వైకాపాలో ఐ ప్యాక్ చెప్పిందే వేదం. జగన్ రెడ్డి ఐ ప్యాక్ గీసిన గీత దాటడు. ఇది నిన్నా మొన్నటి మాట. ఇప్పుడు ఐప్యాక్ అంటే జగన్ యాక్ అంటున్నారు. ప్రభుత్వంపై విపరీతమైన ప్రజావ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో జనంతో జగన్ ఉండేలా ఐ ప్యాక్ కార్యక్రమాలు రూపొందిస్తోంది. అసలు జనం వద్దకి వెళ్లడం ఇష్టంలేని జగన్, తాను వెళ్లకుండా తన పేరుతో ఓట్లు కొల్లగొట్టే ప్రణాళికలు ఇవ్వాలంటూ ఐప్యాక్ ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లాలంటే పరదాలు, విపరీతమైన పోలీసు బందోబస్తు, 10 కిలోమీటర్ల ప్రయాణానికి హెలికాప్టర్ వంటివి వాడుతున్న జగన్...జనం అంటేనే భయపడుతున్నారు. సభలకి వచ్చే జనం కూడా తన మనుషులే అయి ఉండాలన్నట్టు, అక్కడ ఎవరూ ఏ సమస్యపై అడగకూడదనేది జగన్ ఆలోచన. ఉప్పెనలో ఎగసిపడుతున్న ప్రజావ్యతిరేకత నేపథ్యంలో అది జరగని పని. ఐప్యాక్ బాధ్యతలు చూస్తున్న రుషిరాజ్ సింగ్ డిజైన్ చేసిన క్యాంపెయిన్లన్నీ జగన్ రెడ్డిని జనంతో ఇంటరాక్ట్ చేసేలా ఉన్నాయి. జగనన్నకి చెబుదాం అనే కార్యక్రమం చాలా రోజుల క్రితమే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ జగన్ ఒప్పుకోక ఇన్నాళ్లూ వాయిదా పడి ఇప్పుడు ఇలా పాత 1100ని నెంబర్ మార్చి 1902 పెట్టి జగనన్నకి చెబుదాం పేరుతో ప్రారంభించేశారు. ఐప్యాక్ చెప్పిన రోడ్లే వేయాలి, ఐప్యాక్ చెప్పిన వారికే టికెట్ అనే స్థాయి నుంచి ఐప్యాక్ చెప్పిన కార్యక్రమం అంటే తరువాత ఆలోచిద్దాం అనేంత వెగటుకి వచ్చేశారట జగన్ రెడ్డి.
news
చంద్రబాబుని ఆ బాబు బురిడీ కొట్టించినట్టే, జగన్ ని ఈ బాబు బోల్తా కొట్టిస్తున్నాడు
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ బాబు పాలనలో కొత్త విధానాలు, కనిపించే పాలన, కనిపించని ప్రభుత్వం, ఈ ప్రగతి, రియల్ టైమ్ గవర్నెన్స్ వంటి మంచి ప్రాజెక్టుల అమలుకి నేతృత్వం వహించారు. వీటి ఫలితాలు బాగుండడంతో అతన్ని చంద్రబాబు బాగా నమ్మారు. దీంతో ఆయన తన బృందాలు, టీములతో చంద్రబాబు చుట్టూ చేరి...పార్టీ యంత్రాంగానికి, ప్రజలకి దూరం అయ్యేలా చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు పాలన పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, 98 శాతం, 99 శాతం ఫీడ్ బ్యాక్ చూపించేవారు. 2019 ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియలేదు ఆ సంతృప్తిశాతం అంతా బోగస్ అని. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా జనం తన పాలన పట్ల బాగా సంతృప్తిగా ఉన్నారనే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమని నిజం చేసేలా ఐప్యాక్ రుషిరాజ్ సింగ్ జగనన్నే మా నమ్మకం కార్యక్రమానికి 2 కోట్ల మంది మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు ప్రకటించారని, ఈ ఓట్లు చాలు వైకాపాకి మళ్లీ అధికారం రావడానికి అంటూ ఫీడ్ బ్యాక్ ఇచ్చేశారు. అంతటితో ఆగకుండా వైకాపా ప్రభుత్వం పట్ల ప్రజలు కనబరిచిన విశ్వాసం విజయానికి సూచిక అంటూ ఈ కార్యక్రమంలో భాగమైన మొత్తం ఐప్యాక్ బృందాలన్నింటికీ గ్రాండ్ పార్టీ ఇచ్చేశాడు. మొత్తానికి చంద్రబాబు ఐఏఎస్ లు, కన్సల్టెంట్లని నమ్ముకుని ప్రజలకి పార్టీకి దూరమైతే...జగన్ రెడ్డి ఐప్యాక్-సలహాదారుల్ని నమ్ముకుని పార్టీకి-ప్రజలకి దూరం అవుతున్నారు.
చీఫ్ జస్టిస్ ..ఎన్నికల కమిషనర్ ..సూపర్ స్టార్..ఇప్పుడు జివిరావు..వైకాపా బాధితులు
వైకాపాని విమర్శించినా, ప్రశ్నించినా ఎంతటి వారైనా ఒకటే ట్రీట్మెంట్. ఇదొక్కటే కాదు, చంద్రబాబుని పొగిడినా వైకాపా బూత్ ఎటాక్స్ చవిచూడాల్సిందే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన ఎన్వీ రమణ కుటుంబసభ్యుల్ని సోషల్మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేయించి వైసీపీ పెద్దలు..ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కుటుంబసభ్యుల్ని సామాజికమాధ్యమాలలోకి లాగేశారు. బూతులు, అసభ్యమైన మార్ఫింగ్ పోస్టులకీ వెనుకాడరు. కేసులు ఎదుర్కొంటారు, కోర్టుల్లో దోషులుగా నిలబడటానికైనా సిద్ధంగా ఉంటారు కానీ, బూతు దాడులు మానరు. తాజాగా చంద్రబాబుని పొగిడారని రజనీకాంత్ ని తిట్టి తిట్టి అలిసిపోయారు వైకాపా పేటీఎం బ్యాచులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఆర్థిక నిపుణుడు జివి రావు (గంటా వెంకటేశ్వరరావు) ఈనాడుకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదే ఆయన చేసిన నేరం. ఆయన టిక్ టాక్ వీడియోలు తీసుకొచ్చి ఒక రేంజులో ట్రోలింగ్ కి దిగారు. వైసీపీ అధినేత జగన్ జివిరావుని ఆఫ్రికా వాడంటూ ఎద్దేవ చేయడం మరీ దారుణం. ఇదే జివి రావుని తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆర్థికవేత్తగా సన్మానించారు. ఇదే జగన్ రెడ్డి చానల్ సాక్షి స్కాక్ మార్కెట్ ఎనలిస్టుగా చాలా డిబేట్లకి గెస్ట్‌గా పిలిచారు. జగన్ రెడ్డి ఆయన గ్యాంగ్‌కి మాత్రం జివి రావు జోకర్ అంట. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ పాలన నెట్టుకురావడం కష్టమేనని జివి రావు చెప్పడమే ఆయన చేసిన నేరమన్నట్టు వైకాపాలో సీఎం నుంచి సోషల్ మీడియా పేటీఎం బ్యాచుల వరకూ చాలా ఘోరంగా దూషిస్తున్నారు.
వైకాపా పంచన చేరిన, జనసేన ఎమ్మెల్యే రాపాక అడ్డంగా దొరికిపోయాడు.
ఒకరిని విమర్శించామంటే మనం చాలా క్లీన్‌గా ఉండాలి. ఒకరిపై ఆరోపణలు చేశామంటే, మనపై ఎవరూ ఏ ఆరోపణా చేసే అంశాలు లేకుండా ఉండాలి. జనసేనలో గెలిచి, వైకాపాలో కలిసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసేవన్నీ పిచ్చ పనులు..చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. నిత్యమూ పేకాట ఆడుతూ పోలీసులకి దొరికితే అధికార పార్టీ అండతో తప్పించుకుంటూ ఉంటాడు. గెలిచింది జనసేన పార్టీ తరఫున అయినా అమ్ముడుపోయింది వైకాపాకి. తనని పదికోట్లకి కొనుగోలు చేయాలని చూసింది తెలుగుదేశం అంటూ మీడియా ముందుకు వచ్చి పతివ్రతలా పలావు వండాడు. జనసేన సోషల్ మీడియా మామూలుగా ఉండదు. రాపాక బోకు కబుర్లని చీల్చి చెండాడేశాయి. ఆ తరువాత తాను దొంగ ఓట్లతోనే గెలిచానంటూ వ్యాఖ్యానించి, ఇప్పుడు ఎన్నికల కమిషన్ విచారణ ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రజాధనం తన సొంతానికి వాడుకుని వార్తల్లో నిలిచాడు. కోనసీమ జిల్లా మలికిపురం మండలం కత్తిమండ గ్రామంలో ఇటీవల ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఓ ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటి వరకూ పంచాయతీ రోడ్డు నుంచి మరో కొత్త రోడ్డు నిర్మించారు. కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్న ఎమ్మెల్యే రాపాక, ఆ ఇంటికి రోడ్డు మాత్రం ప్రభుత్వ నిధుల్ని వాడుకున్నాడు. ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేయించుకుని తన ఇంటికి ఏకంగా రోడ్డేసేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు తన సొంత ఇంటి రోడ్డుకి వినియోగించారని కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కూడా జరుగుతుంటే, అడ్డంగా బుక్కయిన ఎమ్మెల్యే రాపాక రకరకాల కహానీలు వినిపిస్తున్నాడు.