పోలీసుశాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ ఎన్.సాంబశివరావు వెల్లడించారు. గురువారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో ఆధునికీరించిన విజయవాడ పోలీస్ వెబ్ సైట్, విజయవాడ పోలీస్ పేస్-బుక్ పేజీని ఆయన ప్రారంభించారు.
పోలీసు సేవలను సులువగా పొందేందుకు వీలుగా విజయవాడ పోలీస్ వెబ్ సైట్ ఆధునికీకరించినట్లు తెలిపారు. వెబ్ సైట్, పేస్-బుక్ పేజీల ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నామన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖ ప్రజలకు మరింత చేరువ అవుతుందన్నారు. ఆధునికరించిన వెబ్‌సైట్ సాంకేతికంగా ఎంతో సులువుగా ఉంటుందన్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా పోలీసు సేవలను అంటే పోలీస్‌స్టేషన్ ఎక్కడ ఉంది? ఎఫ్‌ఐఆర్ స్థితి, పాస్‌పోర్టు వెరిఫికేషన్, ఫిర్యాదుల స్థితి సులువుగా పొందవచ్చన్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా విజయవాడ పోలీసులు ‘వన్ ఐడియా కెన్ ఛేంజ్ విజయవాడ’ అనే నినాదంతో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు.
విజయవాడ పోలీస్ వెబ్ సైట్: www.vijayawadapolice.ap.gov.in
విజయవాడ పేస్-బుక్ పేజ్: https://www.facebook.com/VjaCityPolice/