సంక్రాంతి పండ‌గ అంటేనే తెలుగు లోగిళ్లు వెలిగిపోతాయి. అచ్చ‌మైన ప‌ల్లె పండ‌గ‌ని కోట్లాది మంది జ‌రుపుకున్నారు. సంస్కృతికి సంక్రాంతి నిద‌ర్శ‌నం. సంప్ర‌దాయాల‌కు పెద్ద పండ‌గ‌. వ్య‌వ‌సాయమే జీవ‌నాధార‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సంక్రాంతి పండ‌గ అంటే పంట ఇంటికొచ్చినంత ఆనందంగా జ‌రుపుకుంటారు. పిల్లా పెద్దా అని తేడా లేదు. ధ‌నికా పేదా తార‌త‌మ్యం లేకుండా బంధువులంతా ఒక చోట చేరి  పండ‌గ జ‌రుపుకుంటారు. కరోనా వ‌ల్ల రెండేళ్లుగా క‌ళ త‌ప్పిన ఈ ఏడాది  సంక్రాంతి సంబ‌రాలు కొత్త కాంతులు విర‌జిమ్మాయి. అంద‌రిలాగే త‌న ప‌ల్లెలో భోగి, సంక్రాంతి పండ‌గ‌ల‌ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబునాయుడు జ‌రుపుకున్నారు. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి గ్రామ‌స్తుల‌తో సామూహిక భోజ‌నాలు చేశారు. ఎడ్ల‌బండిపై ఊరేగారు. గ్రామ‌స్తుల‌కు ముగ్గులు, గాలిప‌టాల పోటీలు నిర్వ‌హించి బ‌హుమ‌తులు అంద‌జేశారు. త‌మ పెద్ద‌ల‌కు, నాగాల‌మ్మ త‌ల్లికి పూజ‌లు చేశారు. మొత్తానికి తెలుగువారి లోగిళ్ల‌లో జ‌రిగే అచ్చ‌మైన ప‌ల్లె సంక్రాంతిని బంధుమిత్ర స‌ప‌రివారంగా గ్రామస్తుల‌తో క‌లిసి చంద్ర‌బాబు జ‌రుపుకున్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబ‌రాలు సినిమా సెట్ని త‌ల‌పించాయి. ఇంట్లోనే సంక్రాంతి ప‌ల్లె సెట్ వేశారు. ఆయన భార్య తప్ప, ఇతర కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా జ‌రిగిన పండ‌గ అచ్చం సినిమా షూటింగ్ ని త‌ల‌పించింది.  వేకువ‌నే నారావారి ప‌ల్లెలో భోగి మంట‌లు వేసుకున్నది చంద్ర‌బాబు అయితే, వైఎస్ జ‌గ‌న్ మిట్ట‌మ‌ధ్యాహ్నం చెవిరెడ్డి వేయించిన సెట్ లో భోగి మంట‌లు వెలిగించారు. మొత్తానికి సంక్రాంతి సంప్ర‌దాయాన్ని స‌మున్న‌తంగా చంద్రబాబు పాటిస్తే, జ‌గ‌న్ సంక్రాంతి షూటింగ్ని త‌ల‌పించింది.

తన విధ్వంసకరపాలన, అంతులేని అవినీతి, అడ్డూఆపులేని దోపిడీ, అన్నింటికంటే గొప్ప దైన తన ముఖారవిందం చూసి ఏపీకి పరిశ్రమలు రావని, పారిశ్రామికవేత్తలెవరూ పైసా పెట్టు బడి పెట్టరని జగన్ రెడ్డికి అర్థమైందని, అందుకే ప్రపంచప్రఖ్యాత దావోస్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో ఏపీప్రభుత్వం పాల్గొనలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఎద్దేవాచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం...! “చంద్రబాబునాయుడి పాలనలో రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా, పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా ఉండేది. దావోస్ వేదిక మొదలు, ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల్ని, పెట్టుబడి దారుల్ని ఆకర్షించడానికి చంద్రబాబు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక, పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. చంద్రబాబుహాయాంలో రాష్ట్రప్రభు త్వంతో పారిశ్రామికవేత్తలు చేసుకున్న రూ.16లక్షలకోట్ల పారిశ్రామికఒప్పందాల్ని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చీరాగానే దుర్మార్గంగా రద్దుచేశాడు. జగన్ అహంకారపూరిత నిర్ణయం, ప్రతిపారిశ్రామికవేత్తను ఆలోచించుకునేలా చేసింది. దానిప్రభావమే నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్కపరిశ్రమ రాకపోవడం. టీడీపీప్రభుత్వంలో రూ.5,17,000కోట్ల పెట్టబడులు వచ్చాయన్న మేకపాటి గౌతమ్ రెడ్డి సమాధానంపై జగన్ రెడ్డి ఏం చెబుతాడు? తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.5,17,000కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, 5లక్షల పైన ఉద్యోగాలు వచ్చాయని వైసీపీప్రభుత్వంలోని మంత్రే శాసనమండలిలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 10-07-2019న నాడు పరిశ్రమలశాఖామంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి, టీడీపీప్రభుత్వంలో ఏ జిల్లాకు ఎలాంటిపరిశ్రమలు వచ్చాయో, ఎన్నిలక్షల ఉద్యోగాలు వచ్చాయో స్పష్టంగా చెప్పారు. టీడీపీప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులే రాలేద నే ముఖ్యమంత్రి, స్వర్గీయ మేకపాటి గారి వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతాడు?

పొరుగురాష్ట్ర మంత్రి దావోస్ లో పెట్టుబడులు ఆకర్షిస్తుంటే, ఏపీ మంత్రి విశాఖపట్నంలో కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగితేలుతున్నాడు. జగన్ రెడ్డి నాలుగేళ్లపాలనలో ఒక్కఫ్యాక్టరీ రాలేదు. జగన్ రెడ్డి దెబ్బతో గతప్రభుత్వంతో చేసుకున్న పారిశ్రామికఒప్పందాలను రద్దుచేసుకొని, పారిశ్రామికవేత్తలంతా పొరుగు రాష్ట్రాల కు పారిపోయారు. హార్డ్ వేర్ నుంచి అండర్ వేర్ కంపెనీ వరకు అన్నీ పలాయన బాటలో పయనించాయి. రాష్ట్రానికి పైసా పెట్టుబడి తీసుకురావాలన్న ఆలోచన, పదిమందికి ఉపాధికల్పించాలన్న సద్భుద్ధి జగన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి లేదు. నిన్నటినుంచి దావోస్ లో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ మొదలైతే రాష్ట్రప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకోలేదు. దావోస్ వెళ్లిన తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్ వారి రాష్ట్రానికి వేలకోట్ల పెట్టుబడులు రాబడుతున్నాడు. దక్షిణాదిలో పారిశ్రామికవేత్తలకు హైదరాబాదే సురక్షితమని చెబుతూ, వారిని ఆకర్షిస్తున్నాడు. పొరుగురాష్ట్ర మంత్రి అలాచేస్తుంటే, ఈ ముఖ్యమంత్రేమో తాడేపల్లి వదిలి బయటకురాకుండా, సొంతరాష్ట్రంలోని పరిశ్రమల్ని తన్ని తరిమేస్తున్నాడు. దావోస్ సదస్సులో ఏపీ ప్రాతినిధ్యం ఎందుకులేదో ముఖ్యమంత్రి చెప్పాలి. దేశంలోని అన్నిరాష్ట్రాలు పరిశ్రమల్ని ఆహ్వానించడానికి పడరానిపాట్లు పడుతుంటే, జగన్ రెడ్డికి అస లు వెళ్లాలన్న ఆలోచనే రాకపోవడం సిగ్గుచేటు. అన్నిరాష్ట్రాల పాలకులు దావోస్ వేదికపై తమస్వరాలు వినిపిస్తున్నవేళ, జగన్ రెడ్డి తాడేపల్లిలో చిందులేస్తుంటే, పరిశ్రమలమంత్రి విశాఖపట్నంలో కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడు. సొంత పార్టీవారు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తల్ని కమీషన్లకోసం వేధిస్తుంటే, ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నాడు.

ఏపీ యువత బూమ్ బూమ్ బీర్లు అమ్ముకుంటూ, గంజాయి పీలుస్తూ బతకాలన్నదే జగన్ రెడ్డి ఆలోచన. నాలుగేళ్లలో రాష్ట్రానికి వచ్చినపరిశ్రమలు, యువతకు ఇచ్చిన ఉద్యోగాలపై పూర్తివాస్తవాలతో జగన్ రెడ్డి శ్వేతపత్రం విడుదలచేయాలి. నాలుగేళ్ల తనపాలనలో రాష్ట్రానికి ఏంపరిశ్రమలు తీసుకొచ్చాడో, ఎన్ని ఉద్యోగాలిచ్చాడో జగన్ రెడ్డి శ్వేతపత్రం విడుదలచేయగలడా? అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ సొంత రాష్ట్రానికి గుడ్ బై చెప్పి హైదరాబాద్ కు ఎందుకు వెళ్లిందో ముఖ్యమంత్రి చెప్పాలి. టీడీపీప్రభుత్వంలో రూ.10 లక్షలకోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందంచేసుకున్న పరిశ్రమలన్నీ, జగన్ రెడ్డి బ్లాక్ మెయిల్ దెబ్బతో రాష్ట్రానికి గుడ్ బై చెప్పాయి. రూ.67వేలకోట్ల పెట్టుబడితో ఒప్పందం చేసుకున్న అదానీ డేటా సెంటర్, రూ.50వేల కోట్ల పెట్టుబడి పెడతామన్న సింగపూర్ స్టార్టప్ కంపెనీలు, రూ.28వేలకోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్న ఏషియన్ పేపర్ మిల్స్ , రూ.15వేలకోట్ల రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, రూ.9,500కోట్ల అమర్ రాజా బ్యాటరీస్, రూ.2,200కోట్ల లులూ గ్రూప్, రూ.727కోట్ల టైటాన్, రూ.500కోట్ల ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలన్నీ జగన్ రెడ్డి అవినీతిదెబ్బకు రాష్ట్రం విడిచిపోయింది నిజంకాదా? జగన్ రెడ్డి నిర్వాకంతో ఉపాధి, ఉద్యోగా లు లేక రాష్ట్రయువత నిర్వీర్యమైపోతోంది. ఏపీ యువత బూమ్ బూమ్ బీర్లు అమ్ముతూ, మాంసం కొట్టుకుంటూ, గంజాయి పీలుస్తూ బతకాలన్నదే జగన్ రెడ్డి ఆలోచన. నాలుగేళ్ల వినాశకర పాలనతో రాష్ట్రాన్ని, యువశక్తిని నిర్వీర్యంచేసి, ఏపీకి భవిష్యత్ లేకుండా చేసినం దుకు జగన్ రెడ్డి రాష్ట్రయువతకు, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి” అని బొండా ఉమా డిమాండ్ చేశారు.

గ‌త ఏడాది దావోస్ ప‌ర్య‌ట‌న పేరుతో లండ‌న్ దాకా వెళ్లిపోయారు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. అప్పట్లో ఈ పర్యటన హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఏడాది క‌నీసం దావోస్ నుంచి పిలుపు కూడా రాలేదేమో, తాడేప‌ల్లిలోనే ఉండిపోయారు. ప్రపంచ ఆర్ధిక సదస్సుని ప్ర‌తీ ఏటా దావోస్లో నిర్వ‌హిస్తారు. ఈ వేదికపై త‌మ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు గ‌ల అవ‌కాశాలు, క‌ల్పిస్తున్న ప్ర‌యోజ‌నాల‌ను ఆయా ప్ర‌భుత్వాలు ప్ర‌చారం చేసుకుని పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నాలు చేస్తాయి. టిడిపి హ‌యాంలో దావోస్ కి చంద్ర‌బాబు, లోకేష్ వెళితే విమ‌ర్శ‌లు గుప్పించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ అండ్ బ్యాచ్, ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన త‌రువాత దావోస్ వెళ్లారు. వ‌చ్చిన పెట్టుబ‌డులు లేవు. ప్ర‌భుత్వం సొమ్ముతో జ‌గ‌న్ ప్ర‌త్యేక విమానంలో వెళ్లి త‌న కుమార్తెల‌ను క‌ల‌వ‌డంతో పాటు న్యాయ‌స్థానాలను దూషించిన కేసులో సీబీఐ వెతుకుతున్న పంచ్ ప్ర‌భాక‌ర్ తో భేటీ అయ్యారు. ఏపీ బృందం గ‌త దావోస్ ప‌ర్య‌ట‌న ఖ‌ర్చు కొండంత‌, రాష్ట్రానికి ఒన‌గూడిన ప్ర‌యోజ‌నం గోరంత కావ‌డంతో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ ఏడాది 16వ తేదీనే ప్రారంభ‌మైన దావోస్ స‌ద‌స్సుకి తెలంగాణ ఐటీ మంత్రి, అధికారుల బృందం హాజ‌రైంది. ప్ర‌తీ ఏటా దావోస్ వెళ్లే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ 30,000 కోట్లకు పైగా పెట్టుబడుల‌ను ఆక‌ర్షిస్తున్నారు.

davos 17012023 2

అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఇలా అనేక రాష్ట్రాల ప్రతినిధి బృందం దావోస్ వెళ్ళింది. ఇదే స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ ఐటిశాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ న్యూడిల్స్ బండి ప్రారంభోత్స‌వంలో బిజీగా వున్నారు. ఓ వైపు అప్పుల ఊబిలో కూరుకుపోయి దేశ‌వ్యాప్తంగా ప‌రువు పోగొట్టుకున్న వైసీపీ స‌ర్కారు, పారిశ్రామిక‌వేత్త‌ల బెదిరించ‌డం, ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాత సంస్థ‌లైన జాకీ, లులూ వంటివి పాల‌కులే త‌రిమేయ‌డంతో అంత‌ర్జాతీయంగా కూడా ఏపీ ప‌రువు పోయింది. దావోస్ నుంచి పిలుపు రాలేదు. ఒక వేళ పిలుపు వ‌చ్చినా సీబీఐ, ఈడీ కేసుల విచార‌ణ‌కి తోడు ఎన్ఐఏ కేసు విచార‌ణ‌కీ సాక్షిగా జ‌గ‌న్ హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించింది. ఈ జాతీయ సంస్థ‌లు విచార‌ణ‌లో ఉన్న జ‌గ‌న్ దావోస్ వెళ్లాలంటే కోర్టు అనుమ‌తి కావాలి. ఇది మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మై త‌న‌కు డ్యామేజీ అవుతుంద‌ని ఆగిపోయార‌ని జ‌ర్న‌లిస్టులు విశ్లేషిస్తున్నారు. అయితే అసలు దావోస్ నుంచి ఈ సారి పిలుపు కూడా రాలేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. గత ఏడాది దావోస్ లో జగన్ బ్యాచ్ నిర్వాకం మొత్తం, అక్కడ నిర్వాహకులు చూసి, ఈ సారి పిలవలేదేమో అని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దావోస్ పర్యటన పై వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎలాంటి వివరణ అయితే రాలేదు.

అమరావతి:-తెలుగు దేశం పార్టీ లో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్ర సందడి మొదలైంది. పార్టీలోని అన్ని ప్రాంతాల నేతలు లోకేష్ ను కలిసి పాదయాత్రకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో లోకేష్ ను పలువురు టీడీపీ సీనియర్ నేతలు కలిశారు. కుప్పం నుంచి ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే యువగళం పాదయాత్రపై నేతలు చర్చించారు. యువగళం యాత్రకు తమ మద్దతు తెలిపారు. ఈ రోజు కలిసిన వారిలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చిన రాజప్ప, పిఎసి చైర్మన్ పయ్యావుల కేశవ తదితరులు ఉన్నారు. తన పాదయాత్ర వివరాలను లోకేష్ వారిలో పంచుకున్నారు. మద్దతు తెలిపిన నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతల మద్దతు, సహకారంతో...ప్రజల్లో చైతన్యం తెచ్చేవిధంగా యువగళం పాదయాత్ర నిర్వహిస్తానని లోకేష్ వారికి తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read