రెక్కాడితేకానీ, డొక్కాడని నాయకపోడు కులస్తుల వాళ్ళు.... ఎన్నో ఏళ్ళుగా వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు... నాయకపోడు కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎప్పుడో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జిఓ ఇచ్చారు... అయితే తరువాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని తొక్కి పట్టాయి... మళ్ళీ ఇన్నేళ్ళకు వాళ్ళ జీవితాల్లో వెలుగు వచ్చింది... ఇన్నేళ్ళు నుంచి చేస్తున్న పోరాటం ఫలించింది... ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని కృషి దీని వెనుక చాలా ఉంది...

kesineni 25112017 2

ఎందుకంటే ఈ నాయకపోడు కమ్యూనిటీ ఎక్కువగా కృష్ణా జిల్లా విస్సన్నపేట, ఏ. కొండూరు మండలం తిరువూరు నియోజకవర్గల్లో ఉన్నారు.. అందుకే కేశినేని నాని ఈ సమస్యకి ప్రాధాన్యత ఇచ్చారు... నాయకపోడు కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎంపీ కేశినేని నాని గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది.... నాయకపోడు విద్యార్థుల భవిష్యత్తు మరియు ఉద్యోగాల కోసం చేస్తున్న పోరాటాన్ని గత పార్లమెంట్ సమావేశాలలో ఎంపీ నాని చర్చించడం జరిగింది....

kesineni 25112017 3

ఈ సమస్య పై చంద్రబాబు ప్రభుత్వం స్పందించింది... కృష్ణ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి నాయకపోడు కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చుటకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నాయకపోడు కమ్యూనిటీ విస్సన్నపేట, ఏ. కొండూరు మండలం తిరువూరు నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. నియోజకవర్గ ప్రజలు ఎంపీ కేశినేని నాని గారి కృషిని అభినందించడం జరిగింది. అలాగే ఇన్నాళ్లుకు తమ పోరాటాన్ని గుర్తించిన చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ నాయకపోడు కమ్యూనిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు...

ప్రతి పేద వాడికి, విజ్ఞానం, వినోదం కూడా అందించాలి అనే లక్ష్యంతో, చంద్రబాబు ప్రభుత్వం ఫైబర్ నెట్ తో, 150 రుపాయిలకే, ఫోన్, టీవీ, ఇంటర్నెట్ కలిపించటం కోసం, కృషి చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే కొన్ని చోట్ల కనెక్షన్ లు కూడా ఇస్తున్నారు... వచ్చే ఏడాది నాటికి రాష్ట్రం మొత్తం, ఈ కనెక్షన్ లు ఇవ్వనున్నారు... ఇప్పటికే రాష్ట్రం మొత్తం ఫైబర్ గ్రిడ్ కేబుల్ కూడా పెట్టారు... అయితే, ఎవరు కన్ను కుట్టిందో కాని, ప్రజలకు తక్కువ ధరకే కేబుల్ టీవీ, అంతర్జాలం, ఫోన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ సంస్థకు తలనొప్పలు ఎదురవుతున్నాయి.

fiber net 25112017 2

మొత్తం 2 వేల కిలోమీటర్ల మేర కేబుళ్లను ఈ సంస్థ అమర్చింది. కొన్ని వేల ఇళ్లకు కనెక్షన్ ఇచ్చింది. ఇప్పడు ఈ కేబుళ్లను కొందరు దొంగలు కత్తిరించేస్తున్నారు. కడప జిల్లా కేతవరం వద్ద ఒక జంక్షన్ బాక్సును ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా గాండ్లపర్తిలో కేబుళ్లను తెంచేశారు. ఆర్నెల్లలో ఇలాంటివి 120కిపైగా నమోదయ్యాయి. ఒక్కసారి కేబుల్ను కత్తిరిస్తే దాన్ని సరిచేసి ప్రసారాలు పునరుద్ధరించడానికి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ విషయం పై ఫైబర్నెట్ సీఈవో ఎ. బాబు డీజీపీ సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లారు. ఫైబర్నెట్ రాష్ట్ర ఆస్తి కాబట్టి దాన్ని ఎవరు కత్తిరించినా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

fiber net 25112017 3

ఇప్పటికే ఈ ఫైబర్ నెట్ మీద కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి... ఈ ప్రాజెక్ట్ ఆపెయ్యాలి అని, కోర్ట్ లో కేసులు కూడా వేసాయి... అయితే వీళ్ళ కుట్రలని కోర్ట్ తిప్పి కొట్టింది... ఇప్పుడు ఇలా కొంత మంది వైర్లు కట్టిరేస్తున్నారు... చాలా వరకు స్థానిక కేబుల్ ఆపరేటర్లకే ఈ ఫైబర్ నెట్ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి, వారి వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు... మరి, వైర్లు కత్తిరించాల్సిన అవరసరం ఏముంది ? దీనిలో రాజకీయ కోణం ఉందా అన్న విషయం కూడా దర్యాప్తు చేస్తున్నారు...

ముఖ్యమంత్రి కుర్చీ లక్ష్యంగా పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, తరువాత సాక్షి అవే మాటలు అందుకుని కట్టు కధలు అల్లటం... ఇది వరస... రాజకీయంగా ఎన్నో మాట్లాడవచ్చు కాని, మనమే స్వయంగా అందులో ఉండి, ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుంటూ కూడా, అబద్ధాలు ఆడితే ఎలా ? ఇక్కడ ఉంది చంద్రబాబు హైటెక్ ప్రభుత్వం... చేస్తుంది రియల్ టైం పరిపాలన... రాష్ట్రంలో ఏమి జరిగినా నిమిషాల్లో సియం డ్యాష్ బోర్డు లో అప్డేట్ అయిపోతూ ఉంటుంది... పాదయాత్రలో ఉన్న జగన్, ఇలాగే అబద్ధాలు ఆడుతూ దొరికిపోయారు... రాష్ట్రంలో ఎక్కడా ఎన్టీఆర్‌ వైద్యసేవలు అందడం లేదని రాష్ట్రం అనారోగ్యప్రదేశ్‌గా మారిందని జగన్‌ అన్నారు...

ntr trust 25112017 2

కాని వాస్తవానికి, పులివెందులలో జగన్ కు పిల్లనిచ్చిన మామ, శ్రీమతి వైఎస్ భారతి తండ్రి, డాక్టర్‌ ఇసి గంగిరెడ్డి ఆసుపత్రిక, దినేష్‌ నర్సింగ్‌ హోంకు, ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం వాస్తవం కాదా ? జగన్ మామ ఆసుపత్రిలో గత ఏడాది నుంచి ఇప్పటివరకు 198 మంది కి ఎన్టీఆర్ వైద్యసేవ క్రింద చికిత్స చేశారు. దీనికి గాను చంద్రబాబు ప్రభుత్వం వారికి 4941477 రూపాయల డబ్బులను ప్రభుత్వం వారి ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. వాస్తవాలు ఇవి అయితే జగన్ మాత్రం, ప్రజలకు అబద్ధాలు చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు...

ntr trust 25112017 3

అయ్యా జగన్ గారు, ఈ లింక్ లో రియల్ టైం డేటా అప్డేట్ అవుతుంది... ఇక్కడకు వెళ్లి చూడండి, ఎన్టీఆర్‌ వైద్యసేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అందుతున్నాయో తెలుస్తుంది... మీకు అర్ధంకాక పొతే , మీకు స్క్రిప్ట్ రాసిచ్చిన ప్రశాంత్ కిషోర్ ని చూడామని అడగండి... ఇక్కడ ఏమన్నా లోపాలు ఉంటే ఎత్తి చూపండి, అప్పుడు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు... అంతే కాని, మీ సొంత మామ హాస్పిటల్ లోనే ఎన్టీఆర్‌ వైద్యసేవలు అందిస్తూ, చంద్రబాబు ప్రభుత్వం దగ్గర మీ సొంత మామకే డబ్బులు ఇప్పించుకుంటూ, అబద్ధాలు చెప్తే, ప్రజలు హర్షించరు... http://www.core.ap.gov.in/CMDashBoard/UserInterface/HealthFamilyWelfare/NTRVaidhyasevaMainReport.aspx

ఈ క్షణాన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యర్ధి చంద్రబాబు కంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పవన్ కనుక ఆక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తే, ముఖ్యమంత్రి సంగతి తరువాత, ముందు అసలు ప్రతిపక్ష హోదానే కష్టం అంటూ, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్ తో జగన్ ఎప్పుడో అలెర్ట్ అయ్యారు... అందుకే పవన్ ఎప్పుడు ఏ సమస్య లేవనెత్తినా, పవన్ కళ్యాణ్ కి తోడూ ఉండాల్సింది పోయి, పవన్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ సాక్షిలో కధనాలు వస్తూ, సోషల్ మీడియా పైడ్ బ్యాచ్ తో, పవన్ ని ఘోరాతి ఘోరంగా తిట్టే కార్యక్రమం చేస్తున్నారు...

jagan party 25112017 2

ఎక్కడైనా ప్రతిపక్షంగా ఉంటూ, ఒక పార్టీ ప్రభుత్వంతో పోరాడి సమస్యలు పరిష్కరిస్తుంటే, ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీని సహకరించాల్సింది పోయి, పవన్ ని పర్సనల్ టార్గెట్ చెయ్యటం చూస్తుంటే, జగన్, పవన్ ని చూసి ఎంత భయపడుతున్నారు అర్ధమవుతుంది... అయితే తాజాగా, జనసేన మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద జనసేన ప్రధాన కార్యాలయం ఏర్పాటు చెయ్యటానికి సన్నాహకాలు చేస్తున్నారు... అయితే అక్కడ భూమి, మూడేళ్ళ పాటు లీజు పద్ధతిలో తీసుకున్నారు... ఈ విషయం, వైఎయస్ఆర్ పార్టీ, జగన్ సోషల్ మీడియా టీం, పవన్ ని టార్గెట్ చేస్తూ, మూడేళ్ళు లీజ్ అంటే, మూడేళ్ళలో పవన్ పార్టీ మూసేస్తారు అంటూ ప్రచారం చేస్తున్నారు...

jagan party 25112017 3

నిజానికి పవన్ ఎప్పుడూ చెప్తున్నట్టు, అంత భూమి అమరావతిలో కొనుక్కునే స్థోమత లేక, లీజు పద్ధతిలో భూమి తీసుకున్నారు... పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా, ఇలా లీజు కు తీసుకుంటూ ఉంటారు... ఇది తప్పుబట్టాల్సిన పని లేదు... అయితే, విజయవాడలో జగన్ చేసింది ఏంటి ? జగన్ పార్టీ విజయవాడలో పార్ధసారధికి చెందిన భూమిలో, తాత్కాలిక కార్యాలయం నిర్మించింది... మరి ఇది పెర్మనెంట్ ఎందుకు కాదు ? అంటే జగన్ కూడా పార్టీ ఎత్తేస్తాడా ? ఇప్పటి వరకు జగన్, ఒకే ఒకసారి అక్కడకు వచ్చారు.. పార్టీ కార్యక్రమాలు కూడా అక్కడ ఏమి జరగటం లేదు... ఇలా ఉన్న జగన్ పార్టీ, మంచి ఉద్దేశంతో వస్తున్న పవన్ కళ్యాణ్ ను అనటం ఆశ్చర్యంగా ఉంది అని రాజాకీయ పరిశీలకులు అంటున్నారు...

Advertisements

Latest Articles

Most Read