ముఖ్యమంత్రి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు... మీతో విసిగిపోయాను, ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి చేస్తే, ఇక మిమ్మల్ని వదులుకోవటమే అంటూ చెప్పి, దావోస్ పర్యటనకు వెళ్ళారు... నిన్న జరిగిన వర్క్‌షాప్‌లో పార్టీలో కొంత మంది క్రమశిక్షణ తప్పుతున్న నేతల పై చంద్రబాబు ఫైర్ అయ్యారు.. మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీల పై చంద్రబాబు సీరియస్ అయ్యారు... వారికి లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరించారు... మీ వల్ల నేను ప్రజల్లో తెచ్చుకుంటున్న పోజిటివ్ మూడ్ పోతుంది, ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజలు గమనిస్తున్నారు అంటూ, గెట్టిగా చెప్పారు...
‘పద్ధతి మార్చుకోండి, ఇదే చివరి వార్నింగ్’ అంటూ సీఎం హెచ్చరించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు వేలుపెడుతున్నారని, నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దనే మీకు ఎమ్మెల్సీలు ఇచ్చాం.. ఎమ్మెల్యేలతో గొడవ పడాల్సిన అవసరం మీకేంటని ప్రశ్నించారు. ‘‘మీ వల్ల ఓట్లు పోయే పరిస్థితి తెస్తున్నారు. ఇలాగే కొనసాగితే మిమ్మల్ని వదిలేస్తా. మరోసారి ఎమ్మెల్సీ ఇవ్వను. పద్ధతి మార్చుకోండి, ఇదే చివరి వార్నింగ్’’ అంటూ ఎమ్మెల్సీలను చంద్రబాబు హెచ్చరించారు.
ఎమ్మెల్సీలకే కాదు, ఎమ్మల్యేలకు కూడా ఇలాంటి వార్నింగే ఇచ్చార్... చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలకు ఇక కష్టకాలమేనని, పనిచేయకపోతే మీకు ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు హెచ్చరించారు... చంద్రబాబు మాట్లాడుతూ... ‘నేనే వచ్చి మీ దగ్గర నిరహార దీక్ష చేస్తా... అప్పుడైన మీమీద ఒత్తిడి పెరుగుతుంది’ అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపిస్తే పనిచేయకపోతే ఎలా... అని ప్రశ్నించారు. మూడు జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎమ్మల్సీల విషయంలో, చంద్రబాబు వార్నింగ్ ఇచ్చింది కరణం బలరాంకేనేమో అని, నేతలు గుసగుసలాడుకున్నారు...