పోలవరం విషయంలో వచ్చే సంవత్సర కాలం, ఎంతో కీలకమైనది... ఇప్పటికే కేంద్ర అనాలోచిత నిర్ణయం వల్ల, మూడు నెలలు అమూల్యమైన సమయం వేస్ట్ అయిపొయింది... చంద్రబాబు ఎలాగోలా సాధించి, నవయుగని తీసుకువచ్చి, కాఫర్ డ్యాంకి పర్మిషన్ లు తీసుకువచ్చి, పనులు ఆగకుండా చేసారు... అయితే, నిధులు విడుదలలో మాత్రం, కేంద్రం తీవ్ర జాప్యం చేస్తుంది... ఇప్పటికే మనం పెట్టిన ఖర్చు, 4 వేల కోట్లు పైన మనకు కేంద్రం ఇవ్వాల్సి ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైరం ఏర్పడే ప్రమాదం ఉంది..
కేంద్రం, రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అని, మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం, బీజేపీతో పోరాడటం చూస్తున్నాం.. మరో పక్క కేంద్రం, ఏ మాత్రం మన ఆందోళన పట్టించుకోవటం లేదు... దీంతో, ఏ నిమషం అయినా, చంద్రబాబు ఎన్డీయేలో నుంచి బయటకు వచ్చే వాతావరణం ఉంది... మిత్రపక్షంగా ఉంటేనే, అరాకోరా నిధులతో కేంద్రం విదిలిస్తుంది... అలాంటింది, చంద్రబాబు బయటకు వచ్చేస్తే, పరిస్థితి ఊహించుకోవచ్చు... పోలవరం జాతీయ ప్రాజెక్ట్... కేంద్రం డబ్బులు ఇవ్వాలి అది మన హక్కు... కాని కేంద్రం కావాలని లేట్ చేసిన కొద్దీ, ప్రాజెక్ట్ లేట్ అయిపోతూ ఉంటుంది.. ఎందుకుంటే ఇదే కీలక సమయం.. జూన్ లోపు సాధ్యమైనంత ఎక్కువ పని చెయ్యాలి... వర్షాలు పడటం మొదలైతే, పని సాగదు...
అందుకే, ఎటు పోయి, ఎటు వస్తుందో అనే ఉద్దేశంతో, చంద్రబాబు పోలవరం విషయంలో, మొత్తం కేంద్రం పై ఆధార పడకుండా, ప్రాజెక్ట్ పుర్తవటం కోసం, ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్(2018-19)లో సాగునీటి రంగానికి, దాదాపు రూ.24 వేల కోట్లు ఇవ్వనున్నారు. ఇందులో ఒక్క పోలవరం ప్రాజెక్టుకే అత్యధికంగా రూ.13 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి... అంటే, ఒక వేళ కేంద్రం సరైన సమయంలో స్పందించకపోయినా, రాష్ట్రం ముందు ఖర్చు చేసి, తరువాత మన హక్కుగా రావల్సిన డబ్బులు తీసుకుంటుంది... భూపరిహారం, ఎలాగూ 33 వేల కోట్లు కేంద్రమే ఇవ్వాలి... అందుకే ముందుగా ప్రాజెక్ట్ అయినా పూర్తి చెయ్యాలనే సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు... ఇప్పుడు కనుక ట్రాక్ తప్పితే, ఇక పోలవరం ఎప్పటికి అవుతుందో చెప్పలేము.. అందుకే, చంద్రబాబు కేంద్రంతో వైరం వచ్చినా, ముందు ప్రాజెక్ట్ ఆగిపోకుండా, ఇబ్బంది లేకుండా ఉండటానికి, ముందు చూపుతో ఆలోచించి, రాష్ట్ర బడ్జెట్ లోనే, పోలవరం ప్రాజెక్ట్ కు 13 వేల కోట్లు కేటాయిస్తున్నారు...