జగన్ వ్యవహార శైలి నచ్చక, వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అని వార్తలు నిన్న, విజయవాడలోనే కాక, రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టించాయి... రాధా ఒక్కడే కాకుండా, అనేక మంది కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులని కూడా తన పాటు తీసుకువెళ్తున్నారు అని జగన్ కు తెలియటంతో, జగన్ అలెర్ట్ అయ్యారు... తన పార్టీ సీనియర్ నాయకులని రాధా దగ్గరకు బుజ్జగించటానికి పంపించారు... కాని రాధా మాత్రం జగన్ బుజ్జగింపులకు లొంగలేదు అనే వార్తలు వచ్చాయి... కాని జగన్ పార్టీ నాయకులు మాత్రం యధావిధిగా ఖండ ఖండాలుగా ఖండించారు...
రాధా తన ఊపిరి ఉన్నంత వరకు జగన్ ను వీడడు అని రొటీన్ గా మీడియా ముందు హడావిడి చేసారు... సీన్ కట్ చేస్తే, రాధా మీడియాతో మాట్లడారు... రాధా మాత్రం ఏదీ సూటిగా చెప్పలేదు... నేను పార్టీ మారితే మీ అందరికీ చెప్పే మారతాను... తెలుగుదేశంలోకి వెళ్తున్నాను అన్నది మీ ప్రచారమే అంటూ మీడియాతో అన్నారు... మీరు వైకాపాలోకి వెళ్ళిపోతున్నారు అని వార్తలు గుప్పు మంటే ఎందుకు మాట్లడటం లేదు, . వైకాపాను వీడటం లేదని స్వయంగా ఎందుకు చెప్పడం లేదన్న ప్రశ్నకు, దేనికైనా సమయం రావాల్సి ఉందని నర్మగర్భ సమాధానం ఇచ్చారు.
తన పని తాను చేసుకు వెళుతున్నానని, పార్టీ మారాలని భావిస్తే, పక్కా ప్రణాళికతోనే వెళ్తానని స్పష్టం చేశారు. తాను వెళ్లి పార్టీలో చేర్చుకోవాలని ఎవరితోనూ చర్చించలేదని రాధ చెప్పారు. తనకు టీడీపీ నేతల్లో బంధువులు, స్నేహితులు ఉన్నారని, వారితో కలుస్తుంటానని చెప్పిన ఆయన, ప్రతి సంబంధాన్నీ రాజకీయాలతో ముడేయరాదని అన్నారు. వైకాపా నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అంగీకరించిన ఆయన, అలాగని పూర్తి దూరంగా ఏమీ లేనని అన్నారు... తన రాజకీయ భవిష్యత్తు గురించి తనకు తెలుసునని, పార్టీ మారాలని భావిస్తే, కంగారుపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని, అందరికీ చెప్పిన తరువాతే వెళతామని అన్నారు. మొత్తానికి రాధా మాటల్లో జగన్ పై అసంతృప్తి ఉందన్న విషయం అర్ధమవుతుంది.. అలాగే తెలుగుదేశంలో చేరిక విషయం కూడా ఆయన ఖండిచకపోవటం, అలాగే జగన్ పార్టీలో సమస్యలు ఉన్నాయి అని చెప్పటం, రాధా పార్టీ మారటం ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నాయి...