వారు తెలంగాణా యువత... తెలంగాణా యువతకి, కెసిఆర్ ఆంధ్రా నాయకుల మీద ఎలా నూరి పోసారో అందరికీ తెలిసిందే... చంద్రబాబు అంటే అక్కడ చాలా మంది మనసుల్లో విష భీజాలు నాటారు... ముఖ్యంగా తెలంగాణా యువతకి బాగా వ్యతిరేక భావం ఎక్కించారు... అలాంటి తెలంగాణా యువత ఇవాళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫొటోలకి పాలాభిషేకాలు చస్తున్నారు తెలంగాణ నిరుద్యోగులు... తెలంగాణ నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి అభిషేకం చేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా ?

telangana 07122017 2

మహబూబ్‌నగర్‌లో డీఎస్సీ నిరుద్యోగులు గురువారం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. బుధవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 12370 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని డీఎస్సీ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

telangana 07122017 3

ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ రావడంతో తెలంగాణలోని నిరుద్యోగులు నిరాశతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘పొరుగు రాష్ట్రంలో రెండో నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఇంకా తొలి నోటిఫికేషనే పూర్తి కాలేదు. టీఎస్‌పీఎస్సీకి మాత్రం మూడు రెట్లు జీతాలు పెంచారు’ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్థుల ఉద్యమాలతో గద్దెపై కూర్చున్న దొంగలు ఇప్పటికైనా మారాలని డిమాండ్ చేశారు... తెలంగాణా సమాజం, ముఖ్యంగా యువత ఇలా స్పందిచటం నిజంగా ఆశ్చర్యం... ఆయన విలువ ఇప్పుడు తెలుస్తుంది వారికి... ఇక్కడ కుల పిచ్చ ఫాన్స్, సైకో అభిమానులు, మైకం నుంచి బయటకు రండి... ఈయన మనకున్న అతి పెద్ద ఆస్తి... కాపాడుకుందాం... మన భవిష్యత్తు కోసం...

పోలవరంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకేసారి కౌంటర్ ఇచ్చారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళాలి అని, శ్వేత పత్రం విడుదల చెయ్యాలి అని, ఇద్దారు కోరారు.... అలాగే, జగన్ పవన్ పోలవరం గురించి ఎలా ఆలోచిస్తున్నారో కూడా చెప్పారు చంద్రబాబు... పొలవరంపై కొంతమంది శ్వేతపత్రం అడుగుతున్నారని, ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి రోజు ఆన్‌లైన్‌లో పెడుతున్నామని చెప్పారు. అడ్డంకులు పెట్టడానికి సాకులు వెతుకుతున్నారని, రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్దారు. మొన్నటివరకు కాంట్రాక్టర్‌ను సపోర్టు చేస్తున్నామని విమర్శించారని, ఇప్పుడు కాంట్రాక్టర్‌ను సపోర్టు చేయడంలేదని అంటున్నారని ముఖ్యమంత్రి అన్నారు...

cbn 07122017 2

ఇక్కడ అఖిలపక్షం చేసే పనికంటే... కేంద్రమే చేయాలని అన్నారు. పవన్ ఒక యాంగిల్‌లో ఆలోచిస్తున్నారని, ఆయన ఆలోచనంతా ప్రాజెక్టు పూర్తి కావాలని... వైసీపి అయితే ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తోందని, మొన్న కూడా లేఖలు రాసి, ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చిందని ఆయన అన్నారు... వైసీపీ నేత‌లకు ఇప్ప‌టికైనా స్ప‌ష్ట‌మైన వైఖ‌రి ఉందా? పోల‌వ‌రం ప్రాజెక్టు ముందుకు వెళుతోన్న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్లి అభ్యంత‌రాలు తెలిపింది... గ‌తంలో ప‌ట్టిసీమ‌ను కూడా అడ్డుకోవాల‌ని చూశారు. ప్రాజెక్టులు ఆపాల‌ని కోర్టులో కేసులు వేశారు అని అన్నారు.

cbn 07122017 3

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ర‌కంగా ఆలోచిస్తున్నారు.. పోల‌వ‌రం ప్రాజెక్టు ఎలాగైనా పూర్తికావాలన్న‌దే ఆయ‌న ఆలోచన‌. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలాకాదు.. ఆ పార్టీ నేత‌లు దీనిపై ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు.. ఏదో ఒక విధంగా ప్రాజెక్టుకు అడ్డంకులు తేవాలి. నేను కూడా చేయ‌లేక‌పోయాన‌న్న బుర‌ద చ‌ల్లాలి... ప్రాజెక్ట్ అడ్డుకోవాల‌ని చూస్తున్నారు అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. మూడురోజుల దక్షిణకొరియా పర్యటన ముగించుకుని నిన్న‌ రాత్రి చంద్ర‌బాబు విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్ర‌బాబు మాట్లాడారు.

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల నుంచి, జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు... నాకు అధికార దాహం లేదు... అధికారం విలువ, బాధ్యత తెలుసు.. ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు పరిష్కరిస్తానని చెప్పను... ముఖ్యమంత్రి కావలి అంటే అనుభవం ఉండాలి... ప్రజల పక్షాన నిలబడటానికి అధికారం అవసరం లేదు అంటూ పవన్ జగన్ పై వ్యాఖ్యలు చేసారు... నిజానికి ఈ వ్యాఖ్యల్లో నిజం లేక పోలేదు... గన్ ప్రతి సందర్భంలోనూ నేనే సియం నేనే సియం అని అంటున్న విషయం తెలిసిందే... పాదయాత్రలో కూడా ఎవరు ఏ సమస్య చెప్పిన, ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ సమస్య పరిష్కరిస్తాను అంటూ వస్తున్నారు...

jagan 07122017 2

ఇలాంటి సంఘటన మళ్ళీ ఇంకోటి సాక్షిలో రాశారు... అది ఏంటి అంటే... "అన్నా నా పేరు కిరణ్ కుమార్, మా అమ్మానాన్న లీలావతి, వెంకట రాముడు. మాది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం బంటనహళ్లి, మేం చాలా నిరుపేదలం. అనారోగ్యంతో బాధపడుతున్న నేను నిదానంగా చూపు కూడా కోల్పోయా, మా అమ్మానాన్న భయపడి నన్ను వెంటనే హైదరాబాద్లోని నిజాం ఆస్ప త్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. బ్రెయిన్కు ఆపరేషన్ చేయాలని, లేకపోతే బతకడం కష్టమన్నారు. ఆపరేషన్ చేయాలంటే రూ.5 లక్షలవుతుందని తేల్చిచెప్పారు.

jagan 07122017 3

అన్నా నాకు ఇంకా బతకాలని, మా అమ్మానాన్నను బాగా చూసుకోవాలనుంది. ఆపరేషన్ కు అయ్యే ఖర్చు భరిస్తే, నాకు పునర్జన్మ ప్రసాదించిన పుణ్యమొస్తది' అంటూ కిరణ్ కుమార్ వైఎస్ జగన్తో గుత్తి సభలో మొరపెట్టుకున్నారు. దీనిపై జగన్ స్పందిసూ "మా పార్టీ అధికారంలోకి రాగానే ఆపరేషన్ చేయిస్తానని అభయమిచ్చారు." అయ్యా జగన్ గారు, ఆయన ఏమో బ్రెయిన్ కు ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారు... మీరేమో మీరు అధికారంలోకి వచ్చే దాకా ఆయన్ను ఆపరేషన్ చేయించుకోవద్దు అంటున్నారు... అయినా, 5 లక్షలు ప్రభుత్వం ఇవ్వదా ? మీరు ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తే సియం రిలీఫ్ ఫండ్ ఇవ్వదా ? సరే ప్రభుత్వం ఇవ్వటం లేదు, మీరు, మీ పార్టీ వారు అందరూ ఒక 5 లక్షలు ఇవ్వలేరా ? దీనికి కూడా మీరు అధికారంలోకి రావాలా ? ఇందుకు కాదు, మిమ్మల్ని అందరూ తిట్టేది...

నిన్న కామెడీ చానల్స్ TRP రేటింగ్స్ అన్నీ దాటుకుంటూ, సాక్షి టీవీలో జగన్, కొమ్మినేని ఇంటర్వ్యూ సూపర్ హిట్ అయ్యింది.. ఆయన అడగటం, ఈయన ముసి ముసి నవ్వులు నవ్వటం... అయినా సొంత ఛానల్ లో పని చేస్తున్న వ్యక్తి చేత ఈయన ప్రశ్నలు అడిగించుకోవటం, దానికి ఈయన గొప్పగా సమాధానం చెప్పటం... దీనికి సాక్షి స్పెషల్ ఎఫెక్ట్స అదనం... నా అంత నిజాయితీ పరుడు ఈ తెలుగు గడ్డ మీదే పుట్టలేదు అని చెప్పాడు జగన్... ఇన్ని కబుర్లు చెప్పి, జగన్ ఇవాళ పాదయాత్ర ఆపి హైదరాబాద్ బయలుదేరాడు... గార్లదిన్నె మండలం బాపినేపాళ్యంలో...పాదయాత్ర ముగించుకుని ఆయన హైదరాబాద్‌‌కు పయనమయ్యారు.

jagan 07122017 1 3

అక్రమాస్తుల కేసులో, రేపు సీబీఐ కోర్టుకు జగన్ హాజరుకానున్నారు... ఆయన 11 కేసుల్లో A1... బెయిల్ మీద షరతులతో బయట తిరుగుతున్నాడు... ఇప్పటికే సిబిఐ 43 వేల కోట్లు అవినీతి సొమ్ము నోక్కేసాడు అని కోర్ట్ కి చెప్పింది... ఈయన నాన్న ముఖ్యమంత్రి అవ్వక ముందు, ఆస్తలు అమ్ముకుని బ్రతికిన చరిత్ర నుంచి, ఇప్పుడు బంగాళాలు, ప్యాలస్ లు, ఎస్టేట్ లు, కంపెనీలు... మరి ఇవన్నీ ఎలా సంపాదించారు అని నిన్న కొమ్మినేని ఆ కామెడీ ఇంటర్వ్యూ లో అడిగి ఉంటే ప్రజలకు కొంచెం క్లారిటీ వచ్చేది...యువత కూడా, ఈయన ఎంత గొప్ప మేధో సంపత్త ఉన్నవాడో తెలుసుకుని, ఆ కిటుకులు వీళ్ళు కూడా వాడి, లక్ష కోట్లు సంపాదించుకునేవారు...

jagan 07122017 1 2

అయినా, కొమ్మినేని గారు అవినీతి మీద ప్రశ్నలు అడిగితే, నేను నిజాయితీ పరుడుని, చంద్రబాబు నన్ను ఇరికించాడు... నేను పోరాడుతున్నాను అని చెప్పారు... అవినీతి పరులుని జైలుకి పంపిస్తాను, నా కసి అది అని అన్నారు.. చివరకి పాదయాత్ర ఆపేసి, అవినీతి కేసుల్లో విచారణకు హాజరు కావటానికి, శుక్రవారం సులువు పెట్టి, హైదరాబాద్ వెళ్లారు... ఇలాంటి నాయకులు అవినీతి గురించి మాట్లాడటం, ఇలాంటి వాళ్ళని ఆ కొమ్మినేని ప్రశ్నలు అడగటం, సరిపోయింది...

Advertisements

Latest Articles

Most Read