టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో గంటా శ్రీనివాసరావు దాదాపు గంట పాటు మంతనాలు జరిపారు. వీరి భేటీపై అధికారికంగా ఏ ప్రకటనా ఇంకా విడుదల కాలేదు. అయితే పార్టీలు మారడం, పదవులు పొందడం ఒక నిరంతర ప్రక్రియలా చేపట్టే గంటా కొన్నాళ్లుగా టిడిపికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అధికార వైసీపీలో చేరడానికి విశ్వప్రయత్నాలు చేశారని కథనాలు స్పష్టం చేస్తున్నాయి. లేటెస్ట్గా డిసెంబర్ మొదటివారంలో కూడా వైసీపీలోకి జంప్ కొడతారని వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమో కానీ కాపు హక్కుల పరిరక్షణ అవతారం ఎత్తారు గంటా. మామూలు రాజకీయ నాయకుల్లా కాకుండా నిరంతరం పార్టీలు, ప్రజలనాడిపై సర్వేలు చేయించే గంటా శ్రీనివాసరావుకి వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని తేలిందని, దీంతో ఊగిసలాట ధోరణికి కట్టిపెట్టి పార్టీలో కొనసాగేందుకు మొగ్గు చూపారని టాక్ వినిపిస్తోంది. జనసేన-టిడిపి జత కట్టడం గ్యారంటీ అని తేలిపోవడంతో మౌనం వీడిన గంట మోగిందని తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు ప్యాకేజీ పాలిటిక్స్ ని టిడిపి ఎంటర్ టైయిన్ చేస్తుందా? కష్టకాలంలో తెరమరుగై కలిసొచ్చే కాలంలో తిరిగొచ్చిన గంటాకి పూర్వ ప్రాధాన్యం ఇస్తుందా త్వరలో తేలనుంది. టీడీపీ అధిష్టానం గంటా ఎటువెళ్లినా పట్టించుకోదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో లోకేష్ తో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గంటకి పైగా గంటా ఏం చర్చించారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశాఖలో బాబు, లోకేష్ పర్యటనలకు వచ్చినప్పుడు పత్తా లేని గంటా కలుగులోంచి బయటకొచ్చింది ఎందుకో అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
news
ఒక్క భేటీతో విలవిల... వైసీపీ పేటీఎం బ్యాచులు దిగేశాయి..
వైసీపీకి సోషల్‌మీడియా అతి పెద్ద బలం. అబద్ధాలను ప్రచారం చేయడంలో వీరిని మించిన వారు లేరు. గ్రామ వలంటీర్లుగా పనిచేస్తున్న వారి దగ్గర నుంచి దర్శకుడు రాంగోపాల్ వర్మ వరకూ అతి పెద్ద పేటీఎం సైన్యం వైసీపీకి ఉంది. వీరంతా సమయం చూసుకుని వస్తుంటారు. అవాస్తవాలను వాస్తవాలని నమ్మించేలా చేయడం, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం పై స్థాయి పెయిడ్ పేటీఎం పెద్దలు చేస్తుంటారు. మధ్యలో గుర్రం గ్యాంగ్ దండుపాళ్యం పనులు చక్కబెడుతుంది. ఫేక్, మార్ఫింగ్ వీడియో ఆడియో పోస్టర్లు చేసి వదలడం ఈ పేటీఎం వింగ్ చూస్తుంది. ఐప్యాక్ విభాగాల పేటీఎం కార్మికులు చౌదరీస్ పేరుతో సోషల్‌మీడియా ఖాతాలు ఓపెన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కి టిడిపి పగ్గాలివ్వాలంటూ పోస్టులు ఆరంభించాయి. కాపు ఇంటి పేర్లతో మరికొన్ని ఖాతాలు రన్ చేస్తూ పవన్ కి ప్రాణం ఇస్తాం..జగన్ కి ఓటేస్తామంటూ పాత చింతకాయ పోస్టులు రన్ చేస్తుంటాయి. మధ్యలో అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్ లాగ ముద్రగడ పద్మనాభం ఉత్తుత్తి ఉత్తరాలు, రాంగోపాల్ వర్మ రంగీలా మార్కు పోర్న్ ట్వీట్లు దర్శనం ఇస్తాయి. వీరంతా టిడిపి, జనసేన కమ్మ కాపుల మధ్య వివాదం సృష్టించడమే తమ జీవిత లక్ష్యంగా పనిచేస్తుంటారు. వాస్తవంగా రాంగోపాల్ వర్మ నుంచి వలంటీర్ వాసు వరకూ పోస్టుకి వారి స్థాయిని బట్టి పేమెంట్ జరిగిపోతుంది. ఈ పేటీఎం గ్యాంగులో భారీ ప్యాకేజీ తీసుకుని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే తిమింగలాలూ ఉన్నాయి. వీరంతా ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయారు. టిడిపి-జనసేన అధినేతల భేటీ వీరికి కంటిమీద కునుకు ఉంచడంలేదు. పేమెంట్ కి తగినట్టు అరిచేవారు, మొరిగేవారు, రాసేవారు, ట్వీటేవారు చెలరేగిపోతున్నారు. ఈ బ్యాచులో శ్రీరెడ్డి ఇంకా యాక్టివ్ కాలేదు. కత్తి మహేష్, ఇలపావులూరి చనిపోవడంతో కొత్త పేటీఎం ముత్తయిదవులను రంగంలోకి దింపనున్నారని సమాచారం.
పెద్దిరెడ్డికి అమిత్ షా టెన్షన్.. నెక్స్ట్ ఏమి జరగబోతుంది ?
ఎదురులేని పెద్దరికం చెలాయిస్తున్న పెద్దిరెడ్డికి అమిత్ షా టెన్షన్ పట్టుకుంది. ఏ పార్టీ అయినా కానీ, అవినీతిని ప్రశ్నిస్తే చితక్కొట్టించే పెద్దాయనకే అనుకోకుండా పెద్ద కష్టం వచ్చింది. 16 వేల ఓట్లొచ్చిన బీసీయే కదా అని దాడి చేయిస్తే..ఈ బీసీ పోయి అమిత్ షా దగ్గర పంచాయతీ పెట్టాడు. ఏం చేయాలో తెలియక పెద్దిరెడ్డి సతమతమవుతున్నాడు. ఏపీలో ప్రశ్నిస్తే ప్రజలైనా ప్రతిపక్ష నేతలైనా ప్రభుత్వ దా-డు-లు ఎదుర్కోక తప్పదు. ఈ అరాచకం మోతాదు పెద్దాయనగా పిలవబడే పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరు, తమ్ముడు నియోజకవర్గం తంబళ్లపల్లెలో మరీ ఘోరంగా ఉంటుంది. మద్యం రేట్లు దారుణమని సోషల్‌మీడియాలో పోస్టు పెట్టిన ఓంప్రతాప్ తెల్లారేసరికి శ-వం అయ్యాడు. దౌర్జన్యాలను ప్రశ్నించిన జడ్జి రామకృష్ణపై హ-త్యా-యత్నం చేశారు. ఈ దా-డు-లపై వార్తలు రాసిన విలేకరిపై దా-డు-ల-కు పాల్పడింది గ్యాంగ్. ఇంతటి అరాచకుడు విపక్ష నేతలని వదలడంలేదు. గత ఎన్నికల్లో పోటీచేసిన జనసేన అభ్యర్థి రామచంద్రయాదవ్ చాలా రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఇటీవల కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే పెద్దిరెడ్డి మనుషులు ఇంటిని, వాహనాలను ధ్వంసం చేశారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు సమావేశం పెట్టిన రామచంద్రయాదవ్ పై దా-డు-ల-కు పాల్పడ్డారు. స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. పైగా పెద్దిరెడ్డి ప్రోద్బలంతో రివర్స్ కేసులు బనాయించారు. కొన్నివారాల పాటు మౌనంగా ఉన్న రామచంద్రయాదవ్ హఠాత్తుగా అమిత్ షాతో భేటీ అయ్యాడు.
తనపై, తన కుటుంబ సభ్యులపై అనుచరులతో మంత్రి పెద్దిరెడ్డి దా-డి చేయించారని షాకి ఫిర్యాదు చేసినట్టు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. తనపై దాడి గురించి ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకు పోలీసులు ఎవరిపై చర్యలు తీసుకోలేదని, మంత్రి పెద్దిరెడ్డిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా సభ పెట్టుకోనివ్వలేదని, గత నెల రైతుభేరి సభ జరగకుండా అడ్డుకున్నారని అమిత్ షాకి ఫిర్యాదు చేశారు. ఇంటిపై దా-డి, నా కుటుంబాన్ని హతమార్చేందుకు ప్రయత్నించారని రామచంద్రయాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని, తనకు భద్రత కల్పిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని రామచంద్రయాదవ్ తెలిపారు. ఈ విషయాలు మీడియాలో ప్రముఖంగా రావడంతో పెద్దిరెడ్డిలో టెన్షన్ మొదలైంది. తనకో,సీఎంకో అమిత్ షా అపాయింట్మెంట్ అసాధ్యం అయితే, రామచంద్రయాదవ్ కి ఎలా దొరికిందనేది పెద్దిరెడ్డికి అంతుబట్టటంలేదు.
చంద్రబాబుని సీక్రెట్ గా కలుస్తున్న ఉన్నతాధికారులు !
ఏపీలో పొలిటికల్ ట్రెండ్ ఒక్కసారిగా మారిపోయింది. చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటనలు సక్సెస్ కావడం రాజకీయ వాతావరణంపై అన్ని వర్గాలకు స్పష్టత వచ్చేస్తోంది. మరోవైపు బాబు-పవన్ భేటీతో మరింత క్లారిటీ అందరికీ వచ్చేసింది. టిడిపి ప్రభుత్వం రావడం ఖాయమని నిర్ధారించుకున్న గోడమీద పిల్లుల్లాంటి నేతలు పెదబాబుని, చినబాబుని కలిసి తాము ఎందుకు దూరంగా ఉంటున్నామో వివరణ ఇస్తున్నారు. తాము ఇకపై యాక్టివ్ గా ఉంటామని నమ్మబలుకుతున్నారు. పదవుల కోసమో, కేసుల భయంతోనో, తాత్కాలిక ప్రయోజనాల కోసమో పార్టీ మారిన వారు సైతం తెలుగుదేశంలోకి మళ్లీ వస్తామంటూ సంకేతాలు పంపుతున్నారు. సామాన్యప్రజలు, నేతలకే వైసీపీ పోవడం, టిడిపి రావడం ఖాయమని తేలిపోతే..ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఈ విషయాన్ని ఎప్పుడో పట్టేశారు. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్‌లు హైదరాబాద్‌లో చంద్రబాబుని రహస్యంగా కలుస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వంలో కీలక పెద్దల ఆదేశాలతో తాము అడ్డగోలు నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదని వాపోతున్నారు. వారికి చంద్రబాబుతో గత ప్రభుత్వంలో అనుబంధం, బంధుత్వాలు, స్నేహాలను గుర్తుచేస్తూ...ప్రభుత్వంలోకి వచ్చాక తమ తప్పుల్ని మన్నించేయాలని ముందుగానే వేడుకుంటున్నారు. పోలీసుశాఖలో చాలా ఘోరంగా వ్యవహరించిన ఓ ఐపీఎస్ బెట్టింగ్ మాఫియా కేసుల్లో అడ్డంగా దొరికిపోయినా..చంద్రబాబు కాపాడారని టాక్ ఉంది. వైసీపీ సర్కారు రాగానే టిడిపిపై జులుం చెలాయిస్తూ ఆ అధికారి చెలరేగిపోయాడు. కట్ చేస్తే చంద్రబాబుని రహస్యంగా విడతల వారీగా కలుస్తున్న అధికారుల్లో ఈ ఐపీఎస్ ఉన్నారని సమాచారం. మరోవైపు సీఐడీలో పనిచేస్తున్న వారంతా చంద్రబాబుని ఎలాగైనా కలిసి తమ తప్పేమీ లేదని, అంతా ఆ ఉన్నతాధికారి ఆడించే ఆటలో పావులం అంటూ చెప్పుకుంటామని రిఫరెన్సులు వెతుక్కుంటున్నారట. మొత్తానికి ఏపీలో పొలిటికల్ ట్రెండ్ ని పసిగట్టిన అధికారులు చంద్రబాబునాయుడిని పట్టుకుంటే క్షమించి వదిలేస్తారనే ధీమాతో హైదరాబాద్ అపాయింట్మెంట్ల కోసం నానా అగచాట్లు పడుతున్నారు.