యోగా ఆసనాలు, వ్యయాయం ఇలా ఏది తీసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు దాంట్లో ఎక్స్పర్ట్... యోగా ఆసనాలు అయితే, ఒక ప్రొఫెషనల్ చేసినట్టు చేస్తారు.. అనేక సందర్భాల్లో, యోగా దినోత్సవం లాంటి రోజుల్లో చూస్తూ ఉంటాం, చంద్రబాబు ఎంత ఉత్సాహంగా ఆసనాలు వేస్తారో... ఆయనతో పోటీ పడలేక, మిగతా వారు ఆపసోపాలు పడే వారు.... అలా, అందరినీ ఉత్సాహపరిచే చంద్రబాబు, ఈ సారి మాత్రం చూస్తూ కూర్చున్నారు... ఈ ఉదయం విజయవాడలో జరిగిన 'సూర్యారాధన' కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆసనాలకు మాత్రం దూరంగా ఉండిపోయారు.
వందలాది మంది విద్యార్థులు, మంత్రులు, ఎమ్మెల్యేలు యోగాసనాలు చేస్తుండగా, ఆయన మాత్రం వారిని చూస్తూ కూర్చున్నారు... తన కుడి చేయి సరిగా పనిచేయడం లేదని, ఇప్పటిదాకా పదిసార్లు ఫిజియోథెరపీ చేయించుకున్నానని నిన్న చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే... ఎలాంటి ఒత్తిడి చేయి మీద ఉంచొద్దు అని, ఆసనాలు వేయవద్దని ఫిజియో థెరపిస్టులు సూచించటంతో, వారి సలహా మేరకు చంద్రబాబు కూర్చుండిపోయారు...
ఆదివారం ఉదయం 7 గంటలకు విజయవాడ మునిసిపల్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి పాల్గొని ‘సూర్య వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యుడు జస్టిస్ చక్రవర్తిలాంటి వాడని సీఎం అభివర్ణించారు... బీద, ధనిక తారతమ్యాలు లేకుండా సూర్యుడు అందరికీ వెలుగులు ఇస్తాడని అన్నారు. అలుపెరుగకుండా ప్రపంచమంతా క్రమశిక్షణతో వెలుగులు పంచే బాధ్యతను నిర్వర్తించే సూర్యునికి రోజూ నమస్కారం చేస్తే చాలా మంచిదని, డి-విటమిన్ వస్తుందని అన్నారు. చైతన్యమూర్తి అయిన సూర్యుడిని ఆరాధిస్తే మనం నిత్య ప్రేరణ పొందొచ్చవచ్చని అన్నారు ..