బ్రాహ్మణి స్టీల్స్... వైయస్ రాజశేఖర రెడ్డి, ద్వారా లబ్ధి పొంది, రాయలసీమలో బ్రాహ్మణి స్టీల్స్ అనే ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాడు గాలి జనార్దన్ రెడ్డి ... ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ జగన్ పాత్ర కూడా అందరికీ తెలిసిందే... తరువాత బండారం బయట పడి, ఇద్దరూ వేరు వేరు కేసుల్లో జైలుకి కూడా వెళ్లి వచ్చారు.. ప్రస్తుతం ఇద్దరూ బెయిల్ పై బయట ఉన్నారు... ఇప్పుడు ఈ "బ్రాహ్మణి ఇండస్ట్రీస్" పై డీఆర్ఐ (డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్) సీరియస్ అయ్యింది... బ్రాహ్మణి ఇండస్ట్రీస్, అన్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది అంటూ, మిషనరీ సీజ్ చేసింది... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
కడప జిల్లాలోని బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌కు సంబంధించిన రూ.189 కోట్ల విలువైన యంత్రాలను డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ సీజ్ చేసింది. 2009లో చెన్నై ఓడరేవు నుంచి బ్రాహ్మణి ఇండస్ట్రీస్ యంత్రాలను దిగుమతి చేసుకుంది... బ్రాహ్మణి ఇండస్ట్రీస్ డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. విదేశాల నుంచి తీసుకొచ్చిన యంత్రాలను బ్రాహ్మణి ఇండస్ట్రీస్ ఇక్కడ ఉపయోగించడం లేదు. అవి ఎక్కడ ఉన్నాయో, అసలు ఉన్నాయో లేదో, లేక అమ్ముకున్నారో తెలీదు... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి గాలి జనార్దన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. దీంతో ఆయన జగన్‌తో కలిసి పలు వ్యాపారాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చెలిమితో గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ లీజు పొందారు. ఇందులో భాగంగానే ఆయన రాయలసీమలో బ్రాహ్మణి స్టీల్స్ అనే ఉక్కు కర్మాగారాన్ని కూడా స్థాపించారు. ఆ కర్మాగారానికి ముడి ఇనుమును వాడుకోవడానికి ఓబుళాపురం గనులను కట్టబెట్టారు. బ్రాహ్మణి స్టీల్స్ పూర్తయ్యే వరకు ముడి ఇనుమును అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు. దాంతో గాలి జనార్దన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్‌ను పక్కన పెట్టేసి పెద్ద యెత్తున ముడి ఇనుమును ఎగుమతి చేసి కోట్లాది రూపాయలు సంపాదించి, చివరకు జైలు పాలు అయ్యారు కూడా...