జగన్, బిజేపీ పార్టీకి లొంగిపోయాడు అని అందరికీ తెలిసిన విషయమే... కాని, అది బీజీపీకి మద్దతా, విలినీమా అనే విషయం దగ్గర ప్రతిష్టంబన వచ్చింది.. జగన్ తన కేసులు రాజీ కోసం, ప్రధాని మోడీతో అపాయింట్మెంట్ తీసుకుని చర్చించటం, తరువాత ప్రత్యేక హోదా విషయం అస్సలు పట్టించుకోకపోవటంతో, జగన్ పూర్తిగా లొంగిపోయాడు అని ప్రజలకి అర్ధమైపోయింది... సరిగ్గా ఇలాంటి అవకాశం కోసం చూస్తున్న బీజీపీ పార్టీ కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఎదగటానికి, జగన్ ను కలుపుకోవాలని, జగన్ పార్టీ బీజీపీలో విలీనం చేస్తే, కేసులు ఎత్తేస్తాం అని ఒప్పందం అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఇలా వస్తూ ఉండగానే, గ్లోబల్ ఎంటర్ ప్రైన్యూర్ సమ్మిట్ కోసం హైద్రాబాద్ వచ్చిన బిజేపీ నేత, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తో, జగన్ భార్య భారతీరెడ్డి సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయం అవుతోంది.

sushma 04122017 2

బీజీపీతో కలిసిపోవటానికి వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తూన్న జగన్, హైదరాబాద్ వచ్చిన సుష్మా స్వరాజ్ తో, తన భార్య చేత మంతనాలు జరిపారు... వాస్తవ పరిస్థితులు వివరిస్తూ, జగన్ కేసులు గురించి ప్రస్థావిస్తూ, రాజకీయంగా బిజేపీ, వైఎస్ఆర్ పార్టీ కలిసి వెళ్ళే విషయం ఇలా, అన్నీ సుష్మా స్వరాజ్ తో, భారతీరెడ్డి చర్చించారు... మైనింగ్ డాన్, గాలి జనార్ధన్ రెడ్డికి అత్యంత ఆప్తురాలు అయిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, జగన్ ను ఒడ్డున పడేస్తారు అనే నమ్మకం జగన్ పార్టీలో ఉంది. సుష్మా స్వరాజ్, గాలి జనార్ధన్ రెడ్డి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. సుష్మా, గాలి నా సొంత కొడుకు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో జగన్, గాలి ద్వారా, సుష్మా స్వరాజ్ ద్వారా మంతనాలు కొనసాగిస్తున్నారు....

sushma 04122017 3

సుష్మా స్వరాజ్ ని కలిసిన తరువాత, భారతీరెడ్డి చాల హుషారుగా ఉన్నారని లోటస్ పాండ్ వర్గాలు అంటున్నాయి... సుష్మా స్వరాజ్ నుంచి సానుకూల సంకేతాలు అందటం, ఇటు తెలుగుదేశం పార్టీతో బీజేపీ దూరంగా జరగటం, ఇవన్నీ జగన్ కు కలిసి వచ్చే అంశాలు అని అంటున్నారు... ఆయితే ప్రధాని మోడీ, అవినీతి పై యుద్ధం అంటూ, ఇలా గాలి జనార్ధన్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి లాంటి దొంగలతో కలుస్తూ, ఎలాంటి సంకేతాలు ప్రజలకు ఇస్తున్నారు ? ఇలాంటి అవినీతి సామ్రాట్ లతో కలిసి, అవినీతి పై యుద్ధం అంటే, ఎవరన్నా నమ్ముతారా ? చూద్దాం ఇది ఎటు దారి తీస్తుందో...

ఈయన అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు ఎలా అయ్యాడో, అసలు పాదయత్రలో ఏమి చెప్తున్నాడో, మనకి ఈ దౌర్భాగ్యం ఏంటో... మూడు సంవత్సరాలు అయ్యింది, ఈయనగారికి ఇప్పటికీ పట్టిసీమ అంటే ఏంటో తెలీదు... పట్టిసీమ నీరు రాయలసీమకు ఎందుకు రావట్లేదు అని వాదించే మూర్ఖుడు... ముఖ్యమంత్రి అసెంబ్లీలో దండం పెట్టి చెప్పారు... ప్రతి ఒక్క ప్రతి పక్ష ఎమ్మల్యే పేరు చదువుతూ, మీకు ఇప్పటికైనా పట్టిసీమ అంటే ఏంటో అర్ధమైందా అని అడిగారు.... అయినా జగన్, ఇవాళ కూడా, పట్టిసీమ నుంచి రాయలసీమకు చుక్క నీరు రాలేదు అంటున్నాడు... మరో పక్క, పట్టుసీమ ద్వారా చెంబుడు నీళ్ళు ఇచ్చారు అంటున్నారు... మరో పక్క 50 టి.ఎం.సి ల నీళ్లు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి పోయాయి అంటున్నారు... చెంబుడు నీళ్లు పోస్తే, 50 టి.ఎం.సి లు ప్రకాశం
బ్యారేజీ ద్వారా సముద్రంలోకి ఎలా పోతాయి? రెండూ అబద్దాలే... అసలు ఈ సంవత్సరం చుక్క నీరు కూడా ప్రకాశం బ్యారేజి నుంచి కిందకు వదల్లేదు...

pattiseema 04122017 2

ఇక పొతే పట్టిసీమ, రాయలసీమ... విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాలకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం తప్పనిసరిగా మారింది... కాని పోలవరం పూర్తీ చేయాలంటే కనీసం 4 నుండి 6 సం కాలం పడుతుందని అంచనా... అదేసమయంలో ప్రతి ఏటా 3000 టీ ఎం సి ల వరద నీరు గోదావరి నుండి వృధాగా బంగాళాఖాతం లో కలుస్తున్నాయి... వృధాగా పోయే ఈ వరద నీటిలో కొంత భాగాన్ని మళ్ళించి కృష్ణా నదికి అనుసంధానం చేస్తే కృష్ణా జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకు నీరు అందించుతూ, తద్ద్వారా ప్రకాశం బరాజ్ కు (కృష్ణా జిల్లా ) విడుదల చేయవలసిన కృష్ణా నికర జలాలను శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దనే నిలువ వుంచి అక్కడి నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా క్షామ పీడిత రాయలసీమ జిల్లాలకు నీరు అందించాలనే భగీరధ ప్రయత్నం లో భాగమే పట్టిసీమ ఎత్తిపోతల పధకం. పట్టిసీమ నీళ్ళు కృష్ణా డెల్టా ప్రజలు వాడుకుంటారు.... శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకు ఇచ్చే నీళ్ళు రాయలసీమకు మళ్ళిస్తారు... ఇది పట్టిసీమ వళ్ళ రాయలసీమకు కలిగే లాభం... ఈ నీరు రాయలసీమకు, కడపకు అవసరంలేదు అని జగన్ ను చెప్పమనండి చూద్దాము..

pattiseema 04122017 3

అంతే కాని ప్రకాశం బ్యారేజి దగ్గర ఉన్న పట్టిసీమ నీళ్ళు రాయలసీమకు తీసుకువెళ్ళరు... జగన్ గారు, మీ పార్టీలో ఎవరన్నా అంత ఇరిగేషన్ ఎక్స్పర్ట్ లు ఉంటే, అది ఎలా సాధ్యమో చెప్పండి, ముఖ్యమంత్రిని అందరం కలిసి ముఖ్యమంత్రిని అడుగుదాం... శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా, రాయలసీమకు నీళ్ళు ఇస్తుంటే, మీ సాక్షి పేపర్ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీళ్ళు తోడేస్తుంది అని తెలంగాణా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారు... మీ విధానం ఏంటో, మీరేంటో, మీకన్నా తెలుస్తుందా జగన్ గారు ? అసలు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాద్దు అంటారా ? పట్టిసీమ ఆపేసి, శ్రీశైలంలో ఉన్న నీళ్ళు అన్నీ కృష్ణా డెల్టాకు ఇచ్చేసి, రాయలసీమకు ఎండబెట్టమంటారా ? ముందు మీరు పాదయాత్ర ఆపేసి, కృష్ణా డెల్టా ఏంటి ? రాయలసీమ ఏంటి ?

రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మ హత్యలే ఉంటాయి అంటారు... ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో పోటీ పడుతున్నారు... పన్నెండు రోజుల పాటు జరిగిన శాసనసభా సమావేశాలను బహిష్కరించడం ద్వారా వైసీపీ నాయకత్వం తప్పలో కాలేసింది. శనివారంతో ముగిసిన సమావేశాల్లో కీలకమైన అంశాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని నిలబెట్టి, నిలదీసే అవకాశాన్ని తమ నాయకత్వం చేతులారా పోగొట్టుకుందన్న ఆవేదన వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తమవుతోంది. చివరకు తాము వేసిన ప్రశ్నలపైనే అధికార పార్టీ సభ్యులు మంత్రులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారని, అదే తాము హాజరయ్యి ఉంటే మరిన్ని ప్రశ్నలు సంధించి ప్రభుత్వాన్ని ఇరికించేవాళ్లమని వాపోతున్నారు.

jagan 03122017 2

సభను బహిష్కరించడం ద్వారా తాము సాధించిందేమీ లేకపోగా, ప్రభుత్వం సాధించిన విజయాలే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లాయని, దాన్ని అడ్డుకునే అవకాశం నాయకత్వం దూరం చేసుకుందన్న వ్యాఖ్యలు వైసీపీ ఎమ్మెల్యేలలో వినిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన నీరుద్యోగ భృతి, అమరావతి నిర్మాణం, గృహ నిర్మాణాలు, కాపులకు రిజర్వేషన్, పోలవరం, పరిశ్రమలు, వ్యవసాయం వంటి అంశాల పై తాము చేసిన హోంవర్క్ అంతా జగన్ తీసుకున్న నిర్ణయంతో వృధా అయిందని వాపోతున్నారు. వీటిలో అమరావతి నిర్మాణం, పోలవరం, నిరుద్యోగ భృతి అంశాల పై బయట రోజూ ప్రభుత్వాన్ని ఆరోపణలతో ముంచెత్తామని, అదే సభకు హాజరై ఉంటే ప్రభుత్వం నుంచి మరిన్ని వివరణలు సాధించే వారమని చెబుతున్నారు..

jagan 03122017 3

అమరావతి, పోలవరం నిర్మాణాల పై తాము సభలో లేకపోవడంతో ప్రభుత్వం చెప్పిందే ఏకపక్షంగా జనంలోకి వెళ్లిందని, అదే తాము సభలో ఉంటే ఆ రెండు అంశాల పై ప్రభుత్వం అంత సులభంగా వ్యవహరించి బయటపడేది కాదంటున్నారు. ప్రధానంగా పోలవరం పై డాక్యుమెంట్లనీ తీసుకుని ఉంచుకున్నాం. కానీ, దానిని సభలో నిలదీసే అవకాశం లేకుండా పోయిందని ఓ ఎమ్మెల్యే వాపోయారు. "వచ్చే ఏడాదిలో కూడా కచ్చితంగా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా బహిష్కరించి ఇంట్లో కూర్చునే నిర్ణయం తీసుకుంటారా? మా బాసుకు ఎవరు సలహాలిస్తున్నారో తెలియదు. ఇలా అయితే ఎమ్మెల్యే లుగా ఉండటం వృధా అని మరో ఎమ్మెల్యే వాపోయారు.

పోయిన ఏడాది జూన్ నెలలో, ఆంధ్రప్రదేశ్ లో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలి అంటూ, హైదరాబాద్ లోని మారియట్ అనే ఫైవ్ స్టార్ హోటల్ లో, తెలంగాణాలో నివసించే వారు అంతా సమావేశం అయ్యి, చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చారు... వారిలో దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు, ప్రముఖ నటుడు చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, వైఎస్సార్ సీపీ నాయకులు బొత్సా సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు... అప్పట్లో ఈ సమావేశం పై విమర్శలు కూడా వచ్చాయి... ఒక పక్క రిజర్వేషన్ కావలి అంటూ, ఇలా ఫైవ్ స్టార్ హోటల్లలో మీటింగ్ ఏంటి అంటూ, ప్రశ్నలు కూడా వేశారు...

kapu 03122017 2

సరే అది అంతా చరిత్ర.. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాపులకి 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది... నిర్ణయం తీసుకున్న 24 గంటలకు కక్క లేక మింగలేక ముద్రగడ స్పందించారు... అభినందిస్తూనే, 5 కాదు 10 శాతం కావలి అన్నారు... కాని ఆ రోజు హైదరాబాద్ స్టార్ హోటల్ మీటింగ్ పెట్టి, చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చిన వారు మాత్రం, ఒక్కరు అంటే ఒక్కరు కూడా స్పందించలేదు... దాసరి నారాయణ రావు గారు అంటే కాలం చేసారు కాబట్టి, వారిని పక్కన పెడదాం... మరి చిరంజీవి గారు, బొత్సా గారు, పళ్లంరాజు గారు ఏమైపోయారో...పాపం వారికి ఇంకా కబురు తెలిసి ఉండదు... కనీసం ఒక కృతజ్ఞత కూడా ఇప్పటి వరకు చెప్పలేదు...

kapu 03122017 3

ఇప్పటకే చాలా మందికి వీరికి కాపులకి రిజర్వేషన్ అనే సమస్య కంటే, రాజకీయమే ముఖ్యం అని అర్ధమైంది... వీరికి చంద్రబాబుని ఇబ్బంది పెట్టటం కావలి, రాష్ట్రం రావణ కాష్టంలా తగల బడటం కావాలి... అందుకే చంద్రబాబు సమస్య పరిష్కరించగానే, కక్క లేక మింగలేక, ఎలా స్పందించాలో తెలీక, ఇబ్బంది పడుతూ, ఇప్పటి వరకు మౌనంగా ఉండి పోయారు... ఇది వీరికి కాపుల పట్ల ఉన్న చిత్తశుద్ది... వీళ్లకు కావలసింది రాజకీయమే తప్ప కాపుల మేలు కాదు... వీళ్లకు కావలసింది స్వలాభాలే తప్ప కాపుల లాభాలు, ప్రయోజనాలు కాదు...

Advertisements

Latest Articles

Most Read