రాష్ట్రంలో మెగా, భారీ ప్రాజెక్టుల స్థాపనే లక్ష్యంగా.. విశాఖ హార్బర్‌ పార్కులో సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు శనివారం అట్టహాసంగా మొదలైంది.... ఈ సందర్భంగా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు భరోసా కల్పించే సమర్ధవంతమైన ప్రభుత్వం ఉందన్నారు. ఏపీలో పారదర్శక పారిశ్రామిక పాలసీ పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తోందన్నారు. సదస్సుల ద్వారా పెట్టుబడుల సాధనలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ అగ్రస్థానంలో ఉందని అశోక్‌ పేర్కొన్నారు. సీఐఐ ఉమ్మడి ఏపీలో ఆరుసార్లు పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తే నవ్యాంధ్రలో ఒక్క విశాఖలోనే మూడుసార్లు నిర్వహించడం దీనికి నిదర్శనమన్నారు.

cbn ashok 25022018 2

అలాగే చంద్రబాబు పై, ప్రశంసలు కురిపించారు... ‘సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సదస్సులో అశోక్‌గజపతిరాజు ప్రసంగిస్తూ.. చంద్రబాబు ‘మై ఫ్రెండ్‌.. మై లీడర్‌.. మై ఇన్‌స్పిరేషన్‌’ అని ప్రకటించారు. నవ్యాంధ్ర ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. చంద్రబాబు నిరంతరం శ్రమిస్తూ రాష్ట్రాన్ని విజయపథంలోకి తీసుకొచ్చారని తెలిపారు. దేశ ప్రగతి సింగిల్‌ డిజిట్‌లో వుంటే.. ఏపీ రెండెంకెల వృ ద్ధి నమోదు చేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని పారదర్శకంగా ఉంటాయన్నారు...

cbn ashok 25022018 3

ఆంధ్రప్రదేశ్‌లో విమానాల ఓవర్‌ హాలింగ్‌ సదుపాయం కల్పనకు ప్రయత్నిస్తున్నట్లు అశోక్‌ గజపతిరాజు వెల్లడించారు. భారతదేశానికి చెందిన విమానాలను ఓవర్‌ హాలింగ్‌ కోసం సింగపూర్‌, దుబాయ్‌, శ్రీలంక దేశాలకు పంపుతున్నామని, వీటికి ఏటా రూ.4,867 కోట్లు (75 కోట్ల డాలర్లు) చెల్లిస్తున్నామన్నారు. భోగాపురంలో నూతనంగా ఏర్పాటుచేసే గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయంలో మరమ్మతులు, ఓవర్‌ హాలింగ్‌ సదుపాయం కల్పించడానికి ప్రతిపాదించామని, దీనివల్ల ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి, అత ముఖ్యమైన సీఆర్డీయేకి, రాజధానిలో సొంత భవనాలను సమకూర్చుకుంటోంది.... ఇప్పటివరకు విజయవాడ నగరంలోని లెనిన్‌ సెంటరు, బందరురోడ్డులలో కార్యాలయాలను నిర్వహించుకుంటున్న సీఆర్డీయే రాజధానిలో సొంతంగా ప్రధాన కార్యాలయ భవనాన్ని నిర్మించుకుంటోంది. ఇందుకోసం ఆ సంస్థ రూ.34 కోట్లను వెచ్చిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అధికార యంత్రాంగాన్ని రాజధాని అమరావతిలోనే కేంద్రీకరించి పాలనను నడిపిస్తోంది. ఈ క్రమంలో సీఆర్డీయే కూడ సాధ్యమైనంత త్వరగా రాజధాని నుంచే విధులను నిర్వహించాలని నిర్ణయించింది.

lingayapalem 25022018 3

ఇందుకోసం తన ప్రధాన కార్యాలయాన్ని రాయపూడి - లింగాయపాలెం మధ్య సీడ్‌ యాక్సెస్‌రోడ్డు వెంబడే నాలుగెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకుంటుంది. సీఆర్డీయే ప్రధాన కార్యాలయ నిర్మాణం జరుగుతున్న ఈ ప్రదేశం భవిష్యత్తులో రాజధానిలోనే అతిపెద్ద జంక్షన్‌గా మారనుంది. సదరు జంక్షన్‌లో పూర్తి ఈశాన్యంగా ప్రధాన కార్యాలయం నిర్మితమవుతుంది. కార్యాలయానికి తూర్పువైపు ఎన్‌-11 రోడ్డు, ఉత్తరంగా సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు(ఇ-3) ఉంటాయి.

lingayapalem 25022018 2

సీఆర్డీయే ప్రధాన కార్యాలయాన్ని రూ.30 కోట్ల వ్యయంతో జీ+7 భవన సముదాయంగా నిర్మిస్తున్నారు. మొత్తం నాలుగెకరాల విస్తీర్ణంలో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణం వచ్చేలా దీనిని అద్భుతంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. పీఆర్‌ఈసీఏ కాంట్రాక్టు సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆరు మాసాల్లోగా భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో పాటే తుళ్లూరులో సీఆర్డీయే యూనిట్‌ కార్యాలయాన్ని నిర్మించనున్నారు.

తన కేసు విషయంలో, ప్రధానికి నోటీసులు వచ్చాయని చెప్పి గురువారం పొద్దున్నే హైదరాబాద్ చెక్కేసిన జగన్, నిన్న శుక్రవారం కోర్ట్ కి వెళ్లి సంతకం పెట్టి, ఈ రోజు శనివారం మళ్ళీ తన ముఖ్యమంత్రి కుర్చీ యాత్ర మొదలు పెట్టాడు.. ఈ రోజు 96వ రోజు అంటూ ప్రశాంత్ కిషోర్ టీం లెక్కలు చెప్తుంది...మరి అది శుక్రవారాలతో కలిపో, లేక కలపకుండానో తెలియదు కాని, ఈ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని హాజీస్‌పురం నుంచి మొదలై, టకారిపాలెం వద్ద ముగిసింది... అయితే, ఈ రోజు పాదయాత్రలో ఎంత పని జరిగిందో తెలుసా ? పాదయత్రకు వచ్చిన వారు బెంబేలెత్తిపోయారు...

jagan padaytra 24022018 2

పాదయాత్రకు జగన్ వెంట నడుచుకుంటూ వస్తున్న వారి, పై దునుగా చేసుకున్న కొందరు జేబు దొంగలు చేతివాటం చూపించారు... జగన్‌‌ను చూడటానికి వచ్చిన ఓ కాలేజ్ కరెస్పాండంట్ వద్ద రూ. 1 లక్ష, మరొకరి వద్ద రూ. 70వేల నగదు, ఓ మహిళ వద్ద చైన్‌‌ను జేబు దొంగలు అపహరించారు... జగన్ కడప నుంచి తెచ్చుకున్న ప్రైవేటు సెక్యూరిటీ వాళ్ళ జేబులో డబ్బులు కూడా కొత్తెసారు దొంగలు... బాధితులంతా స్థానిక పీఎస్‌‌లో ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది....

jagan padaytra 24022018 3

అయినా వర్షంలోకి గొడుగు లేకుండా వెళ్ళి మేము తడిచాం అని కంప్లెయింట్ చెయ్యకూడదు... అట్టానే జే గ్యాంగ్ గుంపులోకి జేబుల్లో లచ్చలు పెట్టుకొని వెళ్ళి ఇప్పుడు పొయ్యాయి అని లబో దిబో అనకూడదు... తెలిసి తప్పు చేస్తే ఎవడేమి చేస్తాడు... ఆ బ్యాచ్ సంగతి తెలిసి కూడా, కట్టలు కట్టలు డబ్బులు, మెడలో బంగారాలు దిగేసుకుని వెళ్తే, ఆ బ్యాచ్ వదిలిపెట్టుద్దా ? పోయింది ఎదో పోయింది, ఇక నుంచి అయినా జాగ్రత్త పడండి... అంతకు మించి చేసేది ఏమి లేదు...

జగన్ మోహన్ రెడ్డితో సావాసం చేసే ఏమవుతుందో, రాజశేఖర్ రెడ్డితో పని చేసిన ఐఏఎస్ ఆఫీసర్ లకి బాగా తెలుసు... అప్పటి వరకు టాప్ ఐఏఎస్ లుగా పేరు ఉన్నవారు కూడా, జగన్ సావాసంతో జైల్లో కూర్చున్నారు... నిన్న కాక మొన్న, ప్రధాని మోడీకి కూడా శాంపిల్ చూపించాడు మనోడు... ఇంకా జగన్ పార్టీతో కలవకుండానే, మనోడు చేసిన పనికి, ఇంటర్నేషనల్ కోర్ట్ మోడీకి నోటీసు ఇచ్చింది... ఇప్పటికైనా మనోడు ఎంత ప్రమాదికారో అర్ధమైందా ? కాని కొంత మంది ఉంటారు, జగన్ ను చూస్తే పాపం ఆనందం ఆపుకోలేరు... అదే వాళ్ళకు తిప్పలు తెచ్చి పెడుతుంది... ఈ రోజు కూడా అదే జరిగింది...

jagan 25022018 2

జగన్‌ పాదయాత్ర సందర్భంగా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని కస్తూర్బా స్కూల్‌ విద్యార్థులు వైఎస్సార్‌ అక్షరాకృతిలో ప్రదర్శన ఇవ్వడంపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. ప్రత్యేకాధికారి సుజాత, పీఈటీ వరలక్ష్మిల ను సస్పెండ్‌ చేశారు. ఆమేరకు కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జగన్‌ ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కస్తూర్బా స్కూల్‌ మీదుగా శనివారం వెళ్తుండగా బాలికలు వైఎస్సాఆర్‌ అక్షరాకృతిలో కుర్చొని స్వాగతం పలికారు.

jagan 25022018 3

నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థినులను తరగతులకు డుమ్మా కొట్టించి, ర్యాలీగా వస్తున్న రాజకీయ పార్టీల నేతలకు స్వాగతం పలికించారని ఎమ్మెల్యే బాబూరావు కలెక్టర్‌కు, సర్వశిక్షా అభియాన్‌ పీవోకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. దీంతో అసిస్టెంట్‌ జీసీడీవో హేమలత, సీఎంవో కొండారెడ్డి కస్తూర్బా స్కూల్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. తొలుత ఎస్‌ వో సుజాతను సంజాయిషీ కోరుతూ మెమో జారీ చేసిన అధికారులు, విచారణ అనంతరం ఆమెతోపాటు, పీఈటీపై చర్యలు తీసుకున్నారు.

Advertisements

Latest Articles

Most Read