విజయవాడ నగరంలోని రివర్ ఫ్రంట్, కాలువలు పర్యాటక ప్రాంతాలుగానే కాదు, ఇక ఉంచి వాణిజ్య ప్రాంతాలుగా మారనున్నాయి. విజయవాడ నగరంలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పై ముఖ్యమంత్రి చంద్రబాబు, సమీక్ష నిర్వచించారు. ముఖ్యమంత్రికి, సంబంధింత కన్సల్లెంట్లు ప్రజెంటేషన్ అందించారు. ముఖ్యమంత్రి, ఈ ప్రణాళిక పరిశీలించి, మరిన్ని మార్పులతో రావాలని సూచించారు. ముఖ్యంగా, నగరంలో అధ్వాన స్థితిలో ఉన్న కాలువల పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.
దుర్గగుడి, నది తీరంలోని ఘాట్లు, నది చెంతనే ఉన్నకాలువలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలన్నింటిని ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందించారు. మిక్స్ డెవలప్మెంట్ అప్రోచ్ పేరిట ఈ ప్రాజెక్ట్నుఅభివృద్ధిచేస్తారు. ఇందులో బిజినెస్ హోటల్, కన్వెనన్ సెంటర్, సర్వీస్ అపార్ట్ మెంట్లు, మల్టీప్లెక్స్, ఫుడ్ కోర్ట్లు, సెంట్రల్ పార్క్, గ్రీనరీ, పైవంతెనలు, సైకిల్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు ఉంటాయి. అలాగే అంతర్గత జలరవాణా మార్గాల్ని కూడా అభివృద్ధి పరుస్తారు. మరిన్నిఅంశాలు జోడించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు.
ప్రస్తుతం ఇచ్చిన ప్రణాళికలు, డిజైన్ల పై అంతగా సంతృప్తి వ్యక్తం చేయని సీఎం తాను సూచించిన విధంగా మెరుగైన ప్రణాళికలు ఆకృతులతో రావాలని ఆదేశించారు.