టిడిపి యువ‌నేత నారా లోకేష్ పాద‌యాత్ర ప్రారంభమైంది. కుటుంబ‌మంతా ఆయ‌న వెంటే న‌డిచింది. వంద రోజులు పాద‌యాత్ర పూర్తి చేసుకున్నారు. నారా, నంద‌మూరి కుటుంబాలు వంద‌రోజుల పాద‌యాత్ర‌కి సంఘీభావంగా పాల్గొన్నారు. ఇదే స‌మ‌యంలో మ‌ద‌ర్స్ డే జ‌రిగింది. లోకేష్ త‌న త‌ల్లి భువ‌నేశ్వ‌రికి శుభాకాంక్షలు సోష‌ల్ మీడియా ద్వారా చెప్పాడు. ఆ త‌రువాత రోజే అమ్మ భువ‌నేశ్వ‌రి కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి లోకేష్ పాద‌యాత్ర‌కి వ‌చ్చి వెంట న‌డిచారు. దీనినే టిడిపి నేత‌లు ఎత్తి చూపుతున్నారు.
మదర్స్ డే రోజు జన్మనిచ్చిన తల్లికి కనీస శుభాకాంక్షలు కూడా తెలపని వాడు, ప్రజలకు మీ బిడ్డనని చెప్పుకుంటున్నాడ‌ని టిడిపి పొలిట్ బ్యూరో స‌భ్యుడు బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు జ‌గ‌న్ రెడ్డిని నిల‌దీశారు. పాదయాత్ర లో తల్లికి ప్రేమతో షూ లేస్ కట్టిన వ్యక్తిత్వం లోకేష్ దైతే, కన్న తల్లికి ఉన్న పదవులు పీకేసి రాష్ట్రం నుంచి తరిమేసిన బుద్ధి జగన్మోహన్ రెడ్డి ది అని ఆరోపించారు. టిడిపి నేత‌లు ఆరోపిస్తున్న‌ట్టు, జ‌గ‌న్ రెడ్డి త‌న త‌ల్లిని ప‌ద‌వుల్నించి బ‌ల‌వంతంగా రిజైన్ చేయించారు. తెలంగాణ‌లో త‌ల‌దాచుకుంటోంది. డిఎల్ ర‌వీంద్రారెడ్డి కూడా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌ల్లి, చెల్లి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పిన సంగ‌తి టిడిపి నేత‌ల ఆరోప‌ణ‌లకి మ్యాచ్ అవుతున్నాయి.

ఎన్టీజీ ఏపీ స‌ర్కారుకి విధించిన వంద‌కోట్లు జ‌రిమానా కూడా మంత్రి పెద్దిరెడ్డి కంపెనీలు పాల్ప‌డిన నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల వ‌ల్లేన‌ని అంద‌రికీ తెలిసిన విష‌యం. అటు పెద్దిరెడ్డిని కాపాడ‌డానికి, ఇటు వంద ల‌క్ష‌లు కూడా ఇవ్వ‌లేని స్థితిలో ఉన్న స‌ర్కారు వంద‌కోట్లు ఎలా క‌ట్ట‌గ‌ల‌ద‌ని ఎన్టీటీ తీర్పుపై సుప్రీంకోర్టుకి వెళ్లారు జ‌గ‌న్ రెడ్డి.  సుప్రీంకోర్టులో వైఎస్ జగన్ ప్రభుత్వాని షాక్ త‌గిలింది. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎన్జీటీ స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. చిత్తూరు జిల్లాలోని ఆవులపల్లి రిజర్వాయర్ కు పర్యావరణ అనుమతిని ఎన్జీటీ కొట్టివేసి జ‌రిమానా విధించింది. ఎన్జీటీ ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం మ‌రోసారి అత్యున్న‌త న్యాయ‌స్థానం ఎదుట బోల్తా ప‌డింది. ఎన్జీటీ విధించిన రూ.100 కోట్ల జరిమానాలో రూ.25 కోట్లను వెంటనే కృష్ణా బోర్డులో డిపాజిట్ చేయాలని  ధర్మాసనం ఆదేశించింది. రూ.100 కోట్ల జరిమానా విధించవచ్చా? అన్న అంశంపై పాక్షికంగా స్టే విధించిన సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్‍పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ అక్టోబర్ కు వాయిదా వేసింది. ఎన్జీటీ రూ.100 కోట్లు జరిమానా విధించడం చట్టబద్ధం కాదన్న ఏపీ స‌ర్కారు లాయ‌ర్‌ ముకుల్ రోహత్గీ వాద‌న‌పై ప్రాజెక్టులను మీకు అనుకూలంగా విడగొట్టడం ఎలా చట్టబద్దమని  కోర్టు ప్రశ్నించింది. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని.. రూ.100 కోట్ల జరిమానా భారం అవుతుందని ,రూ.100 కోట్ల జరిమానా నిలుపుదల చేయాలని కోర్టును ముకుల్ రోహత్గీ  కోర‌గా, ప్రస్తుతానికి రూ.25 కోట్లు కృష్ణా బోర్డులో జమ చేయాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది.

మాజీ మంత్రి పేర్ని నాని మాట‌కారే కాదు, అద్భుత‌మైన న‌టుడు. ద‌ర‌ఖాస్తు చేసుకుని వుండ‌డు కానీ, ఆంధ్రా నుంచి ఆస్కార్  ఎగ‌రేసుకుపోయేంత టాలెంట్. ప‌ది పైస‌ల ప‌ని, వంద రూపాయ‌ల ప్ర‌చారంలా ఉంటుంది నాని తీరు. బంద‌రులో మండుటెండ‌లో రోడ్డున వెళుతున్న ఓ వృద్ధురాలికి చెప్పుల్లేవు. ఆమెకి చెప్పులు కొనివ్వ‌డం చాలా మంచి విష‌యం. కానీ ఆ వృద్ధురాలిని చేయి ప‌ట్టుకుని నడిపించి షాపులోకి తీసుకెళ్లే త‌తంగ‌మంతా షూట్ చేసిన తీరు చూస్తే ఇదంతా ప్రీప్లాన్డ్ షూట్ అని ఇట్టే అర్థం అయిపోతుంది. ఎండ‌లో కాలు కాలిపోతున్న వృద్ధురాలికి చెప్పులు కొన్నానంటూ మీడియా, సోష‌ల్మీడియా అంత‌టా హోరెత్తిస్తున్న పేర్నినాని..ఆ చెప్పుల ఖ‌రీదు రూ.200. ఆ వృద్ధురాలు త‌న‌కి క‌ళ్లు క‌న‌ప‌డ‌వంటూ చెబుతూనే ఉంది, కానీ ఐప్యాక్ క్యాంపెయిన్ బృందం ఆ విష‌యం ప‌ట్టించుకోవ‌డంలేదు. ఎండ‌, వృద్ధురాలు, కాళ్ల‌కి చెప్పులు లేవు...ఈ మూడు అంశాల‌తో సానుభూతి కొట్టేయొచ్చ‌నే ఆరాటంతో చేసిన ఫోటో షూట్‌లో చివ‌రిలో ఆ ముస‌లావిడ త‌న‌కి క‌ళ్లు క‌నిపించ‌వంటూ సాయం అడుగుతుంటే ప‌ట్టించుకోకుండా, ఆమె చేతిలో డ‌బ్బులు తీసుకుంటున్న‌ట్టు వీడియోలో ఉంది. ఎంత ఆస్కార్ న‌టుడైనా ఏదో ఒక షాట్‌లో దొరికేస్తాడు. ముస‌లావిడ వెళుతూ చెప్పిన మాట‌లు ఎడిట్ చేయాల్సింది. ఇప్పుడు ఎంత‌గా అభాసుపాల‌య్యారో చూడండి. పేర్ని నాని అంత ద‌యార్ద్ర హృద‌యుడే అయితే, నిరుపేద‌ల కోసం టిడిపి క‌ట్టించిన 4 వేల ఇళ్లు ఇప్ప‌టికీ అప్ప‌గించకుండా వారు ఎండ‌లో ఎండుతూ, వాన‌లో నానుతూ..అద్దె ఇళ్ల‌లో త‌ల‌దాచుకుంటున్నారు. ఒక వృద్ధురాలు ఎండ‌లో చెప్పుల్లేకుండా న‌డ‌వ‌డం చూడ‌లేక‌పోయిన పేర్ని నాని, ఇలా వేలాదిమంది వృద్ధులు..చంటిపిల్ల‌ల‌తో ఉన్న కుటుంబాల‌ను న‌డివీధిలో వ‌దిలేయ‌డం పాపం అంటున్నారు బంద‌రు జ‌నాలు.

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి అంటే ఒక రేంజ్. టిడిపి ఆరోపించిన‌ట్టు ల్యాండ్-శ్యాండ్, రెడ్ శాండిల్, వైన్, మైన్ ఏదైనా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే. ఏ మాఫియా అయినా వేల‌కోట్ల దందా. పెద్దిరెడ్డి దొంగ ఓట్లు వేయించ‌డానికే వంద‌ల‌కోట్లు ఖ‌ర్చు చేస్తార‌ని విప‌క్షాలు ఆధారాల‌తో మీడియాకి ఇచ్చాయి. అటువంటి పెద్దిరెడ్డికి రైట్ హ్యాండ్ లాంటి దిలీప్ రెడ్డి, పెద్దిరెడ్డి స్థాయిని కించ‌ప‌రిచాడు. ప‌రువు తీసేశాడు. చీప్ గా వివిధ‌వ‌ర్గాల నుంచి కేవ‌లం రూ.30 ల‌క్ష‌ల‌కే ఛీట్ చేశాడు. ఇది పెద్దిరెడ్డికి తెలిస్తే, ఏమైనా ఉందా? త‌న రేంజు ఏంటి? త‌న పేరు చెప్పుకుని దిలీప్ రెడ్డి సాగిస్తున్న ఈ చిల్ల‌ర పంచాయ‌తీలేంటి? ఇళ్లు ఇప్పిస్తామంటూ ఒక్కొక్క‌రి నుంచి నాలుగేసి ల‌క్ష‌లు వ‌సూలు చేసి మోసం చేసిన పెద్దిరెడ్డి అనుచ‌రుడు, పెనుగొండ వైసీపీ నాయకుడు దిలీప్ రెడ్డిపై కేసు నమోదైంది. సర్వే నెంబర్ 101‍లో డబుల్ బెడ్ ఇళ్లు నిర్మిస్తానని.. ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల చొప్పున‌ సుమారు రూ.30 లక్షల మేర వసూలు చేసిన దిలీప్ రెడ్డి..ఇల్లు క‌ట్టించ‌క‌, డ‌బ్బులు అడిగితే తిరిగి ఇవ్వ‌కుండా త‌మ‌ని బెదిరిస్తున్నార‌ని బాధితులంతా కియా పోలీస్ స్టేషన్‍లో ఫిర్యాదు చేశారు. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో దిలీప్ రెడ్డిపై పోలీసులు కేసు న‌మోదు చేయాల్సి వ‌చ్చింది.

Advertisements

Latest Articles

Most Read