స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి విన్నవించుకున్నారు... 17 పేజీల రిపోర్ట్ ఇచ్చారు... కొత్తగా, ఆర్ధిక లోటుతో ఏర్పడిన రాష్ట్రానికి, అన్ని విధాలుగా ఆదుకోమన్నారు.. ప్రతి కేంద్ర మంత్రి దగ్గరకి వెళ్లారు... నాలుగు సంవత్సరాల నుంచి 42 సార్లు ఢిల్లీ వెళ్లారు... సహనంగా, ఓర్పుగా సాధిస్తాను... నేను ఆశావాదిని... కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనిశ్చితి మంచిది కాదు, అంటూ కేంద్రంతో సఖ్యతగా సాధించుకుందాం అని ఓర్పుగా ఎదురు చూసారు... అయినా, నాలుగేళ్ళ నుంచి అదే పాట... మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం అంటూ, పాడిందే పాట.. కాని, కేటాయింపులు మాత్రం, విదిలింపులే... ఇవాళ బడ్జెట్ తో, విషయం పూర్తిగా అర్ధమైపోయింది...

namaskaram 01022018 2

రైల్వే జోన్ ప్రస్తావన లేదు... కాని పక్కన ఉన్న బెంగుళూరుకి మాత్రం 17 వేల కోట్లు ఇస్తారు... ఆర్ధిక లోటుకి ఏమి ఇవ్వరు.. కొత్త రాష్ట్రం అయ్యా, ఆదుకోండి అంటే, అందిరికంటే దారుణంగా చూస్తారు... రాష్ట్ర ప్రజల మూడ్ చంద్రబాబుకి అర్ధమైంది... ఇక సమరానికి సిద్ధమవుతున్నారు... అధికారులతో బడ్జెట్ పై మాట్లాడారు... రాష్ట్రానికి ఏమి వచ్చాయి, మనం ఏమి అడిగాం అనేది విశ్లేషిస్తున్నారు... ఎంపీలతో మాట్లాడారు... ఢిల్లీ నుంచి రండి, అంటూ ఆదివారం మీటింగ్ ఫిక్స్ చేసారు...

namaskaram 01022018 3

కలిసి చర్చిద్దాం... ప్రజల మూడ్ కి తగ్గట్టు మనం నడుచుకోవాల్సిందే... అవసరమైతే మిత్ర పక్షంగా ఉంటూ, పార్లిమెంట్ లో బీజేపీ వైఖరి ఎండగడదాం అని మాట్లాడుకున్నారు... ఇప్పుడు ఈ విషయం చంద్రబాబుని దాటి పోయింది... ఆదివారం పెట్టే మీటింగ్ లో, చంద్రబాబు బీజేపీ కి చివరి నమస్కారం పెట్టి, ఇక పోరాడాలని ప్రజలు కోరుకుంటున్నారు... చంద్రబాబు లీడ్ తీసుకోకపోతే, ప్రజలే ముందుండి, బీజేపీ మెడలు వంచుతారు...కాంగ్రెస్ కు సమాధి కట్టిన ఆంధ్రా బిడ్డలు, మరో గుంట తవ్వి
2019 ఎన్నికల్లో కేంద్రంలో ఉన్న బీజేపీకి సమాధి కట్టటానికి రెడీ అయ్యారు....

అనుకున్నదే అయ్యింది... కాంగ్రెస్ డైరెక్ట్ గా గొంతు కొస్తే, బీజేపీ తడి గుడ్డతో నొప్పి తెలియకుండా గొంతు కోస్తుంది... చివరి బడ్జెట్ లో అయినా, ఎన్నికలు వస్తాయి అంటున్నారు కాబట్టి, మన కొత్త రాష్ట్రము, ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి, సహాయం చేస్తారేమో అని ప్రజలు అందరు ఆశక్తిగా ఎదురు చూసారు... ఎప్పటిలాగే, మన మీద ఢిల్లీ పాలకుల చిన్న చూపు కొనసాగింది... విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ వచ్చేసినట్టే అని రాష్ట్ర బీజేపీ నేతలు ఊదరగొట్టారు... చివరకు చిప్ప ఇచ్చారు... ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకకు, బెంగళూరు మెట్రోకు 17వేల కోట్లు ఇచ్చారు...ముంబై సబర్బన్ రైల్వేకు 17వేల కోట్లు కేటాయించడం గమనార్హం....

singapore 05012018 2

అమరావతి రాజధాని నగర నిర్మాణానికి సొమ్ముల ప్రస్తావన లేదు ? లోటు బడ్జెట్ లోటు లెక్క లేదు ? టీడీపీ కోరుతున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు అంగీకారం లేదు దా? శంకుస్థాపన చేసిన విద్యాసంస్థలకు నిధుల లేవు ? పోలవరం పై ఇప్పటిదాకా 7780 కోట్లు రావలసి ఉంది. అయితే కేంద్రం నుంచి 4300 కోట్లు వరకే అందాయి. మిగిలిన నిధుల ప్రస్తావన లేదు.. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, ప్యాకేజీకి చట్టబద్ధత లాంటి ఊసు లేదు... చివరకు ఒక్క భారీ ప్రాజెక్ట్ పై కూడా నవ్యాంధ్ర పై మోడీ కరుణ లేదు...

singapore 05012018 3

మొత్తంగా నవ్యాంధ్ర పై కేంద్రం చిన్న చూపు కొనసాగిస్తూనే ఉంది... మునుపటి మాదిరిగానే కఠినంగా ఉంది ? ఈ బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం సంతృప్తికర స్థాయిలో కాదు, అసలు ప్రస్తావనే లేదు... మన రాష్ట్రం అసలు దేశంలో ఉందో లేదో కూడా కేంద్రమే చెప్పాలి... ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మన రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా, మీరు చెయ్యల్సింది మీరు చెయ్యండి... ప్రతి ఆంధ్రుడు మీ వెనుక ఉంటాం... ఆంధ్రా వాడి దెబ్బ మాములుగా ఉండదు... కొట్టినట్టు కూడా తెలియదు... చూసుకుంటే, చివరకు ఏమి మిగలదు.... 125 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ బ్రతుకు, మా రాష్ట్రంలో ఎలా ఉందో చూసి, నేర్చుకోవాల్సింది... ఢిల్లీ పెద్దలారా, గెట్ రెడీ...

ఇదే ఆఖరీ బడ్జెట్, మరి ఇప్పుడయినా నవ్యాంధ్ర ఆశలు ఫలిస్తాయా? విభజన హామీలు అమలుచేస్తారా? ఉత్తరాంధ్ర ప్రజల స్వప్నమైన రైల్వేజోన్ సాకారమవుతుందా? రాజధాని నగర నిర్మాణానికి సొమ్ముల సంగతేమిటి? బడ్జెట్ లోటు లెక్క ఈసారయినా తేల్చి, నిధుల విడుదల ఉంటుందా? టీడీపీ కోరుతున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు అంగీకరిస్తుందా? శంకుస్థాపన చేసిన విద్యాసంస్థలకు నిధుల మాటేమిటి? మొత్తంగా నవ్యాంధ్ర పై కేంద్రం కరుణిస్తుందా? మునుపటి మాదిరిగానే కఠినంగా ఉంటుందా? ఈసారి తేడా వస్తే చంద్రబాబు, మోడీకి రాంరాం చెప్పేస్తారా ? ఇదీ.. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి, చివరి బడ్జెటిపై ఆంధ్రప్రదేశ్ ప్రజల అంతరంగం!

cbn modi 01022018 2

బడ్జెట్ సమావేశాల పై ఏపీ ప్రజలు, ప్రభుత్వం వేయి ఆశలు పెట్టుకుంది. ప్రధానంగా విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులు, గ్రాంట్లు, రైల్వే జోన్ వంటి కీలక అంశాలపై కేంద్ర స్పందన కోసం రాష్ట్ర ప్రజలతో, చంద్రబాబు కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక హోదా హామీని విస్మ రించి, దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం ఆ హామీ కూడా నిలబెట్టుకోలేదు అని ప్రజలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. ఆ అపవాదుకు బీజేపీ తెరదించుతుందా? లేక నిధుల సమస్యలతో మళ్లీ దాటవేత ధోరణి ప్రదర్శిస్తుందా అన్న ప్రశ్నలకు నేటి బడ్జెట్ సమాధానం చెప్పనుంది. ఏపీ జీవ నాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలపై నెలకొన్న వివాదానికి తెరదించాల్సి ఉంది. ఆ ప్రాజెక్టు పై ఇప్పటిదాకా 7780కోట్లు రావలసి ఉంది. అయితే కేంద్రం నుంచి 4300 కోట్లు వరకే అందాయి. మిగిలిన నిధుల కోసం ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ వైపు ఆశగా ఎదురుచూస్తోంది.

cbn modi 01022018 3

ఇది ఈ బడ్జెట్లో కాకపోతే ఇక అసాధ్యమే. 13వ షెడ్యూల్లో ఉన్న 11 సంస్థల్లో ఇప్పటివరకూ వచ్చినవి 9 మాత్రమే, వాటికి ఇప్పటివరకూ ఇచ్చింది కేవలం 400 కోట్లు మాత్రమే. మిగిలినవి పూర్తి కావాలంటే పూర్తి స్థాయి నిధులివ్వాలి ఉంది.. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాల్సి ఉంది.. 16 వేల కోట్ల రెవిన్యూలోటు భర్తీ కింద ఇప్పటివరకూ 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది... విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్రం ఇచ్చిన నిధులు వాటి ప్రహరీ గోడలకే సరిపోవడం లేదు. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ ఎక్కువ నిధులు ఖర్చుపెడుతుండటం గమనార్హం. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం సంతృప్తికర స్థాయిలో నిధులు, ప్రాజెక్టులు కేటాయించకపోతే.. ఇన్నాళ్ళు ఓర్పుగా, చూసిన చంద్రబాబు, ఇక బీజేపీతో యవ్వారం తేల్చేసే అవకాసం ఉంది...

రాజధాని అమరావతి ప్రాంతంలో, కీలకమైన విజయవాడను స్మార్ట్ గా తీర్చిదిద్దటానికి అనేక నూతన అధునాతన ప్రాజెక్టులను అమలు చేయటానికి, నగరపాలక సంస్థ ప్రయత్నాలు చేస్తుంది... ఇందులో భాగంగా దేశంలోనే అతి పెద్ద స్మార్ట్ స్ట్రీట్ గా, విజయవాడ బందర్ రోడ్డును రెడీ చేసారు... గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో, బెంగళూరుకు చెందిన సిస్కో సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు... మొత్తం ఈప్రాజెక్టు వ్యయం రూ. 7.91 కోట్లుగా నిర్ధారించారు. దీనిలో సిస్కో రూ. 3.81 కోట్ల భరిస్తోంది. దీనికి సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. మిగిలిన రూ.4.10 కోట్ల విజయవాడ నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం భరించింది... పీవీపీ మాల్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.

vijaawada golden mile 01022018 2

ఈ ప్రాజెక్ట్ లో భాగంగా, కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి, బందర్ రోడ్డు దాకా, రోడ్డు మొత్తం స్మార్ట్ గా తయారు చేసారు... గోల్డెన్ మైల్ ప్రాజెక్టులో భాగంగా బందరు రోడ్డులో పూర్తిస్థాయిలో వైఫై అందుబాటులోకి తెస్తారు. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవచ్చు. స్మారు ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత భాగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ట్రాఫిక్ జాం అయినా వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందుతుంది. దీంతో ట్రాఫిక్ మళ్లింపు చేపడతారు. ప్రస్తుతం యూటర్స్ల తీరు మార్చారు. గోల్డెన్ మైల్ ప్రాజెక్టు కింద సిసి కెమెరాలు, సెన్సార్‌లు ఈ రోడ్డు అంతా ఏర్పాటు చేయటం ద్వారా నగర ప్రజలు నగరంలో ట్రాఫిక్, వాతావరణ సమాచారం, హ్యుమిడిటి, ఉష్ణోగ్రత, లొకేషన్ వంటి సమాచారం ప్రజలు తెలుసుకోగలరు. నగరంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వీడియో సర్వైవలెన్స్ ఆపరేషన్ ద్వారా సమాచారం తెలుసుకోవటమే కాకుండా ఆన్‌లైన్ పేమెంట్స్, ఆన్‌లైన్ ట్యాక్సెస్, థియేటర్స్ సమాచారం తెలుసకోవచ్చు. అత్యవసర పరిస్థితులలో అధికార యంత్రాంగాన్ని సంప్రదించే సదుపాయం కూడా ఇందులో ఉంటుండి... అలాగే 8 బస్ స్టాండ్ లలో, led స్క్రీన్స్ ఏర్పాటు సెహ్సారు...

vijaawada golden mile 01022018 3

అలాగే సెన్సార్లతో పని చేసే ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేసారు..వాహనం వెళుతుంటే.. వెలుగును తగ్గించుకుంటాయి... రోడ్డు నిర్మానుష్యంగా ఉంటే ఆరిపోతాయి... చీకటిలో మనుషులు వస్తుంటే వాటంతటవే వెలుగుతాయి... ఎంజీ రోడ్డులో కియోస్క్లు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా బస్సు, రైల్వే, సినిమా టిక్కెటు నమోదు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇవి ఇంకా ఏర్పాటు చేయలేదు.. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరానికి సంబంధించిన వివరాలతో సిటీ పోర్టల్ (ఇదివరకు ఉన్న వెబ్సైటు, ఇన్ఫర్మేషన్ అంతా కొత్తగా అప్డేట్ చేసారు https://www.ourvmc.org/#/home), యాప్ (https://play.google.com/store/apps/details?id=com.smartvijayawada) ఏర్పాటు చేసారు... ఇందులో నుంచి అన్ని రకాల ప్రభుత్వ సేవలు చేసుకోవచ్చు... ఈ వీడియోలో పూర్తి సమాచారం చూడండి...

Advertisements

Latest Articles

Most Read