ఆయన పేరు ఎస్‌ఎస్‌ రావత్‌. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా ఎస్‌ఎస్‌ రావత్‌ ఉన్నారు. ఆర్ధిక శాఖ అంటే, ఆయన పైన ఎంతటి ఒత్తిడి ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. కొత్త అప్పులు పుడితేనే రోజు గడిచే పరిస్థితి వచ్చింది. దీంతో ప్రతి వారం అప్పులు కోసం ఢిల్లీ వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. అప్పులు మోసం చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తీరు కేంద్రం పట్టేసింది. ఇదే సమయంలో కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి, రాష్ట్రంలో జరుగుతున్న ఆర్ధిక అరాచకం పైన, 26 పేజీల లేఖ వచ్చింది. దీని పై వివరణ కోరారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి అస్తవ్య్వస్తంగా మారటం, అప్పుల కోసం ప్రతి వారం కేంద్రం వద్దకు వెళ్లి తిరగటం, ఇలా అనేక సంఘటనలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారిన తరుణంలో, 26 పేజీల లేఖ రాసి, వీటి అన్నిటికీ సరైన వివరాలు పంపాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. దీనికి సంతృప్తికరమైన సమాధానాలను, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేక పోయింది. ఇందులో కూడా తప్పులు తడకలతో, కేంద్రాన్ని కూడా బురిడీ కొట్టించే ప్రయత్నం చేసారు. దీంతో కేంద్రం ఈ విషయాల పై తేలే వరకు కొత్త అప్పులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.

ravath 28042022 2

కొత్త అప్పులు ఇవ్వాలి అంటే, ముందు పాత అప్పుల్లో జరిగిన అవకతవకల పై సరైన సమాధానం ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పింది. నెల రోజుల క్రితం ప్రధాని మోడీని, కలిసిన జగన్ మోహన్ రెడ్డి, తమకు రూ.55 వేల కోట్ల వరకు అదనపు అప్పులు ఇవ్వలేని జగన్ మోహన్ రెడ్డి కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీని పైన సానుకూలంగా స్పందించ లేదు. పైగా కేంద్రం ఎదురు రాష్ట్రాన్ని కొన్ని ప్రశ్నలు అడగటం, దానికి సంతృప్తికర సమాధానాలు చెప్పకపోవటంతో, అసలు ఇస్తాను అని చెప్పిన అప్పు కూడా వచ్చే పరిస్థితి లేదు. అయితే పోయిన వారం కొత్త అప్పు కోసం రావత్, బుగ్గన ఢిల్లీ వెళ్లారు. బుగ్గనను బయటకు పంపించిన కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులు, రావత్ కు క్లాస్ పీకినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు చెప్పినట్టు మనం ఆడితే ఎలా ? నిబంధనలు చెప్పాలి కదా అని రావత్ మీద ఫైర్ అవ్వటంతో, అయన మనస్తాపం చెందినట్టు చెప్తున్నారు. ఆయన వారం రోజులు పాటు సెలవు పెట్టి వెళ్ళిపోయినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ రోజు సాయంత్రం జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కాబోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ని తరుచూ కలవటం చర్చనీయంసం అయ్యింది. ఢిల్లీలో మారుతున్న పరిణామాలు, జగన్ ను రాజకీయంగా కలవర పెడుతున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. దాదాపుగా వారం రోజులు ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతిని, పలువురు మంత్రులను కూడా ఆయన కలిసి రావటంతో, జగన్ లో టెన్షన్ మొదలైంది. ప్రధాని మోడీతో సమావేశం, ఆ తరువాత హోంమంత్రి అమిత్ షా తో జరిగిన సమావేశంలో కూడా, రాష్ట్రానికి సంబంధించి పలు అంశాల పై ఆయన నివేదిక ఇచ్చారు. ప్రధానంగా ఆర్ధిక శాఖకు సంబంధించి ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలో ఉన్న అప్పులు, అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవటం, గవర్నర్ పేర హామీగా పెట్టి అప్పులు తేవటం, వీటి అన్నిటి పైన నివేదిక కోరినట్టు తెలుస్తుంది. అయితే చాలా అంశాల పై, రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పై, ప్రధాని మోడీ, అమిత్ షా, గవర్నర్ కు కొన్ని సూచనలు చేసినట్టు చెప్తున్నారు. కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు కాకుండా, జాగ్రత్తగా ఉండాలి అని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.

jagan 28042022 2

అయితే గవర్నర్ దాదపుగా వారం రోజులు ఢిల్లీలో ఉండటం, అనేక మంది ముఖ్యులతో సమావేశం అవ్వటంతో, అక్కడ విషయాలు ఏమిటి, ఏమి జరిగింది అని తెలుసుకునేందుకు, జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ అపాయింట్మెంట్ కోరటంతో, ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు రావాలని గవర్నర్ కోరినట్టు తెలుస్తుంది. దీంతో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వెళ్తున్న నేపధ్యంలో, ఆ పర్యటన వెంటనే ముగించుకుని, సాయంత్రం గవర్నర్ తో భేటీ కావాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ఏమి నివేదికలు ఇచ్చారు ? కేంద్రం ఏమని చెప్పింది ? కేంద్రం ఏమి ఆదేశాలు ఇచ్చింది ? ఇలా ఇవన్నీ తెలుసుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ తో భేటీ అయ్యి విషయాలు తెలుసుకోనున్నారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న ఆర్ధిక విధానాలతో, దేశం కూడా నష్టపోతుందని,మరో శ్రీలంక అవుతుంది అంటూ, కేంద్రంలో ఉన్న అధికారులు కూడా మోడీకి చెప్పటంతోనే, కేంద్రం ఈ అంశం పై సీరియస్ గా ఉన్నట్టు చెప్తున్నారు.

నిన్నటి వరకు జడ్జిలను, కోర్టులను తిట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ పార్టీ అధినేత వరుస పెట్టి జడ్జిలను కలవటంతో చర్చ మొదలైంది. జస్టిస్ ఎన్వీ రమణని చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాని చేయొద్దు అంటూ, ఒక పెద్ద ఉద్యమమే నడిపిన జగన్ మోహన్ రెడ్డి, మొన్న ఆయన విజయవాడ పర్యటనలో, నోవోటెల్ హోటల్ కి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవటం చర్చనీయంసం అయ్యింది. అంత పీకల మీద కోపం ఉన్న జగన, ఇలా ఎందుకు చేసారో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఇప్పుడు ఒక పక్కన వరుస పెట్టి హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు స్టేట్ గెస్ట్ హౌస్ లో హై కోర్టు చీఫ్ జస్టిస్, ప్రశాంత్ కుమార్ మిశ్రను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు సాయంత్రం జగన్, చీఫ్ జస్టిస్ ను కలవనున్నారు. ఈ భేటీ అజెండా ఏమిటో మాత్రం, ఎవరికీ తెలియదు. ప్రభుత్వం అధికారంగా ఈ భేటీ గురించి ఏమి చెప్తుందో చూడాలి మరి.

ఆంధ్రప్రదేశ్ లో మహిళల పై జరుగుతున్న అఘాయత్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆందోళన చేసింది. ఇందులో భాగంగానే నిన్న 'జగన్ పాలనలో ఊరికో ఉన్మాది' పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ, ఈ రోజు మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్ళింది. ముందుగా పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా, తరువాత అనుమతి ఇచ్చారు. ఈ బృందంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు అనితతో పాటు, ఇతర నేతలు కూడా ఉన్నారు. అయితే మహిళా కమిషన్ చాంబర్ లో, వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య మాటల యుద్ధం కొనసాగింది. 'జగన్ పాలనలో ఊరికో ఉన్మాది' పుస్తకాన్ని, వాసిరెడ్డి పద్మకు ఇచ్చిన అనిత, అందులో 800 సంఘటనలు ఉన్నాయని, వాళ్ళలో ఎంత మంది పై చర్యలు తీసుకున్నారని, ప్రశ్నించారు. ఎంత మందికి నోటీసులు ఇచ్చారని ప్రశ్నించిటంతో, వాసిరెడ్డి పద్మ షాక్ అయ్యారు. పుస్తకాన్ని పరిశీలన చేసి, సమాధానం ఇస్తాను అంటూ తప్పించుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు చంద్రబాబు, బొండా ఉమాకు నోటీసులు ఇచ్చిన పద్మ విచారణకు రావాలని ఆదేశించింది. వారు ఈ రోజు రాకపోవటంతో, ఏమి జరుగుతుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read