటు చేస్తోంది. లేజర్ షోకు సంబంధించిన సామగ్రి కూడా వచ్చేసింది. ప్రస్తుతం పన్నమి ఘాట్లో ఉన్న ఈ సామగ్రికి ఒక రూపం తీసుకువచ్చి భవానీ ద్వీపంలోకి తర లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ డ్యాన్సింగ్ కల్ పాంటెన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్క్రీన్ దేశంలోనే అతి పెద్దదని బీఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. మూడు వాటర్ స్కీన్స్ పై మూడు ప్రాజెక్టర్లతో లేజర్ షో ప్రదర్శితమవుతుందని చెప్పారు. ప్రకాశం బ్యారేజి కంటే ఎత్తులో లేజర్ షో ఉంటుందని వివరించారు. ఇది అత్యంత ఖర్చు కూడుకున్న భారీ ప్రాజెక్టు అయినప్పటికీ ద్వీపం అభివృద్ధిలో భాగంగా చేపటామన్నారు. కోల్కత్తాకు చెందిన ప్రీమియం వరల్డ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ టెండర్ ద్వారా దక్కించుకుని పనులు ప్రారంభించిందని వివరించారు.