కేంద్ర బడ్జెట్‌ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది... అనంతరం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకట్రెండు రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటాని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన సమస్యలకు బడ్జెట్‌లో పరిష్కరిస్తుందని ఆశించాం కానీ నిరాశే కలిగించిందని మంత్రి సోమిరెడ్డి అన్నారు... చంద్రబాబుతో అత్యవసర మీటింగ్ తరువాత, ఈ వ్యాఖ్యలు చెయ్యటంతో, ఎదో జరగబోతుంది అనే సంకేతం వచ్చింది...

somireddy 01022018

సోమిరెడ్డి మాట్లాడుతూ, అమరావతికి ఎలాంటి నిధులివ్వలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ పార్టీ భేటీలోనూ ఈ విషయాన్ని గట్టిగానే చర్చిస్తామన్నారు. ముంబై, బెంగళూరుపై ఉన్న ప్రేమ అమరావతిపై చూపాలని కేంద్రానికి ఆయన సూచించారు. అలాగే రైల్వే జోన్ అంశం అసలు పట్టించుకోకపోవటం దారుణం అని అన్నారు... ప్రజల ఆకాంక్షలు నెరవేరకుంటే అవసరమైన నిర్ణయం తీసకుంటామని మంత్రి స్పష్టం చేశారు. సీఎం దగ్గర నిశితంగా అన్ని విషయాలపై చర్చించామని త్వరలో జరగనున్న ప్రత్యేక భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్లమెంటరీ భేటీలో చర్చించిన అనంతరం మరోసారి కేంద్ర మంత్రులతో మరోసారి చర్చించాలని సమావేశంలో సీఎం నిర్ణయించారని సోమిరెడ్డి స్పష్టం చేశారు...

somireddy 01022018

ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేశామని, చాలా మేరకు నిధులు వస్తాయని ఆశించాం..కానీ.. బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవని సోమిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు... అలాగే జగన్ గురించి మాట్లాడుతూ, వైసీపీకి దమ్ముంటే ఏపీకి న్యాయం చేయట్లేదని కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలన్నారు. మిత్రపక్షంగా మేం కేంద్రప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి వైసీపీ ఎప్పుడైనా తెచ్చిందా? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. రాజకీయం, ముఖ్యమంత్రి సీటు తప్ప ప్రతిపక్ష నేత జగన్‌కు మరేమీ తెలియదని సోమిరెడ్డి వ్యాఖ్యలు చేశారు...

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగింది అని రాష్ట్రం మొత్తం, పార్టీలకు అతీతంగా స్పందిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయుకుడు మాత్రం ఇప్పటి వరకు సుయ్యి సయ్యి లేదు... ఎలాగూ ప్రజల్లోనే ఉన్నారు కద సార్, స్పందించండి అని విలేకరులు అడిగితే, నేను ఇవాళ ఎర్లీ గా పాదయత్ర ఆపెయ్యాలి, చాలా ఇంపార్టెంట్ పని ఉంది, రేపు కాని, తరువాత కాని స్పందిస్తా అంటూ, జగన్ విలేకరులకి చెప్పి, హడావిడి హడావిడిగా వెళ్లిపోయారు... అయుదు గంటలకే పాదయాత ఆపెయ్యటంతో, విలేకరులు ఎదో జరుగుతుంది అని, మాంచి న్యూస్ దొరికింది అని రెడీ అయ్యారు....

jagan budget 01022018 2

నెల్లూరు నుంచి, హైదరాబాద్ లో ఉన్న స్టూడియోలకి సమాచారం అందించారు... జగన్ పాదయాత్ర ఎర్లీగా ఆపేశారు, బడ్జెట్ పై ఏమన్నా అసంతృప్తి వ్యక్తం చేస్తారేమో, ఎంపీలని రాజీనామా చేయ్యమంటారేమో , రెడీగా ఉండండి అంటూ, స్టూడియోల్లో వారికి చెప్పారు, నెల్లూరులో ఉన్న విలేఖరులు... ఈ లోపు, జప్ జప్ మంటూ హడావడిగా, జగన్ కాన్వాయ్ స్పీడ్ గా బయలుదేరే సరికి విలేకరులు అవాక్కయ్యారు... జగన్ ఎక్కడికి వెళ్తున్నారు, పాదయాత్ర ఎందుకు ఎర్లీగా ఆపేసారు అంటూ, అక్కడ ఆరా తీసారు విలేకరులు..

jagan budget 01022018 3

అటు వైపు నుంచి వచ్చిన సమాధానం విని, ఛీ జీవితం అనుకుని, బ్యాగులు సద్దుకుని ఇంటికి పోయారు... బడ్జెట్ హడావిడిలో పడి రేపు శుక్రవారం అనే విషయం మర్చిపోయారు విలేఖరులు... రేపు నాంపల్లి కోర్ట్ కి హాజారు కావలి కాబట్టి, జగన్ ఇవాళ ఎర్లీగా పాదయత్ర ఆపేసి, కోర్ట్ కి వెళ్ళటానికి హైదరాబాద్ బయలు దేరాడు... కాని, రాష్ట్రం మొత్తం కేంద్రం వైఖరి పై మండి పడుతుంటే, మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీని దుమ్మెత్తి పోస్తుంటే, జగన్ మాత్రం, మోడీని, బడ్జెట్ ని విమర్శించే సాహసం చెయ్యలేదు.. ఎందుకో అందరికీ తెలిసిందే...

కవ్వింపో.... కుళ్ళుబోతు బుద్దో... అభద్రతో... ఆంధ్రుడు అంటే చులకనో.... ఏమైనా గాని అడుగడుగునా నయవంచన చేసారు... అడ్డంకులు సృష్టించారు... రైల్వేజోన్ లేదు... ఆర్థిక లోటు పూడ్చలేదు.. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు లేవు...హోదా లేదు... పోనీ ప్యాకేజీ అనుకుంటే చట్టబద్దం చేయలేదు... రాజధాని నిర్మాణ హామీ ఏమైందో తెలియదు... కనకదుర్గ ఫ్లై ఓవర్ ఊసులేదు... విభజనహామీలు... తిరుపతి హామీలు అన్నీ హుళక్కే! బాబు గారూ! మీసహనం ..సంయమనం.. అంతా వృధా!ఇక ఉపేక్షిస్తే ప్రజలకు, పార్టీకి, మీకు తీవ్ర నష్టం జరుగుతుంది.

cbn mood fo state 01022018 2

రాష్ట్రం కోలుకోవాలంటే ఎన్ని ఏళ్ళు పడుతుందో తెలియదు... తిట్లు, శాపనార్దాలు, అవమానాలు ఇన్ని సంవత్సరాలుగా ఎదుర్కొని, దగా పడిన తమ్ముడిలా, తల ఒంచుకుని అభివృద్ధి వైపు పయనిస్తున్న ఆంధ్రులను, కేంద్రం, బీజేపీ పెద్దల వైఖరి కృంగదీస్తుంది...ఇక చాలు.. మీరు గళం విప్పాల్సిందే! ప్రజలంతా మీవెంటే ఉంటారు.... కేంద్ర పెద్దలంటే రగిలిపోతున్నారు.... దేశం మొత్తం తెలిసేలా తిరగబడాలి... మంత్రివర్గం నుండి బయటకు రావాలి.... తెగదెంపులు అనివార్యం.... కేంద్రం పెద్దలతో పోరాటం షురూ చేయండి..... మీకు మాత్రమే సాధ్యమైన ప్రతిపక్షాల ఐక్యత సాధించండి.... దేశానికి కాంగ్రెస్, బీజేపీ యేతర ప్రత్యమ్నాయాన్ని అందించండి....

cbn mood fo state 01022018 3

సహనానికి ...మంచికి మారుపేరైన తెలుగు బిడ్డలు..మీరు ఏమి చెప్పినా ఓపిగ్గా విన్నారు...వింటున్నారు...వింటారు....తలలేని మొండెం ...నిలువనీడ లేని రాజ్యం... అరకొర ఆదాయం పంపకం లో వచ్చినా ....హమారా పాస్ బాబూ హై !అనుకుని మీకు మద్దతు గా నిలిచారు.... మీ కష్టం... మీ తపన పట్ల పూర్తి స్దాయి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు... కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ ... మీ నిస్సహాయత చూసి కళ్ళు చెమర్చుతున్నాయి.... ఇన్నాళ్ళు వేచి ఉన్న తరువాత కూడా మొండి చేయి? రగిలిపోతున్నారు... తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు.... దొంగలు... దోపిడీ దారులు నీతి కబుర్లు చెబితే వినే దౌర్భాగ్యం కలుగుతుంది... రాష్ట్రం కోసం ఒక్క గంట కూడా కష్టపడని వాళ్ళు చెలరేగిపోతున్నారు.... ఇంకా చాలు... నమస్కారం పెట్టండి బాబు గారు! మీ వెంటే జనమంతా!

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైనశైలిలో కామెంట్స్ చేశారు. బడ్జెట్‌పై మీ స్పందనేంటని ఢిల్లీలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. బడ్జెట్టూ లేదూ వంకాయ లేదు.. పోవయ్యా ఫో.. అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రైల్వే జోన్‌పై మీ కామెంట్ ఏంటని ప్రశ్నించగా.. రైలు లేదు, జోన్ లేదు అంటూ, తాడిపత్రికి విమాన జోన్ మాత్రం వస్తుందని ఆయన వ్యంగ్యంగా ఉన్నారు.అభివృద్ధిలో భాగంగా తాడిపత్రిలో విమాన జోన్ ఏర్పాటు చేసి అన్ని విమానాలు దిగేలా చేస్తారంటూ సెటైర్లు వేశారు.

diwarkar 010222018 2

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి మూడు నామాలు పెట్టినట్టుందని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిని మరిచి.. కేంద్రం చుట్టూ తిరిగినా ప్రయోజన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు... టీడీపీ మాత్రమే కాదని దేశంలోని అన్ని పార్టీలకు ఈ బడ్జెట్‌పై నిరాశ, నిస్పృహ ఉందన్నారు. ఏపీకి ఎటువంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదని, అతి తక్కువగా నిధులు ఇచ్చి సాయం చేశామన్నామంటే ఎలా అని ప్రశ్నించారు.

diwarkar 010222018 3

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి చాలా సహనం ఉందని ఆయన ఎంతో ఓపికగా ఉన్నారని వ్యాఖ్యానించారు. చివరకు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీలపై, తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీలపై కూడా కేంద్ర బడ్జెట్‌లో న్యాయం చేయలేదని జేసీ దివాకర్ రెడ్డి వాపోయారు. బడ్జెట్‌ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపర్చేలా ఉందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. కాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఏపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం బడ్జెట్‌‌లో రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగలేదని చెబుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read