కేంద్రం మరోసారి ఆంధ్రప్రదేశ్ పై ఎదో చేసేస్తున్నాం అనే హడావిడి వాతావరణం క్రియేట్ చెయ్యటానికి ప్రయత్నిస్తుంది... మార్చ్ 5 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో, తెలుగుదేశం ఎంపీలు ఆందోళన చేస్తామనటం, మరో పక్క వివిధ సంఘాలు ఆందోళనలు తీవ్ర తరం చెయ్యటంతో, కేంద్రంలో కొద్దిగా చలనం వచ్చింది... ఇది సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా తీసుకు వెళ్తాయో లేక, ఎదో చేసాం అని చెప్పటానికో తెలియదు కాని, ఆంధ్రప్రదేశ్ పై ఎమర్జెన్సీ మీటింగ్ అంటూ ఢిల్లీలో మీడియాకు లీకులు ఇస్తున్నారు...
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో టీడీపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో టీడీపీ డిమాండ్ల పై సుదీర్ఘ చర్చించినట్లు తెలుస్తోంది. రైల్వే జోన్‌తో పాటు, పలు డిమాండ్లను పరిష్కరించాలని, అమిత్ షాను టీడీపీ ప్రతినిధులు కోరారు. సమావేశంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఆందోళనను కూడా రామ్మోహన్‌నాయుడు వెంకయ్యకు, అమిత్ షా కు వివరించారు.
సిఐఐ సమ్మిట్ లో పాల్గునటానికి, వైజాగ్ వచ్చిన వెంకయ్యతో, చంద్రబాబు చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి... ఏదైనా సరే, సమస్యలు పరిష్కరిస్తేనే, కేంద్రంతో సఖ్యత ఉంటుంది అని, లేకపోతే ఆందోళన కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.. వెంకయ్య కూడా, కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచింది కాదని, నేను చొరవ తీసుకుని, సాధ్యమైనంత వరకు, సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తాను అని చెప్పారు.. దానికి కొనసాగింపుగా, వెంకయ్య ఈ సమావేశం పెట్టారు... వెంకయ్య గారికి మన రాష్ట్రం కోసం, ఎదో చెయ్యాలి అనే తపన ఉన్నా, అమిత్ షా, మోడీ ఇష్టంతోనే ఏదైనా జరుగుతంది కదా... మరి ఈసారి ఏమి చేస్తారో ?