బీజేపీ అనుకూల ఛానల్ గా పేరు ఉన్న రిపబ్లిక్ టీవీ, దేశ రాజకీయలను ప్రభావితం చేసే ఒక సంచలన కధనం ప్రసారం చేసింది.. అయితే, ఇది కావాలని మోడీ పై సానుభూతి కోసం చేసిందా అనే అనుమానం కూడా కలుగుతుంది... ఎందుకంటే, రెండు రోజుల క్రిందట ఇదే రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూ లో, మా పార్టీ పుట్టుకే కాంగ్రెస్ కు వ్యతిరేకం అని చంద్రబాబు చెప్పినా, రిపబ్లిక్ టీవీ మాత్రం, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, టీడీపీ నేత చంద్రబాబు, ఎన్సీపీ సారథి శరద్‌పవార్ కలిసి, మోడీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక కధనం ప్రసారం చేసింది.. అందులో భాగంగా, మోడీ వివిధ రాష్ట్రాలకి చేస్తున్న అన్యాయం పై, పలు పార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు రాజీనామా చేస్తున్నారు అంటూ ఆ కధనం సారంశం...
విశ్వసనీయ వర్గాల సమాచారం అంటు ఆ చానల్ ఈ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ ప్రణాళికకు కాంగ్రెస్, ఎన్సీపీ, టీడీపీ సహా పలు పార్టీలు రూపకర్తలుగా వ్యవహరించినట్లు అందులో పేర్కొంది. వంద మంది ఎంపీలతో రాజీనామాలు చేయించి ముందస్తు ఎన్నికలు పెట్టే పరిస్థితి తేవడం ద్వారా.. ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాల్లో మోదీ సర్కారుపై ఇప్పటికే కొన్ని వర్గాల్లో ఉన్న అసంతృప్తులను సొమ్ము చేసుకోవడమే విపక్షాల టార్గెట్ అని రిపబ్లిక్ చానల్ విశ్లేషించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన రెండు రోజుల హై-ప్రొఫైల్ ఢిల్లీ పర్యటనలో వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
అయితే ఈ కధనంలో వాస్తవం ఎంత వరకు ఉంది అనే ప్రశ్నలు వస్తున్నాయి... ఈ కధనం కేవలం మోడీకి దేశ వ్యాప్తంగా సానుభూతి కోసం ప్రసారం చేసింది అనే వాదనలు కూడా ఉన్నాయి... మోడీ ఒక్కరే దేశం కోసం పని చేస్తుంటే, మోడీని పడగొట్టటానికి విపక్షాలు అన్నీ కలిసి వస్తున్నాయి అనే ప్రచారం చేస్తున్నారు... దీనికి ఊతంగా నిన్న ప్రధాని మోడీ విడుదల చేసిన వీడియో సందేశం కూడా, అదే చెప్తుంది... నిన్న వీడియో మెసేజ్ లో మోడీ మాట్లాడుతూ, ఒక పేద తల్లి కొడుకు ప్రధాని అయితే, వీళ్ళు నన్ను పడగొట్టాలని చేస్తున్నారు అంటూ, మళ్ళీ సెంటిమెంట్ డ్రామా మొదలు పెట్టారు... ఇవన్నీ చూస్తుంటే, మళ్ళీ ఎదో ఎమోషన్ డ్రామా మొదలు పెట్టే పనిలో బీజేపీ ఉందని అర్ధమవుతుంది... హామీలు నెరవేర్చండి అంటే, పేద తల్లి కొడుకు అయితే ఏంటి, ధనిక తల్లి కొడుకు అయితే ఏంటి.. మా హామీలు నెరవేర్చండి ప్రధాని గారు...