వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి, చంద్రబాబు ఎలాంటి ప్రత్యర్ది అనేది అందరికీ తెలిసిందే... అలాంటి చంద్రబాబు పై, ఇప్పటికీ మూడు సార్లు పోటీ చేసిన వ్యక్తికి, జగన్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో తెలిస్తే, జగన్ మనస్తత్వం ఎలాంటిదో అర్ధమవుతుంది... సహజంగా చంద్రబాబు లాంటి బలమైన నేతను ఎదుర్కుని పోటీలో ఇన్నాళ్ళు ఉంటూ వస్తున్నారు అంటే, జగనే ఆయన్ను అన్ని విధాలుగా ఆదుకోవాలి... కాని, ఇక్కడ రివర్స్... ఎలాగూ ఓడిపోతాడు, అతన్ని లెక్క చేసే అవసరం ఏముంది, అలా పడి ఉంటాడు అనుకుని, కనీసం లెక్క చెయ్యక, అవమానాలు పాలు చేస్తే, ఆ నాయకుడు చివరికి జగన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక, మీడియా ముందు కన్నీళ్లు పెట్టున్నారు... చివరకు చంద్రబాబు దగ్గరకు వచ్చారు...
చిత్తూరు జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ , కుప్పం నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకుడు మునుస్వామిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు . ముఖ్యమంత్రి నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభలో మునుస్వామిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి కి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. గతంలో కుప్పం నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మూడుసార్లు తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పై మునుస్వామిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2006లో చిత్తూరు జిల్లాపరిషత్ చైర్మన్ అయిన మునుస్వామిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డికి ముఖ్య అనుచరుడిగా పేరు పొందారు.
వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబానికి మద్దతు ప్రకటించడంలో భాగంగా జగన్ వెంట నడిచారు. జగన్ అవమానపరిచే విధంగా ప్రవర్తించడంతో ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నా కుప్పం నియోజకవర్గం అభివృద్ధి,తనను నమ్మిన ప్రజల క్షేమం సేవలు చేసుకునే అవకాశం కోసం తెలుగుదేశంలో చేరుతున్నట్లు మునుస్వామిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రకటించారు. మునుస్వామిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి వెంట జిల్లా, మండల, గ్రామ , పురపాలకా సంఘ వార్డు సభ్యుల స్థాయిల్లో 654 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం తీరులోనే మిగిలిన నియోజకవర్గాల్లో ప్రజలు, రాజకీయా నేతలు ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. తెలుగుదేశంపార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు చేయగలుగుతామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సైతం వస్తాయని పేర్కొన్నారు. రాజకీయాలు ముఖ్యం కాదు రాష్రాభివృద్ధి ధ్యేయంగా అందరూ ఆకలిసికట్టుగా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు.