ఏడాది క్రితం రైతులు అక్కడ భూమి ఇచ్చారు... ఏడాది తిరగకుండానే కళ్ల ముందు బహుళ అంతస్థుల నిర్మాణంతో నిర్మాణం సిద్ధమైంది... అమరావతి మీద నిత్యం విషం చిమ్మే వారికి, ఇలాంటివి కనపడవ్.. కనీసం ఒక వార్త కూడా రాయరు... సాంకేతిక విద్యారంగంలో33 సంవత్సరాలుగా అగ్రగామిగా ఉన్న విద్యా సంస్థ వెల్లూరు ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పూర్తిస్థాయిలో తమ క్యాంపస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విట్ ఆంధ్రప్రదేశ్ అకాడమిక్ బ్లాక్ ను ప్రారంభించనున్నారు. ప్రజా రాజధాని అమరావతిని నాలెడ్స్ హబ్గా చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలు మేరకు అమరావతిలో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్శిటీ విట్. ఒక సంవత్సర కాలంలోనే తమ విద్యార్ధులకు సాంత భవనాలు అందుబాటులోకి తీసుకురావడం విశేషం. దాదాపు 2.11 లక్షల చదరపఅడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల మొదటి అకాడమిక్ బ్లాక్ను నిర్మించారు.

vit 28112017 1

అదే విధంగా క్యాంపస్ లోనే విద్యార్ధులు ఉండేందుక అనువుగా 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొమ్మిది అంతస్తుల బ్లాక్ ను నిర్మించారు. ఈ రెండు బ్లాక్ లను మంగళవారం ప్రారంభించనున్నారు. అకడమిక్ బ్లాక్కు పూర్వ రాష్ట్రపతి , విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్, హాస్టల్ భవనానికి నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు పేరు పెట్టడం విశేషం. జూలై 2016లో ఏపీ ప్రభుత్వం విట్ కి రెండు దశల్లో నిర్మించే విధంగా ఐనవోలులో రెండు వందల ఎకరాలు కేటాయిస్తూ జీవో ఇవ్వటం జరిగింది. 2016 ఆగస్టులో హయ్యర్ ఎడ్యుకేషన్ విట్ కి అనుమతిని ఇస్తూ ఎల్ఓఐ ఇవ్వగా 2016 అక్టోబర్లో సిఆర్డిఏ మొదటి విడతలో 100 ఎకరాలు కేటాయించడం జరిగింది. నవంబర్ 3, 2016లో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకమైన విట్ ఏపీకి శంకుస్థాపన చేశారు. జనవరి 7, 2017లో పూర్తి స్థాయి నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టి కేవలం పది నెలల కాలంలోనే విద్యార్ధులకు అన్ని హంగులతో భావనలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

ముఖ్యమంత్రి స్పీడ్ ను అర్ధం చేసుకున్నవిట్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ విశ్వనాధన్ నిత్యం పనులను పర్యవేక్షి అనతికాలంలోనే విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. జూలై 26, 2017న విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 650 మంది విద్యార్ధులు విట్ ఏపీ క్యాంపస్లో అడ్మిషన్లు తీసుకున్నారు అంటే వీట్ విద్యా సంస్థ పట్ల తలిద్రండ్రులకు విద్యార్ధులకు ఎంత నమ్మకం ఉందో అర్ధంచేసుకోవచ్చు. 24 రాష్ట్రాల విద్యార్ధులు మొదటి సంవత్సరంలో చేరగా, విట్ ఏపీ తమ విద్యార్ధులు చదువు పూర్తి అయిన వెంటనే కొలువుల్లో చేరే విధంగా అంతర్జాతీయ స్థాయిలో తమ కరిక్యులం తయారు చేసి, ఆ విధంగా విద్యార్ధులకు తర్పీదు ఇస్తున్నట్లు విట్ ఏపీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్. సంధ్యా రెడ్డి చెప్పారు. నిన్నటి వరకు పంట పొలాలుగా ఉన్న తమ ప్రాంతంలో పేరొందిన సంస్థలు రావడం పట్ల రాజధాని ప్రాంత రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇంత వేగంగా రాజధానిలో విద్యా సంస్థల ప్రాంగణాలు నిర్మితమౌ తాయని తాము ఊహించలేదని చెబుతోన్నారు. తమ పిల్లలు ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని లేదని, ఇక్కడే చదువుకొని స్థానికంగానే ఉద్యోగాలు పొందవచ్చని పేర్కొంటోన్నారు.

అమరావతిలో నూతనంగా నిర్మించిన వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(విట్‌) విశ్వవిద్యాలయం ఈ నెల 28 న ప్రారంభం కానుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. 3 లక్షల 21వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీని నిర్మించారు. ‘విట్‌’ విద్యా సంస్థల వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శేఖర్‌ విశ్వనాథన్‌ విజయవాడలో శనివారం మీడియాతో ఈ విషయం చెప్పారు. విట్‌ అమరావతిలో, 24 రాష్ట్రాలకు చెందిన 630 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ కోర్సు చదువుతున్నారని ఆయన తెలిపారు. అమరావతి పరిధిలో తమకు కేటాయించిన 200 ఎకరాలస్థలంలో ఈ నూతన భవనాల నిర్మాణాన్ని ఈ ఏడాది జనవరిలో చేపట్టి రికార్డు సమయంలో 3 లక్షల 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినట్లు ఆయన చెప్పారు.

vit 27112017 2

అయితే రేపు విట్‌ లో రెండు బిల్డింగ్స్ ఓపెన్ చెయ్యనున్నారు.. వాటికీ పేర్లు, ఒకదానికి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, రెండోదానికి సరోజినీ నాయుడి పేర్లు పెట్టారు... సర్వేపల్లి రాధాకృష్ణన్ మన రాష్ట్రం వారు కావటం, మన తెలుగు వారి పేర్లు పెట్టటం మనకు కూడా ఎంతో గర్వ కారణం... అలాగే నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన సరోజినీ నాయుడు పేరు కూడా ఒక బిల్డింగ్ కి పెట్టారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేరు మీద అకాడమిక్ బ్లాక్, 5 ఫ్లోర్స్ లో, 2,11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అలాగే సరోజినీ నాయుడు పేరు మీద హాస్టల్ బ్లాక్, 9 ఫ్లోర్స్ లో, 110,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.

vit 27112017 3

విద్యా కేంద్రంగా అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఉన్నత విద్యా కేంద్రంగా మారనుంది. కొన్నేళ్లుగా విజయవాడ, గుంటూరు విద్యాకేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. వీటికి అమరావతి కూడా తోడైతే ఈ ప్రాంతం విద్యా కేంద్రాల హబ్‌గా మారనుంది. అమరావతికి ఒక్క విద్యారంగంలోనే సుమారు రూ.25వేల కోట్లకుపైగా పెట్టుబడులు రానున్నాయని అంచనా. ఇది కూడా తొలి దశలోనే. ఇప్పటికే వెల్లూరు ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(విట్‌), ఎస్‌ఆర్‌ఎం, మాతా అమృతానందమయి తదితర సంస్థల వర్సిటీలు నెలకొల్పేందుకు అమరావతిలో భూమిని కేటాయించారు. రాజధాని ప్రాంతంలోని ఐనవోలు, శాఖమూరు ప్రాంతాల్లో వీటికి భూములిచ్చారు. ఇప్పటికే విట్, ఎస్‌ఆర్‌ఎం తరగతులు కూడా ప్రారంభించాయి.

కడప ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు సీఎం చంద్రబాబు క్లాస్‌ తీసుకున్నారు. ఒక పక్క ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేయబోయే పోరాటం చెప్తూనే, తండ్రిలా మందలించారు... చిత్తశుద్ధితో మీ కోసం ప్రయత్నం చేస్తుంటే అల్లరి చేస్తారా? ఎంసీఐ, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతుంటే కనపడటంలేదా? అని విద్యార్థులను ప్రశ్నించారు. టవర్‌ ఎక్కి చనిపోతామని బెదిరిస్తారా అంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. మీకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని విద్యార్థులకు చంద్రబాబు చెప్పారు. టవర్ ఎక్కినప్పుడు ఏదన్నా జరగరానిది జరిగితే, మీ తల్లి తండ్రులు ఎమైపోతారు... చదువుకున్న మీరు ఇలా చెయ్యొచ్చా... మీకు బాధ ఉంది అని తెలుసు, కాని సెల్ టవర్ ఎక్కి చనిపోతాం అనటం పరిష్కరామా అంటూ, క్లాసు తీసుకున్నారు..

cbn fathima 27112017 2

సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోందని, తనను కలిసిన బాధిత విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి ఈమేరకు హామీ ఇచ్చారు. ఈ సమస్య జఠిలమైందని దీనిపై సంయమనం, సహనం పాటించాలని సూచించారు. విద్యార్ధులకు ఉపశమనం లభించేలా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బాధిత విద్యార్ధుల్లో ఇప్పటికే నీట్‌ అర్హత పొందినవారికి ఫాతిమా కళాశాలలో కానీ, మరే ఇతర కళాశాలలో అయినా సీటు పొందేలా ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు అనుమతికి ప్రయత్నిస్తామని అన్నారు.

cbn fathima 27112017 3

నీట్‌ అర్హత సాధించని మిగిలిన విద్యార్ధులు వచ్చే విద్యాసంవత్సరానికి అయినా అర్హత పొందేందుకు అవసరమయ్యే కోచింగ్ అందిస్తామని, ఇందుకయ్యే వ్యయాన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని తెలిపారు.
సమస్యపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా కొందరు విద్యార్ధులు కమిటీగా ఏర్పడాలని ముఖ్యమంత్రి సూచించారు. కాల్ సెంటర్ ద్వారా బాధిత విద్యార్ధులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, అధికారులు, విద్యార్ధులు కలిసి ఢిల్లీ వెళ్లి సమస్యను మరోమారు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్దేశించారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతితో పాటు, రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, టౌన్ లలో పచ్చదనం, సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమవరతిని మహానగరాన్ని అత్యంత ఆధునికంగా, సకల సౌకర్యాలతో పచ్చదనం, జలకళ(బ్లూ-గ్రీన్) ఉట్టిపడేవిధంగా అద్భుతంగా నిర్మించాలన్న ధృడ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగానే విజయవాడ, గుంటూరు, అమవారతిలో పచ్చికబయళ్లు, మోండో గడ్డి, మొక్కల పెంపకం, నడక దారుల నిర్మాణం వంటి సుందరీకరణ పనులు ఆకట్టుకుంటున్నాయి.

beautifiaction 27112017 2

గన్నవరం వెళ్ళే రహదారి ఎంతో ఆహ్లదకరంగా పచ్చదనం పరుస్తూ, స్వాగతం పలుకుతుంది. రకరకాల పూల మొక్కలు, పచ్చని చెట్లతో హైవే కళకళలాడుతోంది... అలాగే విజయవాడలోని అన్ని ప్రభుత్వ భావనల గోడలకు రంగు రంగుల బొమ్మలు వేస్తూ, మంచి లుక్ తీసుకువస్తున్నారు... మొన్నటిదాకా విజయవాడ బందర్ రోడ్డు లో మాత్రమే ఇలా గోడలకి రంగులు వేసారు... ఇప్పుడు ఏలూరు రోడ్డు వైపు కూడా వేస్తున్నారు... గుణదల కరెంటు ఆఫీస్ తో పాటు, సిద్ధర్దా మెడికల్ కాలేజీ గోడలకి కూడా రంగులు వేస్తూ చేస్తున్న సుందరీకరణ పనులు ఆకట్టుకుంటున్నాయి.

beautifiaction 27112017 3

అమరావతి ఒక్కటే కాకుండా, అన్ని పెద్ద నగరాల్లో, పట్టణాల్లో ఇలా చేస్తున్నారు... అలాగే ఒంగోలు లాంటి చిన్న నగరంలో ఫ్లైఓవరు ఒకటే కాదు ఇంచుమించుగా ప్రతీ వీధిలో గోడలపై పెయింటింగులు వేయించారు.. అలా అని చెప్పి ఏవో పెయింటింగ్లు వేయలేదు మనదైన చరిత్ర, వారసత్వాన్ని ప్రతిభింభించేలా, మన రాష్ట్రంలో ఉన్న కోటలు బొమ్మలు, పండుగుల గురించి, మన సంప్రదాయం, గుడిలు ఇలా మన రాష్ట్రాన్ని ప్రతిభంబించేలా బొమ్మలు వేస్తున్నారు... పక్క రాష్ట్రాలులాగా ఎవరో వచ్చినప్పుడు మాత్రమే హడావిడి చెయ్యకుండా, ప్రణాలికాబద్ధంగా, నిరంతరం కొనసాగిస్తున్నారు...

Advertisements

Latest Articles

Most Read