భూమిపై పనికిరాని వస్తువంటూ ఏమీ లేదు. ప్రతి వస్తువును ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పనికిరాని వ్యర్థాలను అర్థవంతమైన, ఆకర్షణీయమైన కళాఖండాలుగా మార్చవచ్చు. సృజనాత్మకత, ఆలోచన ఉంటే చాలు తుక్కును కూడా ముక్కన వేలేసుకునేలా తీర్చిదిద్దవచ్చు. విజయవాడ నగరపాలక సంస్థలోని వెహికల్ డిపోలో నిరుపయోగంగా ఉన్న పాత ఇనుము పరికరాలు, తుక్క కళాకారుల చేతిలో అద్భుతమైన కళాఖండాలుగా మార్చారు. ఇనుప రేకులు ఈగ రెక్కలుగా, పాడైపోయిన ట్రాన్స్ఫార్మార్ గుర్రం శరీర భాగాలుగా, కారు డోర్ సీతాకోక చిలుక అందాలుగా.. బోరింగగ్ పంపు కడ్డీలు కొంగ కాళ్లుగా.. ఇలా ఆటోమొబైల్ స్క్రాప్ ద్వారా రూపొందించిన కళాకృతుల విజయవాడ నగర ప్రజలను కనువిందు చేస్తున్నాయి.
నగర పాలక సంస్థ కమీషనర్ దీని పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఆంధ్రాలోని వివిధ కళాకారులతో వీటిని తయారు చేయించారు. ఇనుముతో తయారు చేసిన వివిధ ఆకృతులు, భవానీ ద్వీపానికి వస్తున్న సందర్శకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ప్రస్తుతం విజయవాడలోని ప్రధాన కూడళ్ళు అయిన మధు చౌక్, పాత బస్సు స్టాండ్ ప్రాంతాల్లో ఇవి ఉంచారు.