రాష్ట్రం... అభివృద్ధి... ఆత్మవిశ్వాసం... ప్రజలేముందు..ఇదే అజెండా... అనితరసాధ్యమైన ఈ క్రతువు పూర్తిచేయటానికి ...తపస్సు చేస్తున్న చంద్రబాబుని ఇబ్బింది పెడుతూ, ఆటంకాలు,అవమానాలు,అవరోధాలు, ఆరోపణలుతో తపస్సు భగ్నం చేయటానికి చేయని ప్రయత్నం లేదు..! స్నేహం పేరుతో..పొత్తుల పేరుతో..సమయం చూసి దెబ్బతీయాలని పధకం వేసుకొని...ఇప్పడు రాజకీయాలు వద్దురా నాయనా...ఎన్నికలప్పుడు చూసుకుందాం అంటే వినకుండా...దీక్ష ని ,తపస్సుని చేతకాని తనం గా భావించి...ముప్పుతిప్పలు పెట్టారు... ఫలితం...!ఊచకోత...!ఢిల్లీ నడిబొడ్డులో... ఊచకోత!
ఎవరి పేరు చెపితే ఢిల్లీలో కొంత మంది పాద పూజ చేస్తారో, ఎవరి పేరు చెపితే గల్లీలో కొంత మంది ఆయనకి లొంగిపోతారో.. ఎవరి పేరు చెపితే నూట ఇరవై సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న రాజకీయ పక్షం ...చేష్టలుడిగిపోయిందో... ఎవరు పెద్దలు..గురువులను..అవమానించి పక్కకు తప్పించారో... ఆవ్యక్తి..ఆశక్తి...ఆసమూహం... కాని చంద్రబాబు వీరిలా కాదు, సర్జికల్ స్ట్రైక్ చేసారు... అతని రాజ్యకేంద్రం మీద మెరుపు దాడి నిర్వహించారు... ప్రజలముందు మీడియా సాక్షిగా ఊచకోత కోసారు... వర్గాలు...ప్రాంతాలు...కులాలు...పార్టీ లుకి అతీతంగా మద్దతు లభిస్తుంది...
చంద్రబాబు గారూ....మీరు మెత్తని వాడనుకున్నాము...మొత్తేసారు కదా మామ్మల్ని అంటూ, బీజేపీ నాయకులే వాపోతున్నారు... ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి రెండు రోజులు అయినా, ఇంకా ఆ ఊచకోతే ఢిల్లీ పెద్దలకు వినిపిస్తుంది... ఈ దెబ్బ ఆంధ్రాలో కాదు, మేము ఆశలు పెట్టుకున్న కర్ణాటక రాష్ట్రం పై కూడా చంద్రబాబు గెట్టిగా కొట్టారు అంటున్నారు బీజేపీ నేతలు... కోటి మంది తెలుగు ఓటర్లు ఉన్న కర్ణాటకలో చంద్రబాబు ప్రెస్ మీట్ దెబ్బ మాములుగా లేదు అంటున్నారు... మొన్నటి దాక, ఎదో ఒక ఆశ ఉండేది, కాని చంద్రబాబు కొట్టిన దెబ్బతో, ఇక దక్షినాదిలో కర్ణాటక ద్వారా అడుగు పెడదాం అనుకుంటున్న అమిత్ షా - మోడీ ఆశల పై చంద్రబాబు నీళ్ళు చల్లారు అని చెప్తున్నారు బీజేపీ నేతలు...