జిఈఎస్ సదస్సులో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఐటి అంటే ఇవాంక ట్రంప్ అని అద్భుతంగా మాట్లాడారు... ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కు మాట్లాడటం రాదు అంటూ, సోషల్ మీడియాలో సైకో సోషల్ మీడియా ఫాన్స్ మళ్లీ వీడియోలు పోస్ట్ చేసి శునకానందం పొందుతున్నారు. ఇవాంకా వచ్చిన దగ్గర నుండి జిఈఎస్ సభ వరకూ అన్ని వేదికల్లో చంద్రబాబే కనిపించినా, ఆయన్ని కనీసం ఈ సభకి ఆహ్వానించక పోయినా ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి తన పని సైలెంట్ గా చక్కబెట్టుకొని వెళ్లాడు... ఐటి అంటే ఇవాంకా ట్రంప్ అనే అంత తెలివి తేటలు ఆంధ్రా ఐటి మంత్రికి లేక ఐటి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏమి లేని రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకురావాలి, పెట్టుబడులు ఆహ్వానించాలి అని తన తండ్రి నిర్మించిన సిటీ లో ఏం చేసాడు చూడండి....

lokesh 03122017 2

జిఈఎస్ సదస్సుకు ఆహ్వానం లేదు, కానీ మంచి కంపెనీలు అక్కడికి వస్తాయి. వారిని ఎలా అయినా కలవాలి అనే సంకల్పంతో యునైటెడ్ స్టేట్స్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం ఛైర్మన్ జాన్ టి చాంబర్స్ అపోయింట్మెంట్ సంపాదించి అతనికి మన రాష్ట్ర పరిస్థితిలు,రాష్ట్రంలో ఉన్న వనరులు ,ఇబ్బందులు గురించి వివరించి రాష్ట్రానికి సహకరించాలి అని కోరాడు. అక్కడితో ఆగిపోలేదు సదస్సు జరిగే ఒక్క రోజు ముందే సభకు వచ్చే పారిశ్రామికవేత్తలు అందరిని కలిసాడు లోకేష్. అజుర్ పవర్ కంపెనీ డైరెక్టర్ వాధ్వ,ఉబర్ ఇండియా అండ్ సౌత్ ఆసియా హెడ్ అమిత్ జైన్,వెంకలాసెన్ అసోసియేట్స్ డైరెక్టర్ హేమంత్ సందు, ఫస్ట్ సోలార్ కంపెనీ సుజయ్ గోష్ , జిఈ కంపెనీ సీఈఓ విశాల్ వాన్ చౌ,ఎమ్ఎస్డి ఫార్మా డైరెక్టర్ వాసుదేవ్ ఇలా సదస్సు కు వచ్చిన వారి అందరిని వారు ఉంటున్న హోటల్ కి వెళ్లి మరీ రాష్ట్రం గురించి జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించి సైలెంట్ గా అమరావతి కి వెళ్లి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యాడు...

lokesh 03122017 3

అయితే లోకేష్ అసెంబ్లీ ఒక రోజు ఎగ్గొట్టి హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నాడు అని కొన్ని పత్రికల్లో సర్వ సాధారణంగా రసాయి... నిధులు లేవు,లోటు బడ్జెట్,హైదరాబాద్లో లా తినడానికి వండి వడ్డించిన బిర్యానీ లేదు అయినా తండ్రి చూపించిన మార్గం ఉంది. ఫైల్ పట్టుకొని ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి రాష్ట్రం అభివృద్ధి చెయ్యాలనే సంకల్పం ఉంది అంటూ లోకేష్ రోజుకి 14 గంటలు తిరుగుతుంటే, ఇంకా జగన్ సోషల్ మీడియా మాఫియా లోకేష్ నే టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూ వీడియోలు పెట్టడాన్ని చూస్తే లోకేష్ గురించి జగన్ ఎంత భయపడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.... ప్రజా సమస్యలు మీద స్పందిస్తే, ప్రజల కోసం పని చేస్తే, మీరు ఎంత గేలి చేసినా, ప్రజలు ఆదరిస్తారు... ప్రజలకి ఎవరేంటో తెలీదు అనుకుంటే, అది మీ భ్రమ... మీరు పొందే తాత్కాలిక ఆనందం, మీరు చేసే పిచ్చి వీడియోలోతో, రాష్ట్రంలో ఉన్న ఒక్కరికి కూడా ఉపయోగం ఉండదు... దానికంటే ప్రజా సమస్యలు మీద వీడియోలు చేసుకుంటో, ఎవరో ఒక్కరన్నా మిమ్మల్ని నమ్ముతారు...

మన ప్రతిపక్షం, మిత్రపక్షం కూడా చంద్రబాబుని అకరానంగా విమర్శిస్తుంటే, మగిలిన రాష్ట్రాల్లో మాత్రం, చంద్రబాబు విధానాలకు ఫిదా అవుతున్నారు... ఇప్పటికే పవర్ సెక్టార్ లో ముఖ్యమంత్రి దేశానికి ఆదర్శం అయ్యారని ఇప్పటికే వివిధ రాష్ట్రాలు చెప్పాయి... మొన్న గవర్నర్ కిరణ్ బేడీ కూడా 1100ని అభినందించారు... ఇలా చాలా మంది వివిధ సందర్భాల్లో చంద్రబాబు విధానాలని మెచ్చుకున్నారు... ఇప్పుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని అభినందిస్తూ ట్వీట్ చేశారు...

stalin 03122017 2

సమాజంలో హిజ్రాలకు ఎదురవ్వుతున్న చిన్నచూపుని గుర్తించి, హిజ్రా వెల్ఫేర్ బోర్డును స్థాపించి వారి సంక్షేమంకోసం కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు... హిజ్రాలకు వెయ్యి రూపాయలు పెన్షన్‌ రేషన్‌ పంపిణీతో పాటు, ఇల్లు కూడా కట్టించే ప్రతిపాదనలో ఉన్నామని అన్నారు.. వాళ్లకు కావాల్సిన అన్ని పథకాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.. ఈ విషయం ప్రస్తావిస్తూ తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ ట్వీట్ చేశారు... మా తలైవార్ నాయకుడు కరుణానిధి, మా పార్టీ హిజ్రాల హక్కుల కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నామని, వారికి పెన్షన్ పధకం పెట్టినందుకు చంద్రబాబుకి అభినందనలు అని, తమిళనాడు ప్రభుత్వం కూడా, చంద్రబాబు చేసినట్టు చెయ్యాలి అని, వారిని ఆదుకోవాలని ట్వీట్ లో రాశారు..

stalin 03122017 3

సమాజంలో మూడవ తరగతి ప్రజలుగా బ్రతుకు పోరాటంలో హిజ్రాలు ఎదుర్కొనే సమస్యలు అనేకం. సామాజికంగా.. రాజకీయంగా.. ఏవిధంగా చూసుకున్నా.. ఎందులోను వారికి తగిన ప్రాధాన్యం లేదు. కనీస తిండికి, బట్టకు నోచుకోని స్థితిలో చాలామంది హిజ్రాలు అత్యంత ధీనంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇవన్నీ తన పాదయాత్రలో చుసిన చంద్రబాబు, అప్పుడే వీరికి హామీ ఇచ్చారు... ఇప్పుడు హామీ నెరవేర్చారు... ఇప్పటికే చంద్రబాబు చేసిన పనికి కృతజ్ఞతగా, చంద్రబాబు రూపం కలిగిన ఐదుకేజీల ఇత్తడితో సీఎం చంద్రబాబు నాయుడుకి గుడి కట్టనున్నట్లు సమతా హిజ్రా హక్కుల ఐక్య పోరాట వేదిక స్థాపకుడు విజయ కుమార్ తెలిపారు. ఈ గుడిని కర్నూల్ జిల్లా నంద్యాల్ టౌన్ హిజ్రా కాలనీ లో దాదాపు 10 లక్షల వ్యయంతో దీన్నినిర్మిస్తున్నారు.

ఈమె, ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్... రెండు నెలల క్రితం వైజాగ్ స్నూకర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో, ముఖ్యమంత్రి పూనం కౌర్‌ తో మాట్లాడి, ఆమెను రాష్ట్రానికి చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసడర్ గా నియమించారు... అయితే, మన తెలుగు వారిని పెట్టకుండా, ఎక్కడ నుంచో వచ్చిన వారిని పెట్టుకోవటం ఏంటి అనే విమర్శలు వచ్చాయి... నిజానికి, మన హైదరాబాద్ సినీ హీరోలకు, మిగతా నటులకు మన రాష్ట్రం అంటే చిన్న చూపు.. అనేక సందర్భాల్లో అది చూసాం... నిన్న కాక మొన్న నందుల గోల కూడా చూసాం... అలాంటి వారి కంటే, ఈమె చాలా నయం...

poonam 03122017 2

నెల రోజుల క్రిందట ఆమెకు అప్పగించిన బాధ్యత కోసం, ఏకంగా ఆమె పుట్టిన రోజు నాడే రంగలోకి దిగారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి వచ్చిన ఆమె చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారి మధ్యే పుట్టిన రోజు జరుపుకున్నారు... నిన్నా తాజాగా ఆమె మరో సారి, ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసడర్ పాత్ర పోషించారు.. పూనమ్‌ శుక్రవారం అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్‌ ఒబామాను కలిశారు. భారత్‌ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం న్యూదిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూనమ్‌ ఆయన్ను కలిసి ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలను బాహుమతిగా ఇచ్చారు...

poonam 03122017 3

ఇది మన అనుకునే హైదరాబాద్ లో ఉండే తెలుగు హీరోలకి, ఎక్కడ నుంచో వచ్చి మన కోసం ప్రచారం చేస్తున్న పూనమ్ కౌర్ కి తేడా... మన రాష్ట్రం అంటే కనీసం ప్రేమ లేని వారికి, మన రాష్ట్రానికి సంబంధించిన బ్రాండ్ అంబాసడర్ హోదా ఎందుకు ఇవ్వాలి ? అందుకే ఎక్కడ నుంచో వచ్చిన పూనం కౌర్ ని చేనేత బ్రాండ్ అంబాసడర్ చేశారు చంద్రబాబు... తప్పేముంది, దీంట్లో... ఎక్కడి నుంచో వచ్చిన పూనం కౌర్‌, మన రాష్ట్రంలోని ఒక మారు మూల ఊరిలో తన పుట్టిన రోజు వేడుకులు, చేనేత కార్మికలు కష్టాలు తెలుసుకుంటూ జరుపుకున్నారు, ఇవాళ అమెరికా మాజీ అధ్యక్షుడికి మన చీనేత వస్త్రాలు బహుకరించారు... మరి మాన హైదరాబాద్ సినిమా బ్యాచ్ కంటే, ఈవిడ చాలా నయం కదా...

మనిషి దేవుడిముందు, మనస్సుమాత్రం బయటవదిలిన చెప్పులమీద ఉన్నట్టుంది వైసీపీ నాయకుల తీరు. కాలినడకన తిరపతికి వెళ్లారు బాగానేవుంది, ప్రశాంతంగా దర్శనం చేసుకుని వస్తే ఎంత బావుంటుంది... కానీ అలా చేస్తే వైసీపీ నాయకులు ఎందుకు అవుతారు, రోజా ఎందుకవుతుంది ? తనతో పాటు 50 మందిని దర్శనానికి తీసుకువెళ్ళింది రోజా.. అందరకీ ఎల్ 1 టిక్కెట్లపై (వీఐపీ టిక్కెట్లు) కేటాయించాలి అని రచ్చ చేసింది... ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఎల్ 1 టిక్కెట్ కేటాయించకుండా అధికారులు అవమానించారంటూ హడావిడి చేసింది...

roja 03122017 2

రోజా చేసిన రచ్చతో టిటిడి అధికారులు రంగంలోకి దిగారు.. నిబంధనల మేరకు ఎమ్మెల్యేతో పాటు 8 మందికి ఎల్‌ 1 టిక్కెట్లు, ఇద్దరికి ఎల్‌ 2 కింద జారీ చేస్తామని అధికారులు సమాచారం ఇచ్చి, వాటిని కేటాయించారు. అయినా రోజా నాకు 50 మందికి ఎల్ 1 టిక్కెట్లు (వీఐపీ టిక్కెట్లు) కావాల్సిందే అంటూ శ్రీ వారి సన్నిధిలో రచ్చ రచ్చ చేశారు... అప్పటికీ టిటిడి అధికారులు మరింత తగ్గారు... మరో పది మందికి ఎల్‌ 2 కింద జారీ చేసేందుకు అధికారులు అనుమతించారు. అయినా రోజా శాంతించలేదు.... తాను కోరిన వారందరికీ టిక్కెట్లు ఇవ్వాలని, లేని పక్షంలో తనకు కేటాయించిన టిక్కెట్లు కూడా అవసరం లేదని రంకెలు వేసింది రోజా... చివరకి దర్శనం చేసుకుని బయటకు వచ్చి, మళ్ళీ అవే పిచ్చి వాగుడు...

roja 03122017 3

శ్రీ వారి ఆలయం ముందు నుంచిని, ముఖ్యమంత్రి చంద్రబాబు, తిరుమల జేఈవో శ్రీనివాసరాజుని తిట్టింది... ఎవడో కొన్‌కిస్కా వస్తే వంగి వంగి 100 లడ్లు ఇస్తారు అంటూ బూతులు మాట్లాడారు... ఇది ఆలయ ప్రాంగణం అని చెప్పినా వినలేదు... జీఈవో శ్రీనివాస రాజు ప్రభుత్వానికి సూటుకేసులు అందిస్తున్నాడని ఆరోపణ చేశారు... ఇంతటితో అయిపోలేదు, ఆలయం ఎదుట రోజా అనుచరులు హడావుడి చేశారు. నానా హంగామా చేస్తూ, భక్తులని ఇబ్బంది పెట్టారు... వాహనాలపై నిలబడి ఊరేగుతూ కనిపించారు....ఇది తప్పు అని సిబ్బంది చెప్తున్నా, వినకుండా నినాదాలు చేస్తూ, శ్రీ వారి ఆలయంలో రెచ్చిపోయారు... నిజానికి ఇది టిటిడి అధికారుల అలసత్వం కూడా, సామాన్య భక్తులని చిన్న చిన్న వాటికే ఇబ్బంది పెడతారు కాని, వీరు పదే పదే చేస్తున్న పిచ్చ పనులని మాత్రం నిలువరించలేక పోతున్నారు...

Advertisements

Latest Articles

Most Read