ఈ రోజు సాయంత్రం ఎవరూ ఊహించని విధంగా, మాజీ డీజీపీ సాంబశివరావు, వైసీపీ అధినేత జగన్ ను కలవటం దుమారం రేపింది. విశాఖపట్నం జిల్లా, రాంబెల్లి మండలంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో మాజీ డీజీపీ, జగన్‌ను కలిశారు. అయితే, ఆయన జగన్ ను కలిసిన తరువాత విలేకరులతో మాట్లాడకుండా, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన వెంటనే, సాంబశివరావు వైసీపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆయన చేరిక దాదాపు ఖాయం అయ్యిందని, ఆయన పార్టీలో చేరటంతో, మా పార్టీ మరింత బలం పుంజుకుంది అంటూ హడావిడి చేసారు. దీనికి తోడు సాక్షి కూడా, ఆయనకు ఒంగోలు టికెట్ ఇస్తున్నట్టు ప్రచారం చేసారు.

dgp 25082018 2

అయితే ఈ ప్రచారాన్ని మాజీ డీజీపీ సాంబశివరావు ఖండించారు. తాను వైకాపాలో చేరుతున్నాను అంటూ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనను సాంబశివరావు ఖండించారు. ఆయన చెప్పింది అవాస్తవం అని చెప్పారు. తాను జగన్‌ను కలవటంలో రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం గంగవరం పోర్టు సీఈవో హోదాలో మర్యాద పూర్వకంగానే జగన్‌ను కలిశానని వెల్లడించారు. ఆయన్ను ప్రతిపక్ష నేత హోదాలో కలిసాను అని, గతంలో కూడా వైజాగ్ సీపీగా పనిచేసినప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబును కూడా కలిశానని వివరించారు. ఇప్పటికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచలన లేదని, విజయసాయి వ్యాఖ్యలు ఖండిస్తున్నట్టు చెప్పారు.

dgp 25082018 3

సాంబశివరావు, జగన్ ను కలవగానే రకరకాల ప్రచారాలు వచ్చాయి. వ్యక్తిగతంగా సాంబశివరావు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం ఒక వైపు చేస్తే, మరో పక్క మంత్రి అఖిల ప్రియ పెళ్లి విషయంలో, ఇబ్బంది అంటూ మరొక ప్రచారం జరిగింది. అయితే, ఇప్పటి వరకు, సాంబశివరావు ఎప్పుడు చంద్రబాబు పై అసంతృప్తి చూపించలేదు. చంద్రబాబు కూడా, సాంబశివరావుని డీజీపీగా కొనసాగించాలని కేంద్రంతో పోరాడారు. అయితే ఆ ప్రతిపాదనలను కేంద్ర హోంశాఖ నుంచి వెనక్కి వచ్చాయి. అయితే డీజీపీగా రిటైర్డ్ అయిన తరువాత కూడా చంద్రబాబు ఆయనకు, విశాఖపట్నం గంగవరం పోర్టు చీఫ్ సెక్యూరిటి అధికారిగా నియమించారు.

విశాఖ ఎంపీ కొత్తపల్లి గీత తన కొత్త రాజకీయ పార్టీని నిన్నప్రకటించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్‌ లో ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. జనజాగృతి పార్టీ పేరుతో ఆమె తన కొత్త పార్టీ జెండా, ఎజెండాను ప్రకటించారు. జనజాగృతి పార్టీలో మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు గీత. అలాగే వెనుకబడిన కులాల వారికి, ఎస్సీ, ఎస్టీలకు కూడా ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఇది ప్రజల పార్టీ అని, కొత్త తరహా పార్టీ అని, కొన్ని తీపి మాటలు చెప్పారు. ప్రజలతో మమేకమై మేనిఫెస్టోను రూపొందిస్తుందన్నారు. చంద్రబాబు దీక్షల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

geeta 25082018 2

అయితే కొత్తపల్లి గీత పార్టీ వెనుక, బీజేపీ పార్టీ ఉందని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఓట్లు చీల్చటం కోసమే, ఆమె చేత కొత్త పార్టీ పెట్టుస్తున్నారని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటమే ఆమె టార్గెట్ అనే వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల పై సరైన ఆధారాలు లేకపోవటం, ఇవన్నీ పుకార్లే అని అందరూ నమ్మారు. కాని నిన్న ట్విట్టర్ లో జరిగిన రచ్చ చూస్తే, కొత్తపల్లి గీత వెనుక బీజేపీ ఉందనే సంగతి బలపడింది. #JanaJagrutiParty అనే హ్యాష్ ట్యాగ్ తో, ట్విట్టర్ లో చాలా పోస్ట్ లు పడ్డాయి. దీంతో, ఇది నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. కొత్తపల్లి గీతకు ఇంత సపోర్ట్ ప్రజల్లో ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. తీరా, కొంచెం లోతుగా చూస్తే, దీని వెనుక ఉన్నవాళ్ళు దొరికిపోయారు.

geeta 25082018 3

ఈ ట్వీట్లు చేస్తుంది అందరూ, ఉత్తరాది వారే. ఎక్కువగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, బీహార్ కు చెందినవారే ఉన్నారు. వీరు అంతా బీజేపీ కోసం, ట్విట్టర్ లో పోస్టింగ్ లు పెట్టి, ట్రెండ్ చేసే వారు. వీరు కొత్తపల్లి గీత అనే ఆమె పార్టీ గురించి పోస్ట్లు పెట్టటం ఒక వింత. ఎందుకుంటే, కొత్తపల్లి గీత అంటే ఎవరో ఆంధ్రాలోనే సరిగ్గా తెలియదు. అయితే, ఇదంతా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ ఇటు జగన్, అటు మోడీతో కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ చెప్పినట్టు, పార్టీ పెట్టిన కొత్తపల్లి గీతకు ఇమేజ్ బిల్డింగ్ చేసే పనిలో ఉన్నారు. ఆమెను బలోపేతం చేసి, అన్ని వానరులు ఇచ్చి, దళిత, గిరిజన సామాజిక వర్గాలను చంద్రబాబు నుంచి దూరం చేసే ఆలోచనలో వీరు ఉన్నారు. అయితే, ఈమె గ్రౌండ్ లెవెల్ లో ట్రెండ్ అవ్వాలి కాని, ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తే, ఏమి జరుగుతుందో, వారికే తెలియాలి.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓవర్ ఆక్షన్ కి అవార్డు ప్రకటించారు, తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు... పవన్ చేస్తున్న ఓవర్ ఆక్షన్ భరించలేక, ఆయన చేస్తున్న కెసిఆర్ ఫ్యామిలీ భజన చూడలేక ఈ అవార్డు ప్రకటించినట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక్కడికే కాదు, తెలంగాణ మంత్రి కేటీ రామారావుతో కలిపి, ఈ అవార్డు ఇవ్వాలని అన్నారు. కేటీఆర్ కు, పవన్‌కల్యాణ్‌కు బూతు సాహితీ అవార్డు ఇవ్వాలని, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఇద్దరూ బూతులు మాట్లాడటంలో సిద్ధహస్తులని, ఇలాంటి వారికి ఇలాంటి అవార్డులే ఇవ్వాలని అన్నారు. శనివారం మీడియా ప్రతినిధులతో, వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేసారు.

pk 25082018 2

నాతో పోల్చుకుంటే, లోకేష్ కు అనుభవం ఏమి ఉంది, అని మొన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై కూడా వీహెచ్ స్పందించారు. లోకేష్ కన్నా పవన్‌కల్యాణ్‌కు ఎక్కువ అనుభవం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యెక హోదా విషయంలో, మోడీ మాట మార్చారని, కాంగ్రెస్ పార్టీ అలా చెయ్యదని, తెలంగాణా ఇస్తామని ఎలా చెప్పి ఇచ్చామో, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు అడ్డు పడిన కేసిఆర్ కు తెలంగాణలోని ఆంధ్రులు బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. మోడీ భజనలో కెసిఆర్ మునిగితేలుతున్నారని, అలాంటి ఫ్యామిలీని పవన్ భజన చెయ్యటం ఆపాలని అన్నారు.

pk 25082018 3

ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలని చెప్పిన ఎంపీ కవిత.. బిల్లు ప్రవేశపెట్టిన రోజున సభకు హాజరవ్వలేదని వీహెచ్‌ అన్నారు. ఇలాంటి కవితకు, చెల్లలు కవితకు ధన్యవాదాలు అని పవన్ చెప్పటం, కెసిఆర్ ఫ్యామిలీకి ఎంత భజన చేస్తున్నాడో అర్ధమవుతుందని అన్నారు. ఇంతకు ముందు అనేకసార్లు పవన్, కెసిఆర్, కేటీఆర్ భజన చేసిన సంగతి తెలిసిందే. కెసిఆర్ పరిపాలన అద్భుతం అంటూ, కెసిఆర్ ఇంటికి వెళ్లి మరీ పొగిడి, చంద్రబాబుకు పరిపాలనకు 2 మార్కులు, కెసిఆర్ పరిపాలనకు 6 మార్కులు అని చెప్పారు. అలాగే అనేక సందర్భాల్లో కేటీఆర్ ను పొగుడుతూ, లోకేష్ ని హేళన చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎవరూ ఊహించని విధంగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ సాంబశివరావు కలిశారు. అచ్యుతాపురం సమీపంలోని ధారభోగాపురం వద్ద ప్రజాసంకల్పయాత్ర శిబిరం వద్ద వైయస్ జగన్ ని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఇరువురు దాదాపు 15 నిమిషాలు చర్చించుకున్నారు. అయితే సాంబశివరావు వైపు నుంచి ఏ ప్రకటన లేదు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి మాత్రం, వైసీపీలో సాంబశివరావు చేరుతున్నట్లు ప్రకటించారు. సాంబశివరావు చేరికతో వైసీపీకి అదనపు బలం వచ్చిందని చెప్పారు. ప్రకాశం జిల్లాకు చెందిన సాంబశివరావు, సమర్ధవంతమైన అధికారిగా పేరు ఉంది.

nandauri 250820182

చంద్రబాబుకి చాలా నమ్మకమైన ఆఫీసర్ గా పేరు ఉంది. ఆయన కూడా చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్టుగానే, సామర్ధవంతంగా పని చేసారు. రిటైర్డ్ అయినా సరే, ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం అని భావించి, ఆయనకు విశాఖపట్నం గంగవరం పోర్టు చీఫ్ సెక్యూరిటి అధికారిగా, చంద్రబాబు నియమించారు. అందుకే ఆయన విశాఖలోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా జగన్ అక్కడ ఉండటంతో, ప్రతిపక్ష నాయకుడ్ని కర్టసీగా కలిసారేమో అని అందరూ అనుకున్నారు. కాని కొంచెం సేపటికే, విజయసాయి రెడ్డి వచ్చి, ఆయన పార్టీలో చేరినట్టు ప్రకటించారు.

nandauri 25082018 3

అయితే ఈయన చర్యతో అందరూ అవాక్కయారు. ఈయన డీజీపీగా ఉండగా, జగన్ పార్టీ నేతలను ఒక ఆట ఆడుకున్నారు. ఇలాంటి జగన్ పార్టీలో చేరటం, నిజంగానే షాక్ గా ఉందని అంటున్నారు. ఒక తెలుగుదేశం నేత మాట్లాడుతూ "సాంబశివరావు గారి లాంటి వ్యక్తి జగన్ చెంత కు చేరటం ...నిజంగానే షాక్..నిజాయితీ కలిగిన సాంబశివరావు గారు ...టీడీపీ ..చంద్రబాబు పట్ల ఏమి అసంతృప్తి కలిగిందో తెలియదు.. అత్యంత ప్రతిభా పాటవాలు కలిగిన ఆయన వైసీపి లో చేరటం దురదృష్టకరం... వారు ఆర్టీసీ లో కాని...డీజీపీ గా కాని అద్భుతంగా సేవలందించారు.. చంద్రబాబు తో విభేదించి నట్డు ఎక్కడా వార్తలు రాలేదు.. ఏది ఏమైనా ...పక్కలో బళ్ళాలను ఉంచుకున్నారు పాపం చంద్రబాబు...అప్పుడు ఐవైయ్యార్... ఇప్పుడు సాంబశివరావు గారు...ఇంకా ఎన్ని పాములొస్తాయో" అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read