2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు అని నిర్ణయించే బీజేపీ నాయకుడు సోము వీర్రాజు, కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన మూడు రోజులుకి మీడియా ముందుకు వచ్చారు... వచ్చి, ఏదేఏదో మాట్లాడుతున్నాడు... గుజరాత్ లో బీజేపీ గెలుస్తుంది అని తెలుస్తున్న టైంలోనే, ప్రెస్ మీట్ పెట్టి, నేను గుజరాత్ లో బీజేపీని గెలిపించా అన్నంత హడావిడి చేసారు... అలాగే కేంద్ర బడ్జెట్ పై కూడా వెంటనే స్పందిస్తారు అని అందరూ అనుకున్నారు... ఒక పక్క తెలుగుదేశం విమర్శలు చేస్తున్నా, వీర్రాజు మాత్రం, బయటకు రాలేదు... ఎట్టకేలకు ఇవాళ వచ్చారు...

somu 03022018 2

అమిత్ షా ఢిల్లీలో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ పక్కగా జరుగుతుంది అని, నవయుగ వచ్చిన తరువాత పనులు స్పీడ్ అందుకుంటాయని, నవయుగని మేమే తెచ్చాం అని చెప్తుంటే, ఇక్కడ వీర్రాజు మాత్రం, పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల్లో ఎంతమేర పనులు జరిగాయని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పజెప్పేస్తామని ప్రకటించిన చంద్రబాబు... ఇప్పుడు మరో కంపెనీని తెరపైకి ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత కూడా బీజేపీదే అని చెప్పారు.

somu 03022018 3

బడ్జెట్ పై అసహనం ఉంటే అడగాలి కాని, విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మిత్రపక్షంగా ఉన్న తమపై విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు. ఇలా అంటూనే, టీడీపీ ఎంపీలు టీజీ వెంకటేశ్, రాయపాటి సాంబశివరావుల పై పర్సనల్ గా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు సోము వీర్రాజు.. ఒక పక్క, అమిత్ షా, ఢిల్లీ నుంచి కంట్రోల్ కంట్రోల్ అంటుంటే, సోము వీర్రాజు మాత్రం, వీర ప్రతాపం చూపిస్తున్నారు... కేంద్ర బడ్జెట్ వల్ల, రాష్ట్రం ఎంతో బాగుపడిపోతుంది అని చెప్తున్నారు...

కేంద్ర బడ్జెట్ గురువారం ప్రవేశపెట్టారు... రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని, ప్రజలంతా గోల చేస్తున్నారు... ఇదే విషయం పై అధికారంలో ఉన్న చంద్రబాబు, కేంద్రంతో మిత్రులుగా ఉన్న తెలుగుదేశం, ప్రజల గొంతుని వినిపిస్తూ, కేంద్రం పై తెలుగుదేశం పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మల్యేలు బహిరంగంగా బీజేపీని విమర్శిస్తూ, ఎలా కేంద్రం పై ఒత్తిడి తేవాలో చర్చిస్తున్నారు... అధికారంలో ఉండి, మిత్రపక్షంగా ఉండి తెలుగుదేశం పార్టీ ఇంత చేస్తుంటే, ప్రతిపక్షంలో ఉంటూ, పాదయాత్ర అంటూ ప్రజల మధ్య తిరుగుతూ, జగన్ ఒక్క మాట మాట్లాడలేదు...

jagan 03022018 2

గురువారం సాయంత్రం, విలేకరులు బడ్జెట్ పై స్పందన అడిగితే, నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ, హైదరాబాద్ పారిపోయాడు... శుక్రవారం అయ్యగారి షడ్యుల్ తెలిసిందే... సొంత ఇంట్లో మనుషులకి కూడా, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు... సరే ఆయాన ఇబ్బందులు తెలుసు, శనివారం బడ్జెట్ పై, కేంద్రం పై విరుచుకుపడతారేమో అని, ప్రజల ఆకాంక్ష ఒక ప్రతిపక్ష నేతగా స్పందిస్తారు అని, అందరూ ఆశగా ఎదురు చూసారు... చివరకు స్పందిచారు... మీరు నమ్మండి, నమ్మక పొండి... ఒక్క మాట అంటే, ఒక్క మాట, కేంద్రం పై విమర్శ చెయ్యలేదు...

jagan 03022018 3

విమర్శ చెయ్యలేదు కదా, చంద్రబాబు నువ్వెందుకు, మోడీని తిడుతున్నావ్ అంటూ, అడుగుతున్నాడు జగన్... నాలుగేళ్ళ నుంచి ఎందుకు మోడీని తిట్టలేదు... ఇవాళే ఎందుకు తిడుతున్నావ్ అంటూ, జగన్ విరుచుకు పడుతున్నారు... మోడీని మోసం చేసాడంటావా అంటూ, చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాడు జగన్... ప్రజల ఆకాంక్షను చంద్రబాబు వినిపిస్తున్నారు.. అది తప్పా ? మోడీ మోసం చేశాడని, ప్రతి ఒక్క ఆంధ్రుడు ఈ నిమషం నమ్ముతున్నారు... ప్రజలు ఎలా మోడీని ఇన్నాళ్ళు నమ్మి ప్రధాన మంత్రిని చేసారో, చంద్రబాబు అలాగే నమ్మారు.. పోలవరం ఆటంకం ఏర్పడకుండా, కేంద్రంతో సఖ్యతతో ఉన్నారు... ఇవాళ ప్రజలు తిరగబడమంటే తిరగబడుతున్నారు... ఇవాళ కాదు, గత సంవత్సర కాలం నుంచి, చంద్రబాబు కేంద్రం పై అసంతృప్తితో ఉన్నారు... అందుకే మోడీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు... అందుకే రాజ్యసభలో తలాక్ బిల్ పై ఎదురు తిరిగారు.. అందుకే మూడు నెలల క్రిందట అసెంబ్లీ సాక్షిగా, మీరు మమ్మల్ని ఆదుకోకపోతే దండం పెట్టేస్తా అన్నారు... చంద్రబాబు సంగతి పక్కన పెట్టు, అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఆయన స్పందించలేదు అనుకుందాం.. నీకేమైంది ? ఇన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉండి, ఏ నాడు, మోడీని ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు ? సమయం వచ్చినప్పుడు, చంద్రబాబు కనీసం స్పందిస్తున్నాడు... నువ్వు ఏమి చేసావ్ ? ఇప్పటికీ బడ్జెట్ పై స్పందించటానికి ఎందుకు భయపడుతున్నావ్ ?

ఒంటెద్దు పోకడలతో సీనియర్ నేతలను చులకను చేస్తూ, అందరినీ దూరం చేసుకుంటున్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి మరో ఝలఖ్ ఇవ్వటానికి, వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా రెడీ అయ్యారు... ప్రస్తుతానికి పార్టీ మారకపోయినా, జగన్ కు ఒక జర్క్ ఇవ్వటానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి, ప్రత్యేకంగా మాట్లాడి, సంచలనానికి తెర లేపారు... సంచలనం ఎందుకు అంటే, వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా, ఇప్పటి వరకు జగన్ కు నమ్మిన బంటుగా, చెప్పింది చేస్తూ, పార్టీ నిర్మాణనికి కృషి చేస్తూ వచ్చారు... అయితే, ఈ మధ్య జగన్ వైఖరి నచ్చక, అసంతృప్తిగా ఉంటున్నారు...

mustafa 03022018 2

ఈ రోజు గుంటూరులో ఒమెగా ఆసుపత్రి ప్రారంభోత్సవం నిమిత్తం అక్కడికి వెళ్లిన చంద్రబాబును, హెలిప్యాడ్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కలుసుకున్నారు... ఈ సందర్భంగా ముస్తఫాతో చంద్రబాబు భేటీ అయ్యారు. అంతకుముందు, టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలిసి ఆయన కారులో ముస్తఫా అక్కడికి వెళ్లడం చర్చనీయాంశమైంది. కాగా, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మద్దలి గిరిధరరావుపై ముస్తఫా విజయం సాధించారు.

mustafa 03022018 3

తాజాగా, రాయపాటి కారులో వెళ్లి చంద్రబాబును ముస్తఫా కలవడంతో వైసీపీని ఆయన వీడనున్నారనే వార్తలు బలపడుతున్నాయి. ఈ విషయమై ముస్తఫా స్పందిస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసమే చంద్రబాబును కలవడం జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు ఇచ్చేందుకు ఆయన సుముఖత చూపారని అన్నారు. తన నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశానే తప్ప, ఎట్టిపరిస్థితుల్లోనూ తన పార్టీని వీడనని, వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్‌ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలని జగన్‌ను సీబీఐ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారు. ఈ కేసులో జగన్‌తో పాటుగా వైసీపీ నేత విజయ్‌సాయిరెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. జగన్‌ సంస్థల్లో రాంకీ పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీట్‌లో తన పేరును తొలగించాలని విజయసాయిరెడ్డి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది శ్రీరామ్‌ జనవరి 20న కోర్టులో వాదనలు వినిపించారు. జనవరి 26 వతేది రిపబ్లిక్ డే సందర్భంగా కోర్టుకు సెలవుకు కావడంతో జగన్ కోర్టుకు రాలేదు.

cbi court 03022018 2

ఇదే కేసు పై సిబిఐ వాదనలు వినిపించింది... వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వ్యాపారులకు 'మేళ్లు' చేకూరిస్తే... వారి నుంచి జగన్ పెట్టుబడులు రాబట్టి లబ్ది పొందారని ప్రత్యేక కోర్టుకు సీబీఐ నివేదించింది. 'మేళ్లు' చేకూర్చే జీవోలు ఇచ్చిన తర్వాతే జగన్ కంపెనీల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని వివరించింది. రాంకీ సంస్థ విషయంలోనూ ఇలాగే జరగడాన్ని గుర్తించాలని కోరింది... ఒక పథకం ప్రకారం పారిశ్రామికవేత్త లతో జగన్ తన సంస్థల్లోకి పెట్టుబడులు పెట్టించారని, ఈ కుట్రలో విజయసాయిరెడ్డికి పాత్ర ఉందని సీబీఐ నివేదించింది.

cbi court 03022018 3

జగన్ సంస్థల్లో రాంకీ పెట్టుబడులకు సంబంధించిన కేసులో తమ పేర్లు తొలగించాలంటూ జగన్, సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ వేర్వేరుగా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ఈ సందర్భంగా సీబీఐ స్పెషల్ పీపీ కె.సురేందర్ వాదనలు వినిపించారు. జగన్, సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ నేరం చేశారనేందుకు ఆధారాలు ఉన్నాయనీ, వీరు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 9కి వాయిదా వేశారు.

Advertisements

Latest Articles

Most Read