గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోడీ చేసిన వ్యాఖ్యలతో, అనంతపురంలో పాదయత్ర చేస్తున్న జగన్ ఉలిక్కి పడ్డాడు... మోడీ ఇలా అన్నారు ఏంటి అని, పార్టీ సీనియర్ నాయకులతో పంచుకున్నారు... ఇప్పుడిప్పుడే బీజేపీతో దగ్గర అవుతున్నాం అనుకుంటుంటే, మోడీ ఇలా అన్నారు ఏంటి అంటూ జగన్ తెగ బాధ పడుతున్నారు... గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోడీ, రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కప్టబెట్టాలంటేనే రాజకీయ పార్టీలు 17 సార్లు ఆలోచిస్తాయి. అలాంటిది కాంగ్రెస్ ఏకంగా జాతీయ అధ్యక్ష పదవే కట్టబెడుతోంది. అవినీతి కేసులో నిందితునిగా ఉండి బెయిల్ పై బయట ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికోవడం ఆ పార్టీ దివాలాకోరుతనానికి నిదర్శనం అన్నారు...
ఈ వ్యాఖ్యలు జగన్ కు డైరెక్ట్ గా తగిలాయి... రాహుల్ గాంధీ కేసు ఒక చిన్న కేసు... ఆ కేసుకే, మోడీ ఇలా మాట్లాడుతున్నాడు అంటే, 11 కేసుల్లో A1 గా ఉంటూ, 16 నెలలు జైల్లో ఉండి వచ్చి, బెయిల్ పై నాలుగు సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్న నా పరిస్థితి ఎని అంటూ జగన్ సన్నిహితుల దగ్గర వాపోయారు... బెయిల్ పై బయట ఉన్న వ్యక్తి అంటూ రాహుల్ ని అంటున్నా, ఆ వ్యాఖ్యలకు జగన్ కూడా బాగా బాధపడుతున్నారు... రాహుల్ గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసు ఒక అభియోగమే, మన బండారం తొందరలోనే కోర్ట్ తెల్చేస్తుంది, ఈ లెక్కన మోడీ నా అంతు చుస్తాడేమో అని జగన్ బాధపడుతున్నారు...
నిజానికి మోడీ వాడుకుని వదిలిసే రకం... ఎవర్ని అయినా దగ్గరకు తీస్తున్నాడు అంటే, వారి పతనమే... మొన్న శశికళ నెత్తి మీద చెయ్యి వేసి, నెల రోజులు తిరగకుండా జైలుకి పంపారు... జగన్ కి కూడా ఇలాగే అప్పాయింట్మెంట్ ఇచ్చారు, మరి నెక్స్ట్ ఏంటో తెలియాలి... 2019కి జగన్ ని దెగ్గరకు తీసినా, అది రాజకీయ ప్రయోజనమే... తరువాత అయినా జగన్ జైలుకు వెళ్లక తప్పదు... మోడీ చెప్పినట్టు రాహుల్ బెయిల్ మీద తిరుగుతుంటే, ఇక్కడ జగన్ ఏకంగా జైలుకి వెళ్ళొచ్చి, బెయిల్ పై బయట తిరుగుతూ, ప్రతి శుక్రవారం కోర్ట్ కి పోతున్నాడు... మరి మోడీ ఇలాంటి వాడిని ఎందుకు దగ్గరకి తీస్తున్నారో ?