విజయవాడ ప్రజలకు మరో కొత్త అనుభూతి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టిన నగరపాలక సంస్థ, టూరిజం శాఖల నేతృత్వంలో రెండు బోట్లతో కూడిన బోటింగ్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో, విజయవాడ బందర్ కాలువలో ఏర్పాటు చేసిన బోటింగ్ ను నిన్న పలువురు ప్రజా ప్రతినిధులు పరరంభించారు.

విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నా, మేయర్, అధికారులు స్పీడ్ బోటులో ట్రయల్ రన్ గా బందరు కాలువలో, బందరు లాకుల వరకు ప్రయాణించారు.

కమిషనర్ నివాస్ మాట్లాడుతూ భవిష్యత్ లో అమెరికన్ హాస్పటల్ నుంచి యనమలకుదురు లాకుల వరకు బోటింగ్ చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలో నగరంలోని మూడు కాలువల్లో బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామన్నారు..

అమరావతి బోటింగ్ క్లబ్ యాజమాన్యం మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బందరు లాకుల వరకు, పిల్లలకు రూ.50, పెద్దలకు రూ. 100 చొప్చున వసూలు చేసే యోచనలో ఉన్నామని, ప్రజలు అలవాటు పడేవరకు పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 30 చొప్చున వసూలు చేయమని మేయర్ కోనేరు శ్రీధర్ సూచించారన్నారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read