వైసీపీ దారుణ ప‌రాజ‌యం ఖాయ‌మ‌ని అంద‌రికంటే ముందు మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఏడాది క్రిత‌మే ఫిక్స్ అయిపోయారు. త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేద‌నే అల‌క‌బూనిన ధ‌ర్మాన అప్ప‌ట్లో శ్రీకాకుళం జిల్లాలో త‌న సొంత టీముతో స‌ర్వే చేయించారు. ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే 10 స్థానాలలో 8 టిడిపి గెలుస్తుంద‌ని, 2 వైసీపీ ఖాతాలో ప‌డ‌తాయ‌ని తేలింది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ 8, టీడీపీ 2 సీట్లు గెలిచిన శ్రీకాకుళంలో ఫ‌లితాలు త‌ల్ల‌కిందులు కానున్నాయ‌ని తేల్చిన ఈ స‌ర్వేని ప‌ట్టుకుని సీఎం జ‌గ‌న్ రెడ్డి వ‌ద్ద‌కు చేరిన ధ‌ర్మాన‌..ఈ స్థితిని మార్చాలంటే త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని కోరారు. ధ‌ర్మాన చేయించిన స‌ర్వే ఐప్యాక్ స‌ర్వేకి ద‌గ్గ‌ర‌గా వుండ‌టంతో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్న క్రిష్ణ‌దాస్ ని మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించి త‌మ్ముడికి స్థానం క‌ల్పించారు. అనంత‌రం మూడురాజ‌ధానుల పేరుతో విశాఖ రాజ‌ధాని ఉద్య‌మాన్ని ధ‌ర్మాన‌కి అప్ప‌గించారు. ఈ ఉద్య‌మ‌మూ ఎంత ఖ‌ర్చుపెట్టినా పైకి లేవ‌క‌పోవ‌డంతో, తెలుగుదేశం మ‌రింత బ‌లోపేతం కావ‌డంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు స‌హ‌నం కోల్పోయి వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యం త‌న మెడ‌కు చుట్టుకునే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ముందుగానే త‌ప్పుకునేందుకు విశాఖ రాజ‌ధాని కోసం రాజీనామా చేయాల‌ని చూశారు. దీనికి జ‌గ‌న్ ఒప్పుకోలేదు. ఏం చేయాలో పాలుపోని ధ‌ర్మాన రోజుకొక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేస్తున్నా ఎవ‌రి నుంచి ఎటువంటి స్పంద‌నా లేదు.

దీంతో బ్లాక్ మెయిలింగ్‌కి దిగారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో, ప్రజలు మొత్తం అమరావతి రాజధాని అంటున్నారని, అదే కనుక జరిగితే, విశాఖని ఒక చిన్న రాష్ట్రంగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. మెజారిటీ ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లే విశాఖ రాజ‌ధాని వ‌ద్ద‌ని, అమ‌రావ‌తే కావాల‌ని బ‌హిరంగంగానే చెబుతుండ‌డం మంత్రి ధ‌ర్మాన‌కి అయోమ‌య స్థితిలోకి నెట్టేసింది. ఉత్త‌రాంధ్ర‌ ప్రజలకు సైకిల్ పైన మోజు ఉన్నట్టు ఉందని, అటు వైపు మళ్ళీ మళ్ళితే, మీరు ఇబ్బంది పడతారు అంటూ ప్ర‌జ‌ల్ని బెదిరించ‌డం మొద‌లు పెట్టారు. మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకి వైసీపీ ఉత్తరాంధ్ర‌లో తుడిచి పెట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని తెలిసిపోయింది. కానీ ఆయ‌న మాట వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్‌రెడ్డి విన‌రు. ఆయ‌న ఉత్త‌రాంధ్ర‌లో 34 సీట్ల‌లో 30 పోతాయ‌ని తెలిసినా, 175 మంత్రం జ‌పిస్తున్నారు. ఇది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అని కొంద‌రు అంటుంటే, వైసీపీ నేత‌లు-కేడ‌ర్ జారిపోకుండా బూస్ట‌ప్ కోస‌మే ఈ ప్ర‌క‌ట‌న అనీ, జ‌గ‌న్ రెడ్డివి దింపుడు క‌ల్లం ఆశ అని వైసీపీ సీనియ‌ర్ నేతలే త‌మ‌లో తాము చ‌ర్చించుకుంటున్నారు.

తొడ‌కొట్టిన స‌వాల్ విస‌ర‌డంలో నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య‌ని మించిన వారు లేరు. సినిమాల్లో బాల‌య్య తొడ‌కొడితే సినిమా బాక్సాఫీసులు నిండిపోతాయి. ఇప్పుడు బాల‌య్య‌కి పోటీగా స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వ‌చ్చారు. ఆయ‌న తొడ‌గొట్టి మ‌రీ చాలెంజులు చేస్తున్నారు. ఒక రాష్ట్ర శాస‌న‌స‌భ స్పీక‌ర్. అత్యంత హుందాగా ఉండాల్సిన వ్య‌క్తి. అధికార‌, ప్ర‌తిప‌క్షం ఇష్టం ఉన్నా లేకున్నా గౌర‌వించాల్సిన పెద‌రాయుడు పోస్టు. ప్ర‌తిప‌క్షం ఏమైనా ఆరోప‌ణ‌లు చేస్తే స్పందించేందుకు ప్ర‌భుత్వంలో అధికార ప్ర‌తినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలున్నారు. ప్ర‌తిప‌క్షం ఆరోప‌ణ‌ల‌కు స్పీక‌ర్ స‌మాధానాలు ఇవ్వ‌డం దేశంలోనే మ‌న రాష్ట్రం నుంచే ఆన‌వాయితీని నెల‌కొల్పారు త‌మ్మినేని సీతారాం. రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉంటూ స్పందించ‌కూడ‌ని అంశాల‌లో స్పందిస్తుండ‌డం స్పీక‌ర్ చైర్ కి అగౌర‌వం అయితే, బ‌జారు భాష ఆ కుర్చీకే అవ‌మానం అని రాజ‌కీయ విశ్లేషకుల మాట‌. లంజ‌త్వం అనే ప‌దం వాడ‌టం, ప్ర‌తిప‌క్ష‌నేత‌ని త‌రిమికొట్టాల‌ని పిలుపునివ్వ‌డం, తాజాగా తొడ కొట్ట‌డం చూస్తుంటే..ఆయ‌న స్పీక‌రేనా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి  దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని టిడిపి అధినేత చంద్ర‌బాబు ఆరోపించారు. నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో మీడియాతో మాట్లాడారు. జగన్ ముఠా అవినీతిలో నెంబర్ 1గా నిలిచిందన్నారు. జె గ్యాంగ్‌ దోపిడీ వ‌ల్ల అప్పుల కుప్ప‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ద‌య‌నీయ‌స్థితిలో ఉంటే, దోచుకున్న జ‌గ‌న్ రెడ్డి అప‌ర‌కుబేరుడ‌య్యాడ‌ని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి, అతని గ్యాంగ్ దగ్గర మాత్రమే డబ్బులుండాలి, ఇంకెవరిదగ్గరా ఉండకూడదన్నట్లు వ్యవహరిస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. వైసీపీ అధికారంలోకి రాకముందు వ‌ర‌కూ ఇళ్లు లేని ఎమ్మెల్యేలంతా అవినీతి సొమ్ముతో ప్యాలెస్ లు కట్టుకున్నారని ఆరోపించారు. న్యాయమూర్తుల్ని సైతం బ్లాక్మైల్ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని మండిప‌డ్డారు.  కోర్టులో కూడా దొంగతనం చేసి దస్త్రాలు మాయం చేయగలమనే ధైర్యంతో ఉన్నారంటే ఈ ప్ర‌భుత్వం బరితెగింపుని ఏమ‌నుకోవాల‌ని ప్ర‌శ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అనేక సంక్షేమాలను రద్దు చేయటంతో పాటు ఉపప్రణాళి నిధులు నిర్వీర్యం చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వివిధ రకాల పన్నులు, ధరలు, ఛార్జీలతో ప్రజలపై మోయలేని భారం మోపిన వైసీపీ స‌ర్కారుపై ప్ర‌జా తిరుగుబాటు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

వైకాపాలో అంతర్యుద్ధం జరుగుతోంద‌ని, ప్రజా తిరుగుబాటుతో ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుంద‌ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.  రాష్ట్రంలో 5 కోట్ల మంది ఓవైపు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒక వైపుగా పోరాటం జ‌రుగుతోంద‌న్నారు. ఈ పోరాటం అన్ స్టాపబుల్, తెలుగుదేశం విజయమూ అన్ స్టాపబుల్ అని ధీమా వ్య‌క్తం చేశారు. ప్రజలు, ప్రతిపక్షాలపై ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దోపిడీ,అణ‌చివేత‌, ఫ్యాక్ష‌న్ దుర్గుణాలు అన్నీ క‌ల‌గ‌లిసిన జగన్మోహన్ రెడ్డి మెంటల్ మనస్థత్వం కలిగిన వ్యక్తి అని చంద్ర‌బాబు ఆరోపించారు. ఇటువంటి ఉన్మాద పాల‌కుడి నుంచి రాష్ట్రాన్ని ర‌క్షించేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. ప్ర‌జాసమ‌స్య‌ల‌పై స్వేచ్ఛగా పోరాడే వామపక్షాలు సైతం జ‌గ‌న్‌రెడ్డి మూర్ఖ‌పు ధోర‌ణికి భ‌య‌ప‌డి పోరాడటం మానేశాయ‌న్నారు. ఇళ్లలో నుంచి ఇక ఎవ్వరూ బయటకురాకుండా భయపెట్టేశామనే ధోరణిలో ప్రభుత్వం ఉన్నప్పుడు, ఏడాది ఏప్రిల్ లో బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌న్నారు. ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి ప్ర‌తిప‌క్షాల‌కు మద్దతు తెలపటంతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని చంద్ర‌బాబు చెప్పారు. మహానాడులో ప్రజాచైతన్యం వెల్లువిరిసింద‌ని, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టామ‌ని తెలిపారు. ప్రజల్లో కదలిక ప్రారంభం మాత్రమే, వైకాపా స‌ర్కారుకు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని, జాగ్రత్తగా ఉండాలని వైకాపా నేతల్ని హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read