ఎవడో హైదరాబాద్ లో కూర్చుంటాడు... అమరావతి పై, ఆంధ్రా పై విషం చిమ్ముతాడు, చంద్రబాబుని తిడతాడు, కెసిఆర్ ని ఆహా ఓహో అంటాడు, ఆడిని తీసుకువచ్చి, ప్రైమ్ టైంలో కూర్చోబెట్టి, మన హైదరాబాద్ మీడియా విషం చిమ్ముస్తుంది... కాని ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మంచి మాత్రం చూపించారు... చూపించినా, ఎదో ఒక చిన్న 30 సెకండ్స్ బిట్ వేసి, మమ అనిపిస్తారు... అయ్యా హైదరాబాద్ మీడియా, ఈ రోజు మా రాష్ట్రంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటార్స్, తన తయారీ ప్లాంట్ ను, మా రాష్ట్రంలో నెలకొల్పుతుంది... ఈ రోజు భూమి పూజ, కొంచెం, ఇలాంటివి కూడా, చూపించి, మా రాష్ట్ర ప్రగతిని చూపించండి...

hero 23032018

ఈ రోజు జరగనున్న హీరో మోటార్స్ బూమి పూజ గురించి, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వివరాలు చెప్పారు... గురువారం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీసిటీకి సమీపంలో ఉన్న మాదన్నపాల్యెం వద్ద 636 ఎకరాల విస్తీర్ణంలో ద్విచక్ర వాహనాల తయారీని హీరో మోటార్స్ ఏర్పాటు చేస్తోందన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.3200 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ 2019 చివరి నాటికి 5లక్షల మోటార్ సైకిళ్లను తయారు చేయనుందన్నారు.

hero 23032018

2020 నాటికి రెండోప్లాంట్‌ను రెండో దశతో కలిపి రూ.1600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానుందన్నారు. ఈ రెండు ప్లాంట్‌ల నిర్మాణాలు పూర్తయితే ఏటా 10లక్షల ద్విచక్రవాహనాలు తయారవుతాయన్నారు. 2025 నాటికి 18లక్షల మోటారు సైకిళ్లు ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. ఇప్పటికే రూ. 22కోట్ల 83లక్షలతో కాంపౌండ్ వాల్ పనులు పూర్తయ్యాయన్నారు. జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపోలో టైర్ల పరిశ్రమకు శంకుస్థాపన చేశారని, వీటి పనులు వేగవంతంగా సాగుతున్నాయని, అనంతపురంలో కియో కార్ల పరిశ్రమ ప్రారంభం కానుందన్నారు. ఈక్రమంలో రానున్న కాలంలో పరిశ్రమలకు, ఐటీ హబ్‌గా రాయలసీమ నిలువనుందన్నారు.

తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంతో, మోడీ - అమిత్ షా కు చికాకు తెప్పిస్తుంది... వైసిపీతో అవిశ్వాసం పెట్టించి, ఎదో గేమ్ ఆడదాం అనుకున్నారు... కాని, వీరి ఇద్దరి కుట్రలు పసిగట్టిన చంద్రబాబు, వెంటనే తన పార్టీ చేతే అవిశ్వాసం పెట్టించారు... ఇక ఇంతే, ఒక్క గంటలో దేశ రాజకీయం మారిపోయింది... తెలుగుదేశం అవిశ్వాస తీర్మానానికి అన్ని విపక్షాలు మద్దతు తెలిపాయి... 4 ఏళ్ళలో ఎప్పుడూ కలవని విపక్ష పార్టీలు, చంద్రబాబు లాంటి నాయకుడు ముందుకు రావటంతో, అందరూ ఏకం అయ్యారు... దీనికి తోడు, బీజేపీ లో ఉన్న అద్వానీ వర్గం ఎంపీలు కూడా, చంద్రబాబుకు మద్దతు పలికే అవకాసం ఉందని సమాచారం...

modi 23032018 2

ఈ సమాచారంతో, మోడీ - అమిత్ షా, రిస్క్ తీసుకోవటం లేదు... మెజారిటీ ఉన్నా, ఎందుకో భయపడుతున్నారు... ముఖ్యంగా, అవిశ్వాసం కనుక పెడితే, దేశంలోని ప్రతి పార్టీ, మోడీ మీద ఎక్కి దిగుతుంది... మోడీ విధానాలని, వివక్షను ఎండగడతారు... ఇక అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం పార్టీకి, ఎక్కువ సమయం ఉంటుంది.. మోడీ మనకు చేసిన మోసాలు, పూర్తి ఆధారాలతో బయట పెడితే, ఇక మోడీ ఇమేజ్ గోవిందా... అందుకే, ఎలా చెయ్యాలో, ఏమి చెయ్యాలో అర్ధం కాక, రోజు సభ వాయిదా వేసుకుని పారిపోతున్నారు... దీని పై తీవ్ర విమర్శలు వస్తుండటంతో, మరో ఎత్తుగడతో ముందుకు వస్తున్నారు...

modi 23032018 3

ప్రతిపక్షాల అవిశ్వాసం కాదు, బీజేపీనే విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టబోతోంది అని ఢిల్లీలో వార్తలు వస్తున్నాయి... ఇలా తామే విశ్వాస తీర్మానం పెడితే, తాము చేసింది డబ్బా కొట్టుకోవచ్చు... లక్ష కోట్లు ఇచ్చాం అని ఎలా చెప్తున్నారో, అలా డబ్బా కొట్టుకుని, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు.. ప్రతి పక్షాలకి, ఒక్కో పార్టీకి 3-5 నిమషాలు మాత్రమే ఇస్తారు... ఇలా తమ వైఫల్యాల పై ఎక్కువ ఫోకస్ లేకుండా, చర్చ అంతా తాము ఇది చేసాం అది చేసాం అని చెప్తూ, కాంగ్రెస్ మీరు చెయ్యలేదు అని చెప్తూ, ఇలా సాగనుంది.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు, వారి సమస్యలు చెప్పే టైం ఉండదు... ఇది బీజేపీ ప్లాన్ గా చెప్తున్నారు... ఈ విధంగా, మేము ఎదో పోడిచేసాం అని చెప్పుకుని, ప్రతిపక్షాలని కార్నెర్ చేస్తారు.. ఈ విశ్వాస తీర్మానానికి మాత్రం, తెరాస, అన్నాడీయంకే ఎంపీలు అడ్డు తగలరు... చూద్దాం ఏమి జరుగుతుందో...

సురేంద్రబాబు... ఈ పేరు వింటే, రాష్ట్రంలో, ముఖ్యంగా బెజవాడలో, ఉన్న అసాంఘిక శక్తులు ఎక్కడి వారు అక్కడ పరార్... ఇలాంటి సురేంద్రబాబుని, ఎపిఎస్‌ఆర్‌టిసి ఎండిగా నియమిస్తూ ఎపి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది... ప్రస్తుతం ఆక్టోపస్ విభాగంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పని చేస్తున్న సురేంద్రబాబును ఎపిఎస్‌ఆర్‌టిసి ఎండిగా నియమించారు... అయితే ఇలాంటి సమర్ధవంతమైన అధికారిని, లా అండ్ ఆర్డర్ లో కాకుండా, ఎందుకు ఆర్‌టిసి ఎండిగా నియమించారు అనే అనుమాలు ఉన్నాయి... అయితే దీని వెనుక చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదు...

surendrababu 22032018 2

ప్రస్తుతం అడిషనల్ DGP ర్యాంక్ లో ఉన్న సురేంద్ర బాబుని, DGPకి ర్యాంక్ కు ప్రమోట్ చేసి, ఆర్టీసీ యండీగా పంపించారు... అయితే, దీని వెనుకు చంద్రబాబు ముందు చూపు కనిపిస్తుంది... రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థుతుల్లో, వచ్చే సంవత్సర కాలంలో, అల్లకల్లోలం చెయ్యటానికి ప్లాన్ లు వేస్తున్నారు.. అవి టీవీల్లో చూస్తూనే ఉన్నాం... మరో పక్క, ఎన్నికల సీజన్ కూడా వస్తుంది... ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు సురేంద్ర బాబుని, DGPకి ర్యాంక్ ఇచ్చారు... త్వరలోనే, సురేంద్ర బాబు, DGPగా వచ్చే అవకాసం ఉంది...

surendrababu 22032018 3

ప్రస్తుతం ఉన్న మాలకొండయ్య పదవీ కాలం, మరో 3-4 నెలల్లో ముగియనుంది... ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే, సురేంద్ర బాబు, DGPగా వచ్చే అవకాశాలు ఉన్నాయి... ఇది చంద్రబాబు స్కెచ్ అని చెప్తున్నారు... చరిత్ర చూసుకుంటే, నండూరి సాంబశివరావు గారు కాని, ప్రస్తుతం ఉన్న మాలకొండయ్య కాని, వీరిని కూడా ముందుగా, ఆర్టీసీ యండీగా చేసి, తరువాత వీరికి DGP ఇచ్చారు.. అదే క్రమంలో, సురేంద్ర బాబు కూడా, త్వరలో ఆంధ్రప్రదేశ్ DGPగా రానున్నారు... ఇక ఈ దెబ్బతో, ఆపరేషన్ గరుడలు, బిరడలు ఎలా సాగుతాయో, రౌడీ పార్టీలు ఎలా చేస్తాయో చూద్దాం...

సినీనటుడు శివాజీ ఒక జాతీయ పార్టీ, దక్షినాది రాష్ట్రాలని ఎలా కబలిస్తుందో, వివరుస్తూ, సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే... అయితే, ఈ విషయాలు అన్నీ వివరంగా చెప్పే, ఓ పెన్‌డ్రైవ్‌ ఇస్తానని, అందులో అన్ని విషయాలు ప్రజలకు తెలియచేయ్యలని అని మీడియాకు చెప్పారు... ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ వీడియో బయటకు వచ్చింది... ఇందులో శివాజీ చెప్పిన విషయాలు చూస్తుంటే, ప్రస్తుతం ఆ జాతీయ పార్టీ, ఇక్కడ ఉన్న కొన్ని పార్టీల నడవడికి అలాగే కనిపిస్తుంది... ఢిల్లీలో జరుగుతున్న కుట్రలు, ఆ కుట్రలకు, ఇక్కడ కొంత మంది వేస్తున్న డాన్స్ లు అలాగే ఉన్నాయి...

sivaji modi 22032018 2

శివాజీ ఆ పెన్ డ్రైవ్ వీడియోలో చెప్పిన విషయాలు... ఆపరేషన్ గరుడలో, రాష్ట్రాన్ని నాశనం చెయ్యటానికి, మూడు టార్గెట్ లు పెట్టుకుంది ఆ జాతీయ పార్టీ... ముందుగా ఇక్కడ ఉన్న అధికారి పార్టీ పై, కేసులు పెట్టటం, ఆర్ధికంగా ఇబ్బంది పెట్టటం, పార్టీలోనే గొడవలు పెట్టటం, ఆ పార్టీ నాయకుడుని మానిసికంగా కుంగిపోయేలా చెయ్యటం, చక్ర బంధం చేయడం , తద్వారా నిర్వీర్యం చేయడం, వీరి టార్గెట్..

sivaji modi 22032018 3

ఇక తరువాత ఒక కొత్త నాయకుడు... ఈ నాయకుడు, పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు... ఇక బయటకు రావటం ఉండదు.. స్థానిక ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడం, ఈయన పని... రాష్ట్రం మీద చాలా ప్రేమ ఉన్నట్టు, సమాజం పట్ల ఎంతో బాద్యత ఉన్నట్టు కనిపిస్తాడు.. ఈ నాయకుడు పని, స్పెషల్ స్టేటస్ ని నిర్వీర్యం చెయ్యటం... ఈ ఆపరేషన్ లో ప్రధాన పాత్ర ఇతనిదే...

ఇంకో ముఖ్యపార్టీ... ఇప్పటికే కేసులలో ఉన్న ఈయన, పూర్తిగా లొంగిపోయాడు... జాతీయ పార్టీతో వెళ్తే హాయిగా ఉంటుంది అనుకుంటున్నారు.. కాని, వీరి చరిత్ర ఇక సమాప్తం అవుతుంది... ఈ ముఖ్య పార్టీ నాయ‌కుడి మీద గుంటూరు, హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే రెక్కీ నిర్వ‌హించారు. ప‌క‌డ్బందీగా ప్రాణ‌హాని లేని దాడి చేస్తారు. రాయలసీమలోని ఓ ముఖ్యకుటుంబం.. దాడి చేయించిందని నమ్మించేందుకు చూస్తారు... దీంతో ఈ రాష్ట్రంలో అల‌జ‌డులు మొద‌ల‌వుతాయి... అలాగే ఈ నాయకుడుకి కేసుల్లో ఊరట లభిస్తుంది...

ఇలా వీరిద్దరినీ వాడుకుని, రాష్ట్రంలో మారణ హోమం చేస్తారు... బీహార్, ఒడిశా నుంచి వ‌చ్చి కొంద‌రు రాష్ట్రంలో అల్ల‌ర్లు మొద‌లు పెడ‌తారు... సెప్టెంబ‌రు 1న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తారు... కొత్త నాయకుడిని, ముఖ్య పార్టీ నాయకుడుని చివరకు వాడుకుని వదిలేస్తారు... ముఖ్య పార్టీ నాయకుడుని ఈ ఆపరేషన్ తరువాత జైలుకి పంపిస్తారు... తద్వారా, రాష్ట్రంలో అనిశ్చితి తీసుకువచ్చి, ఇక్కడ పార్టీలోని కొంత మందికి తీసుకుని, జాతీయ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రి ఎవరవుతారంటే.. ఆ పార్టీకి చెందిన ఓ తెలుగు వ్యక్తి అవుతారు.. ఇది శివాజీ చెప్పింది... ఆ జాతీయ పార్టీ వేసిన ప్లాన్ ఇది... మనం అందరం అలెర్ట్ గా లేకుండా, ఇది తిప్పి కొట్టక పొతే, మన రాష్ట్రాన్ని కబళించి వేస్తారు...

Advertisements

Latest Articles

Most Read